లింగ భేదం సరిహద్దులను చెరిపేసిన ‘లాలా అండ్ పాపీ’ చిత్ర విశేషాలను పంచుకున్న చిత్ర బృందం
ప్రామాణికత, ప్రాతినిధ్యానికి సంబంధించిన శక్తివంతమైన అంశాలతో ఆకర్షణీయంగా నిలిచిన వీర్, సూరజ్
లింగ భేదం అనే సరిహద్దులకు అతీతంగా గుర్తింపు, అంగీకారం గురించి జరిగిన సంభాషణ
ముంబయి నగరంలో తీసిన సున్నితమైన, లింగ వైవిధ్య ప్రేమకథ అయిన ‘లాలా అండ్ పాపీ’ చిత్ర బృందం ఈ రోజు ఐఎఫ్ఎఫ్ఐలో ఒక పత్రికా సమావేశాన్ని నిర్వహించింది. ఈ చిత్ర ప్రయాణం, దాని సామాజిక నేపథ్యం, వాస్తవ పరిస్థితులను యథాతథంగా చిత్రీకరించటం గురించి వారు మాట్లాడారు. పేర్ల కంటే ప్రేమను, లింగ ద్వంద్వత్వం కంటే మానవత్వాన్ని, ప్రదర్శన కంటే ప్రామాణికతను కేంద్రంగా చేసిన ఈ సినిమా గురించి దర్శకుడు కైజాద్ గుస్తాద్, నిర్మాత బాబీ బేడీ, నటులు వీర్ సింగ్- సూరజ్ రాజ్‌ఖోవా చర్చించారు.
కథను నిజాయితీగా చెప్పడం: ముందు మనుషులు తర్వాతే లింగం
దశాబ్దాల పాటు ప్రధాన స్రవంతి చిత్రాలను నిర్మించిన తరువాత ఈ ప్రాజెక్ట్‌కు మద్దతు ఇచ్చే విషయాన్ని నిర్మాత నిర్మాత బాబీ బేడీ పంచుకున్నారు. దీనితోనే కార్యక్రమం ప్రారంభమైంది. "ప్రేక్షకులు స్వీకరించడం వల్లనే ప్రతి పెద్ద సినిమా పెద్దది అవుతుంది" అని ఆయన అన్నారు. ‘లాలా అండ్ పాపీ’ కూడా అదే దిశలో పయణిస్తోంది. ఈ సినిమా కథలో నిజాయితీ, మన అనే భావన ఉన్నాయని ప్రధానంగా చెప్పారు. ఈ చిత్రం గత సంవత్సరం గోవాలోని ఐఎఫ్ఎఫ్ఐలో ఫైనల్లో ఎంపికైందని తెలియజేసిన ఆయన.. చట్టం ఇప్పుడు పలు రకాల లింగాలను గుర్తిస్తున్నప్పటికీ సాధారణ సామాజిక అంగీకారం ఇప్పటికీ లేదంటూ దేశంలో మారుతోన్న సామాజిక పరిస్థితులను ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రం "మానవులు ముందు, ఆడ మగ అనేవి తరువాత" అనే సామాన్య నమ్మకంతో సినిమా ప్రారంభమౌతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఉండటానికి, ప్రేమించేందుకు, భయం లేకుండా జీవించడానికి అర్హత కలిగి ఉండాలని ఆయన ప్రధానంగా పేర్కొన్నారు.
దీనికి కొనసాగింపుగా దర్శకుడు కైజాద్ గుస్తాద్ మాట్లాడారు. నిజాయితీ గల, మొత్తం ప్రపంచ స్వరాన్ని వినిపించే ఒక చిత్రాన్ని రూపొందించేందుకు తాను బయలుదేరినట్లు తెలిపారు. "ఒక క్వీర్ ప్రేమ కథను" తీయటం కంటే రెండు ట్రాన్స్‌జెండర్ ప్రధాన పాత్రల మధ్య ఆవిష్కృతమయ్యే ఒక సాధారణ శృంగార కథను చెప్పాలనుకున్నట్లు తెలియజేశారు. తనకు తక్కువ తెలిసిన అంశం గురించి రాస్తున్నందున సంవత్సరాల పరిశోధన, క్వీర్ కమ్యూనిటీతో సన్నిహిత అనుబంధం, సూక్ష్మ నైపుణ్యాలను సరిగ్గా పొందాలనే నిబద్ధత అవసరమయయ్యాయని తెలిపారు. క్రమశిక్షణతో కూడిన రచన ప్రక్రియ గురించి ఆయన మాట్లాడారు.
వీర్, సూరజ్‌ల ప్రయాణం
సినిమాలో ట్రాన్స్‌జెండర్ పాత్ర పోషించిన వీర్ సింగ్, సూరజ్ రాజ్‌ఖోవా అనే ఇద్దరు వ్యక్తులు ఈ సంభాషణను వ్యక్తిగతమైన సన్నిహితమైన అంశంగా మలిచారు. తాను పెరుగుతున్నప్పుడు తమలాంటి వ్యక్తులు తెరపై లేకపోవడం గమనించినట్లు వీర్ పేర్కొన్నారు. మూడో లింగంగా పరిగణించే వారికి ప్రాతినిధ్యం ఉండాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. "నాలాంటి వారు నన్ను తెరపై చూసి ఈ వ్యక్తి చేయగలిగితే నేను కూడా చేయగలను అని అనుకోవాలి" అని వీర్ అన్నారు. భారతీయ సినిమాలో క్వీర్ పాత్రలు చాలా కాలంగా ఉన్నప్పటికీ.. అవి తరచుగా కార్టూన్‌లుగా లేదా హాస్య పాత్రలుగా మాత్రమే ఉన్నాయని సూరజ్ అన్నారు. ‘లాలా అండ్ పాపీ’ సినిమా ద్వారా ఒక సాధారణ మానవుడిగా తెరపై కనిపించే అవకాశం లభించిందని.. "ప్రత్యేకించి ఇదే ఒక అద్భుతంగా అనిపిస్తుంది" అని సూజర్ పేర్కొన్నారు.
కథనాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకువెళ్లడం
ఈ చిత్రం క్వీర్ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుందా లేక ప్రధాన స్రవంతి ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుందా అని అడిగినప్పుడు.. "ఇది ప్రజల కోసం రూపొందించిన చిత్రం ఉత్సవాల కోసం కాదు" అని బాబీ బేడీ స్పష్టం చేశారు. ఈ చిత్రం ప్రధానంగా సామాన్య ప్రజలకు చెందినది కాబట్టి దీనిని ప్రధాన స్రవంతి కార్యక్రమాలు, సినిమా హాళ్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు తీసుకువెళ్లడం గురించి ఆయన మాట్లాడారు.
‘లాలా అండ్ పాపీ’ అనేది ఒక "సందేశాత్మక చిత్రం" కాదని కైజాద్ పునరుద్ఘాటించారు. నైతికతను చెప్పటానికి బదులుగా భావోద్వేగపరమైన వాస్తవంగా చెప్పే విధంగా ఇది ఉండాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. "ఒక కథ ప్రేక్షకులను ఆకర్షించాలి. ప్రేమ లింగ భేదాన్ని అధిగమిస్తుంది. ఆ సందేశాన్ని అరిచి చెప్పాల్సిన అవసరం లేదు. దీనిని అది అనుభూతి చెందాలి" అని వ్యాఖ్యానించారు.
ఈ ఇద్దరు నటులకు గుర్తింపు, గౌరవం ఇచ్చే ఈ చిత్రం.. ట్రాన్స్ వ్యక్తులు కేవలం వ్యక్తులుగా కనిపించే సినిమాటిక్ ప్రపంచం ప్రారంభం విషయంలో ఒక ఆశగా నిలుస్తుంది. "ఇది చారిత్రక ఘట్టంగా అనిపిస్తోంది" అని సూరజ్ అన్నారు.
‘లాలా & పాపీ’ కేవలం లింగ పరివర్తన సంబంధించిన చిత్రం మాత్రమే కాదు. ఇది ప్రేమ, ధైర్యం, ఉనికికి సంబంధించిన హక్కులను తెలిపే చిత్రం. మారుతూ ఉండే లింగ గుర్తింపును అంగీకరించాన్ని ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్న ప్రపంచంలో అన్ని రూపాల్లో ప్రేమ వికసించేందుకు అవకాశం ఉండాలని తెలియజేసే ఈ చిత్రం ఒక మంచి గుర్తుగా నిలుస్తుంది.
ఐఎఫ్ఎప్ఐ గురించి:
1952లో ప్రారంభమైన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) దక్షిణాసియాలో అత్యంత ఎక్కువ చరిత్ర కలిగిన అతిపెద్ద సినిమా వేడుకగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వంలోని సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ చలన చిత్ర అభివృద్ధి సంస్థ (నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్- ఎన్ఎఫ్డీసీ), గోవా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా (ఈఎస్జీ) సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. పునరుద్ధరించబడిన క్లాసిక్ సినిమాలు సాహసోపేతమైన ప్రయోగాత్మక చిత్రాలు ఒక వేదికపై నిలుస్తాయి. ప్రసిద్ధ దర్శక నిర్మాతలు, నిర్భయులైన తొలి దర్శకులతో వేదికను పంచుకుంటారు. ఇలా ఒక ప్రపంచ సినిమా కేంద్రంగా ఈ ఉత్సవం ఎదిగింది. ఆలోచనలు, ఒప్పందాలు, భాగస్వామ్యాలు వేగాన్ని పొందే ఉత్తేజభరిత వేవ్స్ ఫిల్మ్ బజార్, మాస్టర్‌క్లాసులు, సమర్పణ చిత్రాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, అంతర్జాతీయ పోటీలు లాంటి సమ్మేళనంతో ఐఎఫ్ఎప్ఐ ప్రత్యేకంగా మారుతోంది. నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలోని అద్భుతమైన తీరప్రాంతంలో నిర్వహించే ఐఎఫ్ఎప్ఐ.. భాషలు, విభాగాలు, ఆవిష్కరణలు, శ్రవణాల అద్భుతమైన కలయికను వీక్షకులకు అందించనుంది. ఇది ప్రపంచ వేదికపై భారతదేశ సృజనాత్మక ప్రతిభను తెలియజేసే ఒక ప్రత్యేక వేదికగా ఉంది.
మరింత సమాచారం కోసం, ఈ క్రింది లింక్‌లను సందర్శించండి:
* ఐఎఫ్ఎప్ఐ వెబ్‌సైట్: https://www.iffigoa.org/
* పీఐబీకి సంబంధించి ఐఎఫ్ఎఫ్ఐ మైక్రోసైట్: https://www.pib.gov.in/iffi/56new/
* పీఐబీ ఐఎఫ్ఎఫ్ఐవుడ్ బ్రాడ్‌కాస్ట్ ఛానెల్: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
* ఎక్స్ హ్యాండిల్స్: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
***
रिलीज़ आईडी:
2194047
| Visitor Counter:
5