ప్రధాన మంత్రి కార్యాలయం
ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిని సందర్శించి, పేలుడు ఘటన బాధితులను కలిసిన ప్రధానమంత్రి
ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామన్న పీఎం
प्रविष्टि तिथि:
12 NOV 2025 3:21PM by PIB Hyderabad
ఢిల్లీలో ఇటీవల జరిగిన పేలుడు ఘటన బాధితులను పరామర్శించేందుకు ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శించారు. బాధితులు, వారి కుటుంబసభ్యులతో మాట్లాడారు. వారికి అందిస్తున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి, బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. "కుట్రదారులను న్యాయస్థానం ముందు నిలబెడతాం" అని స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:
"ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి వెళ్లి ఢిల్లీ పేలుడు ఘటనలో గాయపడిన వారిని పరామర్శించాను. వాళ్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
ఈ ఘటనకు కారణమైన కుట్రదారులకు కచ్చితంగా శిక్ష పడుతుంది"
***
(रिलीज़ आईडी: 2189461)
आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam