హోం మంత్రిత్వ శాఖ
ఢిల్లీ పేలుడుపై నిర్వహించిన ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశాలకు అధ్యక్షత వహించిన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ప్రతి నేరస్థుడిని పట్టుకుంటాం: అమిత్ షా
Posted On:
11 NOV 2025 6:57PM by PIB Hyderabad
ఢిల్లీ కారు పేలుడు ఘటనపై ఢిల్లీలో భద్రతా సంస్థలు, కేంద్ర హోం శాఖ సీనియర్ అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశాలకు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షత వహించారు.
మొదటి సమావేశానికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ హాజరయ్యారు. జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రెండో సమావేశానికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, ఎన్ఎస్జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్) డైరెక్టర్ జనరల్, ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) డైరెక్టర్ జనరల్, ఫోరెన్సిక్ సైన్స్ సర్వీసెస్ డైరెక్టర్, ఢిల్లీలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ ముఖ్య డైరెక్టర్, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.
ఈ సమావేశాల అనంతరం కేంద్ర హోం మంత్రి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:
"ఢిల్లీ కారు పేలుడుకు సంబంధించి సీనియర్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశాలకు అధ్యక్షత వహించాను.ఈ దుర్ఘటన వెనుక ఉన్న ప్రతి ఒక్కడిని పట్టుకోవాలని ఆదేశించాను. ఈ ఘటనతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ మన ఏజెన్సీల పూర్తి ఆగ్రహాన్ని చూస్తారు."
***
(Release ID: 2189040)
Visitor Counter : 3