హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

లచిత్ బర్ఫుకాన్ గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన కేంద్ర హోం, సహాకార మంత్రి శ్రీ అమిత్ షా


దేశ చరిత్రలో గొప్ప యోధుల్లో ఒకరైన అహోం సైన్యాధ్యక్షుడు బర్ఫుకాన్ జయంతి సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక నివాళులు

ఆయన అచంచల దేశభక్తి, అజేయ పరాక్రమం, సాటిలేని సైనిక నాయకత్వం అస్సాంతోపాటు ఈశాన్య భారతదేశాన్ని
మొఘల్ దండయాత్ర నుంచి కాపాడింది. తద్వారా ఈ ప్రాంతపు విలువైన సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించింది.

లచిత్ బర్ఫుకాన్ జీవితం దేశభక్తులకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమైన దీప స్తంభంగా నిలిచి ఉంటుంది.

Posted On: 24 NOV 2025 1:02PM by PIB Hyderabad

దేశ చరిత్రలోని గొప్ప వీరులలో ఒకరైన అహోం సైన్యాధ్యక్షుడు లచిత్ బర్ఫూకాన్ గారి జయంతి సందర్భంగా కేంద్ర హోం, సహకారశాఖ మంత్రి శ్రీ అమిత్ షా నివాళులర్పించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి ఈ విధంగా పేర్కొన్నారు:

‘‘దేశ చరిత్రలోని గొప్ప యోధుల్లో ఒకరైన అహోం సేనాధిపతి లచిత్ బర్ఫూకాన్ గారి జయంతి సందర్భంగా వారికి నా నివాళులుఆయన అచంచలమైన దేశభక్తిఅజేయమైన పరాక్రమంసాటిలేని సైనిక నాయకత్వం అస్సాం సహా ఈశాన్య ప్రాంతంలోని మిగిలిన భాగాన్ని మొగలుల దండయాత్ర నుంచి కాపాడడమే కాకఆ ప్రాంతపు విలువైన సాంస్కృతిక వారసత్వాన్ని కూడా రక్షించింది. ఆయన జీవితం దేశభక్తులకు ఎప్పటికీ ప్రేరణానిలయంగా నిలిచి ఉంటుంది’’

 

***


(Release ID: 2193865) Visitor Counter : 2