ప్రధాన మంత్రి కార్యాలయం
మదీనాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయులకు ప్రధాని సంతాపం
प्रविष्टि तिथि:
17 NOV 2025 12:27PM by PIB Hyderabad
సౌదీ అరేబియాలోని, మదీనాలో జరిగిన ప్రమాదంలో భారతీయులు మరణించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
రియాద్‌లోని భారతీయ ఎంబసీ, జెడ్డాలోని కాన్సులేట్ బాధితులకు అన్ని విధాలుగా సాధ్యమైనంత సాయాన్ని అందిస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు. అవసరమైన సాయాన్ని, సహకారాన్ని అందించడానికి సౌదీ అరేబియా అధికారులతో భారత అధికారులు సంప్రదిస్తున్నారని తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి చేసిన పోస్టు:
‘‘మదీనాలో జరిగిన ప్రమాదంలో భారతీయులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. రియాద్‌లో ఉన్న మన ఎంబసీ, జెడ్డాలో ఉన్న కాన్సులేట్ అన్ని విధాలుగా సాధ్యమైనంత సాయాన్ని అందిస్తున్నాయి. సౌదీ అరేబియన్ అధికారులతో మన అధికారులు మాట్లాడుతున్నారు’’
***
(रिलीज़ आईडी: 2191023)
आगंतुक पटल : 28
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam