56వ ఇఫి మీడియా సమావేశంలో థెరిసా ' ఆత్మశోధన ప్రయాణం’ ట్రైలర్ ఆవిష్కరణ ఇఫి రెండో రోజు మీడియాతో సంభాషించిన చిత్ర బృందం
నిన్న జరిగిన సినిమా ప్రదర్శనలో ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు, ఆశ్చర్యాలను అందుకున్న అనంతరం 'ది బ్లూ ట్రైల్' దర్శకుడు గాబ్రియేల్ మస్కారో నేడు చిత్ర విశేషాలను పంచుకునేందుకు విలేకరులతో సమావేశమయ్యారు. 56వ ఇఫిలో భాగంగా పీఐబీ మీడియా హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో.. సౌండ్ డిజైనర్లు మారియా అలెజాండ్రా రోజాస్, ఆర్టురో సలాజర్ ఆర్బీ, నటీమణులు క్లారిస్సా పిన్హీరో, రోసా మలాగ్వెటా పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు.

‘‘నేను 5,6 సంవత్సరాల క్రితం కథనం రాస్తున్న సమయంలో బ్రెజిల్‌లోని ఏ ప్రాంతంలో సినిమా చిత్రీకరించాలనే సందేహం ఉండేది. ఆ సమయంలో నేను గోవాను సందర్శించాను. అప్పుడే అమెజాన్ ప్రాంతంలో ఈ సినిమా చిత్రీకరించాలనే ఆలోచన వచ్చింది. ఎందుకంటే అది గోవాను పోలి ఉంటుంది.’’ అని చిత్ర దర్శకుడు గాబ్రియేల్ గుర్తుచేసుకున్నారు. సినిమా కోసం గోవా పోలీసులు ధరించే యూనిఫాం కూడా తనకు కొంచెం స్ఫూర్తినిచ్చినట్లు ఆయన నవ్వుతూ పేర్కొన్నారు.
సౌండ్ డిజైనర్ మారియా అలెజాండ్రా రోజాస్ మాట్లాడుతూ.. ‘‘సినిమా సౌండ్ ఎలా ఉండాలో గాబ్రియేల్ చాలా స్పష్టంగా చెప్పాడు. ప్రతి శబ్దం విషయంలో దర్శకుడు చాలా సున్నితంగా, శ్రద్ధంగా ఉండటం చాలా అరుదైన విషయం’’ అని తెలిపారు.

సినిమా గురించి నటి రోసా మలాగ్వెటా మాట్లాడుతూ.. ‘‘నేను అమెజాన్ సంస్కృతికి చెందిన దాన్ని. అమెజాన్ సంస్కృతి స్వదేశీది, నిజమైన బ్రెజిలియన్. నేను కూడా రెండు సంస్కృతుల స్వదేశీ, నల్లజాతి సంస్కృతిల సమ్మేళనం. ఈ చిత్రంలో నేను నా సంస్కృతికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.’’ అని చెప్పారు. తన స్నేహితుడు, తనెంతో అభిమానించే వ్యక్తి గాబ్రియేల్‌తో కలిసి పనిచేయడం తనకు ఎంతో సంతోషకరమైన అనుభవమని నటి క్లారిస్సా పిన్హీరో తెలిపారు.
‘ది బ్లూ ట్రైల్’ ప్రీమియర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. చప్పట్లతో ప్రేక్షకులు చిత్రాన్ని అభినందించారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను హృదయాన్ని తాకేలా ఆవిష్కరించింది. చిన్నచిన్న విషయాల్లో థెరీసా మనోధైర్యాన్ని సున్నితంగా చూపించింది. ఆమె ధైర్యంగా మొదలుపెట్టిన తన అంతర్గత ప్రయాణాన్ని అద్భుతంగా ప్రతిబింబించడాన్ని ప్రేక్షకులు విశేషంగా ప్రశంసించారు.
చిత్ర ట్రైలర్ కోసం,
మీడియా సమావేశం చూసేందుకు,
మరింత సమాచారం తెలుసుకునేందుకు.. https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=2192321
ఐఎఫ్‌ఎఫ్‌ఐ గురించి..
1952లో ఆవిర్భవించిన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) దక్షిణాసియాలోనే పురాతనమైన, అతిపెద్ద సినిమా వేడుకగా నిలుస్తోంది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాకు చెందిన జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీసీ), గోవా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ (ఈఎస్‌సీ) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవం.. పునర్నిర్మిత క్లాసిక్‌ల నుంచి సాహసోపేతమైన ప్రయోగాల వరకు, దిగ్గజ చిత్ర ప్రముఖుల నుంచి తొలి అడుగు వేస్తున్న కొత్త ప్రతిభావంతుల వరకు అందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రపంచ స్థాయి సినీ వేదికగా ఎదిగింది. వైవిధ్యభరితమైన మేళవింపు, అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్‌క్లాస్‌లు, నివాళులు, ఆలోచనలు, ఒప్పందాలు, సహకారాలు, రెక్కలు తొడిగిన ఉత్సాహవంతమైన ఫిల్మ్ బజార్ లతో ఐఎఫ్ఎఫ్ఐ మెరిసింది. గోవాలోని అందమైన తీరప్రాంతంలో నవంబర్ 20 నుంచి 28 తేదీ వరకు జరుగుతున్న 56వ సంచిక.. భాషలు, శైలులు, ఆవిష్కరణలు, స్వరాల అద్భుత సమాహారాన్ని ప్రదర్శిస్తూ, ప్రపంచ వేదికపై భారత సృజనాత్మక ప్రతిభకు అద్భుతమైన వేడుకగా నిలుస్తుంది.
మరిన్ని వివరాల కోసం, క్లిక్ చేయండి:
ఐఎఫ్‌ఎఫ్‌ఐ వెబ్‌సైట్: https://www.iffigoa.org/
పీఐబీ ఐఎఫ్‌ఎఫ్‌ఐ మైక్రోసైట్: https://www.pib.gov.in/iffi/56new/
పీఐబీ ఐఎఫ్‌ఎఫ్‌ఐవుడ్ బ్రాడ్‌కాస్ట్ చానల్:
https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
ఎక్స్ ఖాతాలు: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
Release ID:
2192927
| Visitor Counter:
6