పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

చారిత్రక ప్రస్థానం: 5 కూనలకు జన్మనిచ్చిన మన చిరుత- ముఖి సంతాన వృద్ధి, వైవిధ్యమైన జన్యువులు గల చిరుత జాతి జనాభా పెరగటంపై ఆశావాద దృక్పథం: శ్రీ భూపేందర్ యాదవ్

Posted On: 20 NOV 2025 4:22PM by PIB Hyderabad

ప్రాజెక్టు చీతాలో భాగంగా జరిగిన చరిత్రాత్మకమైన అభివృద్ధిని కేంద్ర పర్యావరణఅటవీవాతావరణ మార్పు శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ వెల్లడించారుభారత్‌లో జన్మించి, 33 నెలల వయసు గల మొదటి ఆడ చిరుతముఖి కూనలకు జన్మనిచ్చిందనిభారత్‌లో మళ్లీ చిరుతలను పెంచే కార్యక్రమంలో ఇది కీలక విజయమని సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో శ్రీ భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు.

భారత్‌లో పుట్టిన చిరుత విజయవంతంగా పిల్లలను కనటం ఇటీవల కాలంలో ఇదే ప్రథమమని శ్రీ భూపేందర్ యాదవ్ స్పష్టం చేశారుభారతదేశ ఆవాసాల్లో ఈ జాతి చిరుతలు స్థానిక వాతావరణానికి అలవాటుపడటంఆరోగ్యంగా ఉండటందీర్ఘకాలిక మనుగడకు ఇది సంకేతమని ఆయన తెలిపారు.

తల్లిపిల్లలూ ఆరోగ్యంగా ఉన్నాయని వెల్లడించిన మంత్రి.. "భారత్‌లో స్వయంగా సంతతిని వృద్ధి చేసుకోగలవైవిధ్యమైన జన్యువులు గల చిరుత జనాభాను పెంచటంపై ఆశావాద దృక్పథాన్ని ఈ పరిణామం బలపరుస్తుందిఅని అన్నారు.

ఈ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేసిన శ్రీ భూపేందర్ యాదవ్.. జీవజాల రక్షణకు భారత్ చేస్తున్న ప్రయత్నాలుప్రాజెక్టు చీతా భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచుతుందని తెలిపారు.

 

***


(Release ID: 2192238) Visitor Counter : 5