ఐఎఫ్ఎఫ్ఐలో రెండు శక్తిమంతమైన చిత్రాల ద్వారా మాతృత్వం, గుర్తింపు, చరిత్రను అన్వేషించిన గ్లోబల్ వాయిస్‌లు
జీవితం, రాజకీయాల ప్రాథమికాంశాలను వెల్లడిస్తూ అకినోలా రూపొందించిన 'మై ఫాదర్స్ షాడో'
మాతృత్వంలోని అనేక కోణాలను భావోద్వేగాలతో విడమర్చి చెప్పిన ‘మదర్స్ బేబీ’
రెండు పూర్తిగా భిన్నమైన కథనాలు, భావోద్వేగాలతో కూడిన 'మదర్స్ బేబీ', 'మై ఫాదర్స్ షాడో' చిత్రాల బృందాలు ఈ రోజు ఐఎఫ్ఎఫ్ఐ వేదికగా కళలు, జ్ఞాపకాలు, సినిమా సంబంధిత వాస్తవాలను ప్రతిబింబించే ఉత్సాహభరితమైన సంభాషణలో పాల్గొన్నాయి. 'మదర్స్ బేబీ' సినిమాటోగ్రాఫర్ రాబర్ట్ ఒబెరైనర్, ప్రొడక్షన్ డిజైనర్ జోహన్నెస్ సలాత్‌లతో పాటు, యూకే అధికారిక ఆస్కార్ ఎంట్రీగా... కేన్స్‌లో ప్రదర్శించిన తొలి నైజీరియన్ చిత్రంగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 'మై ఫాదర్స్ షాడో' చిత్ర దర్శకులు అకినోలా ఒగున్‌మేడ్ డేవిస్‌లు ఈ సెషన్‌లో పాలుపంచుకున్నారు.

జీవితాంతం గుర్తుండిపోయే లాగోస్ దినోత్సవం: అకినోలా అద్భుత చిత్రరూపకల్పన ప్రయాణం
సంభాషణను ప్రారంభిస్తూ అకినోలా... తన సోదరుడు రాసిన ప్రారంభ లఘు చిత్రం ఆధారంగా ‘మై ఫాదర్స్ షాడో’ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. 1993 నైజీరియా ఎన్నికల నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం... వారి చిన్ననాటి రాజకీయ ఉద్రిక్తతల జ్ఞాపకాలను ప్రతిబింబిస్తుంది.
తన సృజనాత్మక ప్రక్రియలో ఎక్కువ భాగాన్ని సహజత్వమే నడిపించిందని అకినోలా వివరించారు. "సూక్ష్మ కథ తండ్రి, ఆయన కుమారుల గురించినది కాగా... స్థూల కథ ఎన్నికలతో పాటు ప్రతిదీ మిళితం అయి ఉంటుంది" అని వివరించారు. ఒకే రోజు కథను చూపే ఈ చిత్ర కథను అకినోలా స్వేచ్ఛగా వర్ణించే ఎంపికగా పేర్కొన్నారు. "ఇది మాకు సహజంగానే ప్రేక్షకులను టెన్షన్ పెట్టేందుకు వీలు కల్పించింది. ప్రతిదీ ఒకే రోజులో జరగడంతో మేం కొనసాగింపు గురించిన ప్రతిబంధకాలను ఎదుర్కోలేదు. మేం భావోద్వేగంపైనే ప్రధానంగా దృష్టి పెట్టగలిగాం." అని ఆయన వివరించారు.

చిత్రరూపకర్త షూటింగ్ సమయంలో ఎదురైన భావోద్వేగపరమైన, సాంకేతిక అడ్డంకుల గురించి... ముఖ్యంగా బీచ్ సన్నివేశాల సమయంలో వేడి, శబ్ధాల కారణంగా 16mm ఫిల్మ్‌తో తలెత్తిన ఇబ్బందులను స్పష్టంగా వివరించారు. ఒక అంత్యక్రియల సన్నివేశం గురించి మాట్లాడుతూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు: "నేను రెండు రోజులు మంచం మీదే ఉండి ఏడ్చాను," అని అంగీకరిస్తూ... అలాంటి క్షణాలను "శక్తిమంతమైన చిత్రరూపకల్పనకు నిదర్శనాలు"గా ఆయన అభివర్ణించారు.
ఆయన ప్రసంగిస్తున్న సమయంలో... అకినోలా ప్రేక్షకులకు నైజీరియా నిర్మాణాత్మక సంగ్రహావలోకనం అందించారు. ఆయన నైజీరియా రాజకీయ దృశ్యం, భాషా వైవిధ్యం, చారిత్రక విద్యలోని అంతరాలనూ స్పృశించారు. ఇంగ్లీష్, క్రియోల్, స్ట్రీట్ వెర్నాక్యులర్ భాషలు ఈ చిత్రంలో ఉపయోగించామన్నారు. ఈ భాషా సరళత నైజీరియాను నిర్వచించే సామాజిక, సాంస్కృతిక సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తుందని అకినోలా తెలిపారు. ఆయన భావాలు సమకాలీన సినిమా చరిత్రలో తక్కువ ప్రాతినిధ్యం గల దేశం గురించి స్పష్టమైన చిత్రాన్ని చిత్రించాయి.
‘మదర్స్ బేబీ’ లో మాటల్లో చెప్పలేని, కలవరపెట్టే మాతృత్వపు కోణాలు
‘మదర్స్ బేబీ’ చిత్రం ప్రసవం తర్వాత దిక్కుతోచని స్థితిలో సాగే ఒక మహిళ ప్రయాణాన్ని ప్రదర్శించే భావోద్వేగ ప్రయాణం. సినిమాటోగ్రాఫర్ రాబర్ట్ ఒబెరైనర్ మాట్లాడుతూ, “ప్రసవ సమయంలో ఒక స్త్రీ ఎదుర్కొనే నిజమైన మార్పులను” తెలియజేయడమే తమ ప్రధాన ఉద్దేశమన్నారు.

ఈ చిత్రం ప్రముఖ ఆర్కెస్ట్రా నిర్వాహకురాలు జూలియా జీవితాన్ని అనుసరిస్తుంది. ఆమె ప్రయోగాత్మక సంతాన సాఫల్య ప్రక్రియ ద్వారా గర్భం దాల్చినప్పుడు... ఆమె ఏదో తెలియని అనుభూతిని పొందుతుంది. ప్రేక్షకులు "ఆమెతో ప్రయాణంలో తోడుగా ఉన్నట్లు అనుభూతి" కలిగించేందుకు వీలుగా దృశ్య విధానం రూపొందించామని రాబర్ట్ వివరించారు.
ప్రొడక్షన్ డిజైనర్ జోహన్నెస్ సలాట్ ఈ కథ ఇతివృత్త ప్రాముఖ్యతను స్పష్టం చేశారు: "ఇది మహిళలకు చాలా ముఖ్యమైన విషయం," అని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని "ఎక్కడైనా జరగగల" సార్వత్రిక కథనంగా అభివర్ణించారు. ఈ సినిమాకు తగిన ప్రపంచాన్ని సృష్టించడం సవాలుగా అనిపించినా చివరికి తాము ఎంచుకున్న ప్రదేశం "కథకు చక్కగా సరిపోయింది అనిపించింది." అని ఆయన పేర్కొన్నారు.
ఈ సినిమాలో టెన్షన్ నిశ్శబ్దంగా పెరుగుతుంది: బిడ్డ పట్ల తల్లి ఎలా స్పందిస్తుంది... ఇతరులు ఎలా స్పందిస్తారనే సూక్ష్మమైన వ్యత్యాసాన్ని చూపించామన్నారు. "అక్కడే ఉత్కంఠ మొదలవుతుంది" అని రాబర్ట్ పేర్కొన్నారు. సినిమా ఓపెన్-ఎండ్ క్లైమాక్స్ గురించీ ఆయన చర్చించారు. దీనిని ప్రేక్షకులు స్వయంగా పరిష్కరించుకోవాల్సిన పజిల్‌గా ఆయన అభివర్ణించారు.
గణనీయ మార్పును సాధించే వ్యూహం: పునరావిష్కరణగా సినిమా చిత్రీకరణ
రెండు చిత్రాల బృందాలు చిత్రనిర్మాణాన్ని నిరంతరం అభివృద్ధి చెందుతున్న ప్రక్రియగా భావించాయి. ‘మదర్స్ బేబీ’లో... సినిమాలోని తరువాతి భాగంలో ఉద్దేశించిన షాట్లు కొన్నిసార్లు ప్రారంభంలోకి వచ్చాయని రాబర్ట్ వివరించాడు. దర్శకుడు తనకు “భావోద్వేగాలు ముందు వస్తాయి, కొనసాగింపు కాదు” అని గుర్తు చేసే వరకు సినిమాటోగ్రాఫర్‌గా తాను మొదట్లో వ్యతిరేకించిన నిర్ణయాలే ఇవని ఆయన పేర్కొన్నారు.

చిత్రనిర్మాణం తరచుగా ఊహించని గమ్యస్థానాలకు దారితీస్తుందని గమనించినట్లు జోహన్నెస్ అంగీకరించారు: “కొన్నిసార్లు మీరు అనుకున్న దానికంటే మెరుగైన ప్రదేశంలో మీరు ముగిస్తారు.” అన్నారు. అకినోలా: “మీరు సినిమాను మూడుసార్లు పూర్తి చేస్తారు - రాసేటప్పుడు, షూటింగ్ చేస్తున్నప్పుడు, ఎడిటింగ్ చేస్తున్నప్పుడు.” అని వివరించారు. దృష్టి మళ్లడం అంటే పక్కదారి పట్టడం కాదనీ సరికొత్త ఆవిష్కరణలకు మార్గమని ఆయన వివరించారు.
సెషన్ ముగింపు సమయానికి ఏకకాలంలో సంభవించే విభిన్న, విరుద్ధ అనుభవాల సంగమంగా ఈ చిత్రాలు నిలిచాయి: ఈ రెండు చిత్రాలను విభిన్న ప్రదేశాలలో చిత్రీకరించారు. స్వభావం, కళాత్మక సత్యం, కథను చెప్పడం అనే అనూహ్య ప్రయాణంలోని సాధారణ విశ్వాసం ద్వారా ఇవి రెండూ పరస్పరం అనుసంధానమయ్యాయి.
పీసీ లింక్:
ఐఎఫ్ఎఫ్ఐ గురించి:
1952లో ప్రారంభమైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం దక్షిణాసియాలోనే పురాతనమైన, అతిపెద్ద సినిమా వేడుకగా నిలుస్తుంది. నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్... భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ... గోవా రాష్ట్ర ప్రభుత్వం... గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవం ప్రపంచ సినిమాకు ప్రధాన కేంద్రంగా ఎదిగింది. ఇక్కడ అలనాటి అపురూప చిత్రాలు, సాహసోపేతమైన ప్రయోగాత్మక చిత్రాలు, లెజెండరీ మాస్ట్రోలు, నిర్భయంగా రూపొందించిన తొలి సినిమాలు ఒకే చోట కలిసి ఈ వేడుకలకు హాజరైన ప్రేక్షకులను అలరిస్తాయి. అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్‌క్లాస్‌లు, ఘన నివాళులతో పాటు... ఆలోచనలు, ఒప్పందాలు, సహకారాలకు అపార అవకాశాలను అందించే శక్తిమంతమైన వేవ్స్ ఫిల్మ్ బజార్ వంటి కార్యక్రమాలు ఐఎఫ్ఎఫ్ఐని మరింత అద్భుత వేదికగా మార్చుతున్నాయి. నవంబర్ 20–28 వరకు అందమైన గోవా తీరప్రాంతంలో ప్రదర్శితమయ్యే 56వ ఎడిషన్.... ప్రపంచ వేదికపై భారత సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించే ఒక అద్భుతమైన వేడుకగా... భాషలు, శైలులు, ఆవిష్కరణలు, స్వరాల అద్భుత సంగమంగా నిలుస్తుంది.
మరింత సమాచారం కోసం, క్లిక్ చేయండి:
IFFI Website: https://www.iffigoa.org/
PIB’s IFFI Microsite: https://www.pib.gov.in/iffi/56/
PIB IFFIWood Broadcast Channel: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
X Handles: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
* * *
Release ID:
2194408
| Visitor Counter:
3