హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా


గిరిజన సమాజానికే కాక యావత్ దేశానికి భగవాన్ బిర్సా ముండా గర్వకారణం

గిరిజన అస్తిత్వానికి ప్రతీక, దేశానికి గర్వకారణమైన, గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడైన ధర్తి ఆబా భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా గౌరవ వందనాలు

భగవాన్ బిర్సా ముండా జయంతిని 'జన్‌జాతీయ గౌరవ్ దివాస్‌'గా ప్రకటించిన ప్రధానమంత్రి మోదీ

గిరిజన సమాజాన్ని, వారి సంస్కృతి, హక్కులను రక్షించుకోవటానికి, బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజనులను ఏకం చేసి 'ఉల్గులాన్ ఉద్యమాన్ని' ప్రోత్సహించిన ధర్తి ఆబా

భగవాన్ బిర్సా ముండా జీవితం ప్రతి దేశభక్తునికి స్ఫూర్తిదాయకం

Posted On: 15 NOV 2025 3:42PM by PIB Hyderabad

భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రిసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నివాళులర్పించారు.

భగవాన్ బిర్సా ముండా గిరిజన సమాజానికి మాత్రమే కాక యావత్ దేశానికీ గర్వకారణమని కేంద్ర హోంమంత్రిసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నారుఇవాళ ఆయన 150వ జయంతిని పురస్కరించుకుని దేశం మొత్తం "జన్‌జాతీయ గౌరవ దివస్"ను ఆనందంగా జరుపుకుంటోందని తెలిపారుస్వాతంత్ర్య ఉద్యమంలోమాతృభూమి రక్షణకు ఆయన చేసిన అచంచలమైన కృషికి నివాళులర్పిస్తూసెల్యూట్ చేస్తున్నామన్నారు.

గిరిజన అస్తిత్వానికి ప్రతీకదేశానికి గర్వకారణమైనగొప్ప స్వాతంత్ర్య సమరయోధుడైన ధర్తి ఆబా భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా గౌరవ వందనాలు చేస్తున్నట్లు శ్రీ అమిత్ షా మరో పోస్టులో పేర్కొన్నారుభగవాన్ బిర్సా ముండా జయంతిని 'జన్‌జాతీయ గౌరవ్ దివస్‌'గా ప్రకటించి ప్రధానమంత్రి మోదీ ఆయన్ని సత్కరించారని తెలిపారుఒకవైపు గిరిజన సమాజాన్నివారి సంస్కృతిహక్కులను రక్షించుకోవటానికి పోరాడుతూనే.. మరోవైపు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజనులను ఏకం చేసి  'ఉల్గులాన్ ఉద్యమాన్నిధర్తి ఆబా ప్రోత్సహించారని వెల్లడించారుభగవాన్ బిర్సా ముండా జీవితం ప్రతి దేశభక్తునికి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు

 

***


(Release ID: 2190432) Visitor Counter : 3