ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

లాచిత్ దివస్ సందర్భంగా లాచిత్ బర్‌ఫుకన్‌కు నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

Posted On: 24 NOV 2025 11:31AM by PIB Hyderabad

ఈ రోజు లాచిత్ దివస్. ఈ సందర్భంగా లాచిత్ బర్‌ఫుకన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. సాహసానికీ, దేశభక్తికీ, సిసలైన నాయకత్వానికీ లాచిత్ బర్‌ఫుకన్ ప్రతీక అని శ్రీ మోదీ అన్నారు.
లాచిత్ బర్‌ఫుకన్ వీరత్వం దేశమంతటా తరాల తరబడి స్ఫూర్తిని అందిస్తూ వస్తోందని శ్రీ మోదీ అన్నారు. ఇది అస్సాం మార్గదర్శక సంస్కృతిని సంరక్షించడంలోనూ, ఐకమత్యం, ధీరత్వాల విలువలను పెంపొందించడంలోనూ లాచిత్ బర్‌ఫుకన్ పోషించిన కీలక పాత్రను స్పష్టం చేస్తోందని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ వేరు వేరు సందేశాల్లో -
‘‘లాచిత్ దివస్ నాడు, మనం ధైర్య సాహసాలు, దేశభక్తి, నిజమైన నాయకత్వాలకు ప్రతీకగా నిలుస్తున్న లాచిత్ బర్‌ఫుకన్‌ను స్మరించుకుంటున్నాం. ఆయన పరాక్రమం ప్రతి తరానికీ స్ఫూర్తిని అందిస్తోంది. అస్సాం మార్గదర్శక సంస్కృతిని సంరక్షించడంలో కీలక పాత్రను ఆయన పోషించారు.’’

“লাচিত দিৱসৰ দিনা আমি সাহস, দেশপ্ৰেম আৰু প্ৰকৃত নেতৃত্বৰ প্ৰতীক লাচিত বৰফুকনক স্মৰণ কৰো।  তেওঁৰ বীৰত্বই প্ৰতিটো প্ৰজন্মক অনুপ্ৰাণিত কৰি আহিছে।  অসমৰ অনন্য সংস্কৃতি ৰক্ষাৰ ক্ষেত্ৰত তেওঁ গুৰুত্বপূৰ্ণ ভূমিকা পালন কৰিছিল।” అని పేర్కొన్నారు.

 

***


(Release ID: 2193873) Visitor Counter : 5