ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జీ-20 సదస్సు మూడో సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటనకు ఆంగ్లానువాదం

प्रविष्टि तिथि: 23 NOV 2025 3:58PM by PIB Hyderabad

గౌరవనీయ సభ్యులారా,

సాంకేతికత వేగంగా పురోగమిస్తున్న కొద్దీ వనరులుఅవకాశాలు కొద్దిమంది వద్దనే మరింతగా కేంద్రీకృతమవుతున్నాయిప్రపంచ వ్యాప్తంగా ప్రధానమైన సాంకేతికతల విషయంలో పోటీ కూడా తీవ్రమవుతోందిఇది మానవ సమాజానికి ఆందోళనకరమే కాకుండా కొత్త ఆవిష్కరణలకు అడ్డంకి కూడాదీన్ని నిరోధించాలంటే మన ఆలోచనా విధానంలో మౌలికమైన మార్పు అవసరం.

 

మనం ప్రోత్సహించే సాంకేతికత, 'ఆర్థిక కేంద్రకంగా కాకుండా మానవ కేంద్రకంగా ఉండాలిదేశాలకే పరిమితమై పోకుండా ప్రపంచమంతా ఉపయోగించుకునేలా ఉండాలిపరిమిత ప్రత్యేక వనరుల విధానాల స్థానంలో అందరికీ అందుబాటులో ఉండే ఓపెన్-సోర్స్ విధానాలను ప్రోత్సహించాలిభారత్ ఈ భావనతోనే తన సాంకేతిక ప్రాజెక్టులను రూపొందిస్తోంది.

ఈ కారణం చేతనే ప్రపంచంలోనే ఎక్కువ డిజిటల్ చెల్లింపులు భారత్‌లో జరుగుతున్నాయిఅంతరిక్ష సాంకేతికత నుంచి కృత్రిమ మేధస్సు వరకుప్రతి రంగంలో పురోగతివిస్తృత అభివృద్ధి కనిపిస్తోంది.

 

మిత్రులారా,

కృత్రిమ మేధస్సు విషయంలో భారతదేశ విధానం మూడు ప్రధాన సూత్రాల ఆధారంగా నిర్మితమైందిఅందరికీ సమాన లభ్యతజనాభా స్థాయిననుసరించి ప్రజలకు శిక్షణబాధ్యతాయుత వినియోగంఇండియా ఏఐ మిషన్ ద్వారా ప్రతి జిల్లాప్రతి భాష వరకు ఏఐ ప్రయోజనాలు చేరేలా శక్తిమంతమైన కంప్యూటింగ్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాందీని వలన మానవ అభివృద్ధి మరింత వేగంగా జరగడానికి తోడ్పాటు లభిస్తుంది.

 

అదే సమయంలోఏఐని విశ్వ శ్రేయస్సు కోసం బాధ్యతగా వినియోగించడందుర్వినియోగం జరగకుండా చూడడం ముఖ్యంఇందుకు ప్రాథమిక సూత్రాల ఆధారంగా కుదుర్చుకున్న ప్రపంచ స్థాయి ఏఐ ఒప్పందం అవసరంఇందులో ప్రభావవంతమైన మానవ పర్యవేక్షణనిర్మాణపరమైన భద్రతపారదర్శకతలతో పాటు డీప్‌ఫేక్‌లునేరాలుఉగ్రవాదం కోసం ఏఐ వినియోగాన్ని నిషేధించడం వంటి అంశాలు ఉండాలి.

మానవ జీవితంభద్రతప్రజల విశ్వాసంపై ప్రభావం చూపే ఏఐ వ్యవస్థలు తప్పనిసరిగా జవాబుదారీతనంగాపరీక్షించదగ్గవిగా ఉండాలిఏఐ మనుషుల సామర్థ్యాలను పెంచే అవకాశం ఉన్నప్పటికీనిర్ణయం తీసుకునే విషయంలో కడసరి బాధ్యత మనుషులవద్ద ఉండడం చాలా ముఖ్యమైనది.

 

2026 ఫిబ్రవరిలో “సర్వజన హితాయసర్వజన సుఖాయ”(అందరికీ సంక్షేమం అందరికీ సంతోషంఅనే థీమ్‌తో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ను భారత్ నిర్వహించనుందిఈ సదస్సులో అన్ని జీ20 దేశాలు పాల్గొనవలసిందిగా ఆహ్వానం పలుకుతున్నాం.

మిత్రులారా,

ఈ ఏఐ యుగంలోమన దృష్టిని “ప్రస్తుత ఉద్యోగాల” నుంచి “భవిష్యత్ సామర్థ్యాల” వైపు మార్చాలివేగవంతమైన కొత్త ఆవిష్కరణలకు ప్రతిభ విస్తరణ (టాలెంట్ మొబిలిటీచాలా అవసరంన్యూఢిల్లీలో జరిగిన జీ20 సదస్సులో దీనిపై పురోగతి సాధించాంరాబోయే కాలంలో జీ20... ప్రతిభ విస్తరణ కోసం ప్రపంచస్థాయి విధానాలను రూపొందిస్తుందని ఆశిస్తున్నాం.

మిత్రులారా,

ప్రపంచ సరఫరా వ్యవస్థలు ఎంత బలహీనంగా ఉన్నదీ కోవిడ్ మనకు తెలియజెప్పిందిఆ కష్టకాలంలో కూడా భారత్ 150 కంటే ఎక్కువ దేశాలకు వ్యాక్సిన్లుమందులు అందించిందిదేశాలను కేవలం మార్కెట్లుగా చూడకూడదువాటి పట్ల ఒక సున్నితమైనదీర్ఘకాలిక దృష్టికోణాన్ని అలవర్చుకోవాలి.

భారతదేశం చెప్పే స్పష్టమైన సందేశం ఏమిటంటే:

· అభివృద్ధి సుస్థిరంగా ఉండాలి

· వాణిజ్యం విశ్వసనీయంగా ఉండాలి

· ఆర్థిక వ్యవస్థ న్యాయంగా ఉండాలి

· ప్రగతి అందరికీ ఉపయోగపడాలి

అప్పుడే మనం అందరికీ న్యాయంగాసమానంగా ఉండే భవిష్యత్తును నిర్మించగలం.

ధన్యవాదాలు

 

***


(रिलीज़ आईडी: 2193342) आगंतुक पटल : 31
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Gujarati , Urdu , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam