ప్రధాన మంత్రి కార్యాలయం
బీహార్‌లో నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులను అభినందించిన ప్రధానమంత్రి
Posted On:
20 NOV 2025 1:41PM by PIB Hyderabad
బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నితీష్ కుమార్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అనుభవజ్ఞుడైన పరిపాలకుడిగా అద్భుతమైన ట్రాక్ రికార్డు ఆయన సొంతమని శ్రీ నితీష్ కుమార్ ను ప్రశంసించారు. ప్రస్తుత పదవీకాలం విజయవంతంగా సాగాలని శుభాకాంక్షలు తెలిపారు.
బీహార్ ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన శ్రీ సామ్రాట్ చౌదరి, శ్రీ విజయ్ సిన్హాలను కూడా ప్రధానమంత్రి అభినందించారు. ఇద్దరికీ క్షేత్ర స్థాయి నుంచి ప్రజా సేవలో విస్తృత అనుభవం ఉందని గుర్తుచేస్తూ.. వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
బీహార్ ప్రభుత్వంలో మంత్రులుగా నియమితులైన వారందరికీ శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షలు తెలిపారు. అంకిత భావంతో పనిచేసే నాయకులు కలిగిన ఈ అద్భుతమైన బృందం.. బీహార్ రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందనే నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. మరోసారి మంత్రులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన వివిధ పోస్టుల్లో ప్రధాన మంత్రి ఇలా అన్నారు..
‘‘బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నితీష్ కుమార్ కు అభినందనలు. ఆయన సమర్థుడు, అనుభవజ్ఞుడైన పరిపాలకుడు. రాష్ట్రంలో సుపరిపాలనలో ఆయనకు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు!
‘‘బీహార్ ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన శ్రీ సామ్రాట్ చౌదరి, శ్రీ విజయ్ సిన్హాలకు అభినందనలు. ఇద్దరు నాయకులకు క్షేత్ర స్థాయిలో ప్రజలకు సేవ చేయడంలో విస్తృత అనుభవం ఉంది. వారికి కూడా నా శుభాకాంక్షలు!
‘‘బీహార్ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సహచర సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అంకితభావంతో పనిచేసే నాయకులతో కూడిన ఈ అద్భుతమైన బృందం.. బీహార్ ను కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది. వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.”
***
(Release ID: 2192097)
Visitor Counter : 11
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam