ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

క్షయపై పోరులో భారతదేశం అద్భుత పురోగతిని సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని

प्रविष्टि तिथि: 13 NOV 2025 4:30PM by PIB Hyderabad

 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల విడుదల చేసిన ప్రపంచ క్షయ నివేదిక- 2025లో తెలియజేసినట్లుగా క్షయవ్యాధిపై (టీబీ) పోరాటంలో భారత్‌ గణనీయమైన పురోగతిని సాధించటం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. 20215 నుంచి భారతదేశం టీబీ కేసులను ప్రశంసనీయ స్థాయిలో తగ్గించింది. ఈ తగ్గుదల శాతం ప్రపంచ సగటు తగ్గుదల శాతానికంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉంది. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా అత్యంత వేగవంతమైన క్షయ కేసుల తగ్గింపుగా దీనిని పరిగణిస్తున్నారు. 

దేశవ్యాప్తంగా చికిత్స సదుపాయాల విస్తరణ, కనిపించని కేసులు తగ్గటం, చికిత్స విజయవంతమయ్యే శాతంలో స్థిరమైన పెరుగుదల వంటి సానుకూల అంశాల మధ్య ఈ అద్భుత విజయం వచ్చిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:

“టీబీపై భారతదేశ పోరాటం అద్భుతమైన వేగాన్ని అందుకుంటోంది.

తాజా డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ క్షయ నివేదిక- 2025 చెప్పినట్లుగా.. 2015 నుంచి టీబీ కేసుల సంఖ్యను తగ్గించటంలో భారత్ ప్రశంసనీయమైన వృద్ధిని నమోదు చేసింది. ఇది ప్రపంచ తగ్గుదల రేటు కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా అత్యంత వేగవంతమైన తగ్గుదలలో ఇది ఒకటి. అంతే సంతోషకరమైన అంశాలు ఏమిటంటే.. చికిత్స కవరేజీ విస్తరించడం, కనిపించని కేసులు తగ్గటం, చికిత్స విజయవంతమయ్యే శాతాల్లో స్థిరమైన పెరుగుదల. ఈ విజయాన్ని సాధించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరినీ నేను అభినందిస్తున్నాను. శారీరక ధృడత్వంతో ఆరోగ్యవంతమైన భారత్‌ను తయారుచేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం!"

 

***


(रिलीज़ आईडी: 2190446) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Kannada