ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డెహ్రాడూన్‌లో ఉత్తరాఖండ్ ఆవిర్భావ రజతోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 09 NOV 2025 3:31PM by PIB Hyderabad

దేవభూమి ఉత్తరాఖండ్‌లోని పెద్దలుమిత్రులుసోదరీసోదరులందరికీ అభివందనాలు...

ఉత్తరాఖండ్ గవర్నర్ శ్రీ గుర్మీత్ సింగ్శాసనసభ స్పీకర్ సోదరి శ్రీ రీతూముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ అజయ్ టమ్టారాష్ట్ర మంత్రులువేదికను అలంకరించిన ఎంపీలుమాజీ ముఖ్యమంత్రులుమమ్మల్ని ఆశీర్వదించడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన గౌరవనీయ సాధు జనులుఇతర విశిష్ట అతిథులుసోదరీసోదరులారా!

మిత్రులారా!

ఈ రోజు... అంటేనవంబరు 9వ తేదీ ఒక సుదీర్ఘ తపో ఫలితం... మనందరి హృదయాలు గర్వంతో ఉప్పొంగేలా చేసే దినమిదిఉత్తరాఖండ్‌ను ప్రేమించే ప్రతి ఒక్కరూ చాలాకాలం పాటు కన్న కలలు 25 ఏళ్ల కిందట శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో సాకారమైన క్షణమిదినాటినుంచీ సాగిన ప్రగతి పయనంలో పాతికేళ్ల తర్వాత రాష్ట్రం ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించడం చూసిఈ సుందర రాష్ట్ర ఆవిర్భావం కోసం పోరాడిన ప్రతి వ్యక్తిలో ఆనందోత్సాహాలు పెల్లుబకడం సహజంసమున్నత పర్వతాలు.. సంస్కృతిప్రకృతి సౌందర్యంతో అలరారే దేవభూమి ఉత్తరాఖండ్ఇక్కడి ప్రజానీకం మనసులలో నిండిన ఉల్లాసంఉత్సాహం  ఇప్పుడు నా కళ్లకు కడుతున్నాయి.

మిత్రులారా!

ఉత్తరాఖండ్ సామర్థ్యాన్ని సమున్నత స్థాయికి చేర్చడంలో ఈ రెండు ఇంజిన్ల బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అవిరళ కృషి నాకెంతో సంతోషాన్నిస్తోందిఈ నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ రజతోత్సవం నిర్వహించుకుంటున్న ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలుఈ సందర్భంగా ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన ఉద్యమంలో ఆత్మత్యాగం చేసిన అమరులకు నివాళి అర్పిస్తూఅందులో పాలుపంచుకున్న వారందరికీ నమస్కారం చేస్తున్నాను.

మిత్రులారా!

ఈ రాష్ట్రంతో నా బంధం ఎంత గాఢమైనదో మీకందరికీ తెలుసునా ఆధ్యాత్మిక పయనంలో భాగంగా ఇక్కడికి వచ్చిన ప్రతి సందర్భంలోనూ... ఈ పర్వత సానువులలో నివసించే నా సోదరీసోదరుల పోరాటంకృషిపట్టుదల సహా ప్రతి కష్టాన్నీ అధిగమించాలనే వారి దృఢ సంకల్పం సదా నాకెంతో స్ఫూర్తినిచ్చాయి.

మిత్రులారా!

నేనిక్కడ గడిపిన రోజుల్లో ఉత్తరాఖండ్ అపార సామర్థ్యం నాకు ప్రత్యక్షంగా తెలిసివచ్చిందిఅందుకేఈ దశాబ్దం ఉత్తరాఖండ్‌కు చెందినదని కేదారనాథుని దర్శనం తర్వాత నేను చెప్పానుఅయితేఅది కేవలం ఓ ప్రకటన కాదు... నాతో అలా చెప్పించింది మీ అందరిపై నాలోని సంపూర్ణ విశ్వాసమేఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ఆవిర్భవించి నేడు 25 ఏళ్లు పూర్తయినందున ఈ కాలం నిజంగా రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మకఉజ్వల శకం అనే విశ్వాసం నాలో మరింత బలపడింది.

మిత్రులారా!

ఉత్తరాఖండ్‌ అవతరణ సమయాన రాష్ట్ర వనరులు పరిమితం కాగాసవాళ్లు అపారంఆదాయ వనరులు స్వల్పం కావడం వల్ల వార్షిక బడ్జెట్ కూడా తక్కువగా ఉండేదిఅనేక అవసరాలను కేంద్ర ప్రభుత్వమే తీర్చాల్సి వచ్చిందిఅయితేఇవాళ ఆ పరిస్థితి ఆమూలాగ్రం మారిపోయిందిఈ వేదికపైకి వచ్చేముందుఆవిర్భావ రజతోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అద్భుత ప్రదర్శనను నేను తిలకించానుఈ ప్రదర్శనను మీరంతా... ఉత్తరాఖండ్ పౌరులందరూ కూడా సందర్శించాలని నా మనవిగడచిన 25 ఏళ్లలో ఉత్తరాఖండ్‌ ప్రగతి పయనాన్ని ఈ ప్రదర్శన సంగ్రహంగా మన కళ్లముందు ఉంచుతుందిమౌలిక సదుపాయాలువిద్యపరిశ్రమలుపర్యాటకంఆరోగ్యంవిద్యుత్గ్రామీణాభివృద్ధి రంగాల్లో విజయానికి సంబంధించిన స్ఫూర్తిదాయక గాథలు నిజంగా ప్రశంసనీయంఉత్తరాఖండ్‌ బడ్జెట్‌ 25 ఏళ్ల కిందట కేవలం రూ.4,000 కోట్లు మాత్రమేఇప్పటి పాతికేళ్ల యువతరానికి ఆ రోజులు ఎలాంటివో ఎంతమాత్రం తెలియదుఅలాంటి స్థితి నుంచి నేడు రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.లక్ష కోట్లు దాటిందిఈ 25 ఏళ్లలో విద్యుదుత్పాదన రెట్లురహదారుల పొడవు రెట్లు పెరిగాయిఇంతకుముందు నెలల్లో 4,000 మంది మాత్రమే విమానాల్లో ఇక్కడికి వచ్చేవారు... కానీఇవాళ రోజుకు 4,000 మందికిపైగా వస్తున్నారు.

మిత్రులారా!

ఈ పాతికేళ్లలో ఇంజనీరింగ్ కళాశాలల సంఖ్య 10 రెట్లు పెరిగిందిలోగడ రాష్ట్రంలో ఒకేఒక వైద్య కళాశాల ఉండగాఇప్పుడు వాటి సంఖ్య 10కి చేరిందిఅలాగే 25 ఏళ్ల కిందట టీకాల కార్యక్రమంలో 25 శాతం కూడా ప్రజలకు చేరువ కాలేదుఅంటే- 75 శాతానికిపైగా ప్రజలకు టీకా అన్నదే తెలియదుకానీఇప్పుడు రాష్ట్రంలో దాదాపు ప్రతి గ్రామానికి పూర్తిస్థాయిలో టీకాల కార్యక్రమం విస్తరించిందిఅంటేమానవ జీవనంలోని ప్రతి అంశంలో ఉత్తరాఖండ్‌ గణనీయ ప్రగతి సాధించిందని అర్థంఈ పురోగమనం అసాధారణం... ఇది సమ్మిళిత విధానాలతోపాటు ప్రతి పౌరుడి దృఢ సంకల్పం ఫలితంఒకనాడు ఏటవాలు పర్వత సానువులు ప్రగతి మార్గానికి అవరోధాలనే భావన ఉండేదికానీఇప్పుడు అవే అభివృద్ధికి కొత్త బాటలు వేస్తున్నాయి.

మిత్రులారా!

ఇంతకుముందే నేను ఉత్తరాఖండ్ యువతరంతోఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ముచ్చటించానురాష్ట్రం సాధించిన వృద్ధిపై వారందరూ ఆనందోత్సాహాలు ప్రదర్శించారునేను కొన్ని తప్పులు చేయవచ్చుగాక... అయిన్పటికీ 2047కల్లా భారత్‌ అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా నిలిచినపుడు నా ఉత్తరాఖండ్.. నా దేవభూమి.. అందుకు పూర్తి సన్నద్ధతతో ఉంటుందన్న రాష్ట్ర ప్రజల మనోభావాన్ని గఢ్వాలీలో నేను ప్రకటించాలని భావిస్తున్నాను.

మిత్రులారా!

ఉత్తరాఖండ్ పురోగమనాన్ని మరింత వేగవంతం చేయడానికి వీలుగా అనేక కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాంవిద్యఆరోగ్యంపర్యాటకంక్రీడా తదితర రంగాలకు సంబంధించిన ఈ ప్రాజెక్టులు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయిజమ్రానీసాంగ్ నీటిపారుదల ప్రాజెక్టులు డెహ్రాడూన్హల్ద్వానీ ప్రాంతాల తాగునీటి సమస్య పరిష్కారంలో ప్రధాన పాత్ర పోషిస్తాయిఈ పథకాలను రూ.8,000 కోట్లకు పైగా వ్యయంతో పూర్తిచేస్తారుఈ ముఖ్యమైన ప్రాజెక్టులు త్వరలో అందుబాటులోకి రానుండటంపై రాష్ట్ర ప్రజలకు నా అభినందనలు.

మిత్రులారా!

ఆపిల్కివి సాగుచేసే రైతులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం డిజిటల్ కరెన్సీ రూపంలో రాయితీల బదిలీని ప్రారంభించిందితద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అసలైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వ సహాయం చేరేలా పారదర్శక పర్యవేక్షణ ఇకపై సాధ్యమవుతుందిఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ‘ఆర్‌బీఐ’ సహా ఇతర భాగస్వామ్య సంస్థలకు అభినందనలు తెలుపుతున్నాను.

మిత్రులారా!

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం భారత ఆధ్యాత్మిక జీవనాడి. ‘గంగోత్రియమునోత్రికేదార్‌నాథ్బద్రీనాథ్జగేశ్వర్‌ఆది కైలాస్‌’ వంటివి మన భక్తివిశ్వాసాలకు ప్రతీకలైన పవిత్ర తీర్థయాత్రా ప్రదేశాలుఏటా లక్షలాదిగా భక్తులు ఈ పుణ్యక్షేత్రాలకు యాత్రగా వస్తుంటారుఇవి భక్తి మార్గానికి బాటలు వేయడమేగాక ఉత్తరాఖండ్ ఆర్థిక వ్యవస్థలో నవ్యోత్తేజం నింపుతాయి.

మిత్రులారా!

ఉత్తరాఖండ్ అభివృద్ధి మెరుగైన అనుసంధాన సదుపాయాలతో ఎంతగానో ముడిపడి ఉందిఈ దిశగా రాష్ట్రంలో ప్రస్తుతం రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు పురోగమనంలో ఉన్నాయిరిషీకేశ్-కర్ణప్రయాగ్ రైలు మార్గం పనులు సాగుతుండగాఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌ వే దాదాపు పూర్తికావస్తోందిఅలాగే,  గౌరీకుండ్-కేదార్‌నాథ్గోవింద్‌ఘాట్-హేమకుండ్ సాహిబ్ రోప్‌వే పనులకు శంకుస్థాపన చేశారుఈ ప్రాజెక్టులతో ఉత్తరాఖండ్‌లో ప్రగతి మరింత వేగం పుంజుకుంటుంది.

మిత్రులారా!

గడచిన పాతికేళ్లలో ఉత్తరాఖండ్ సుదీర్ఘ ప్రగతి ప్రయాణం చేసిందిఈ నేపథ్యంలో రాబోయే 25 ఏళ్లలో ఎంత ఎత్తులో ఉండాలో ఎలా అంచనా వేయాలన్నదే మన ముందున్న ప్రశ్న. “మనసుంటే మార్గం ఉంటుంది” అనే నానుడిని మీరంతా ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారుకాబట్టిమన లక్ష్యాలేమిటో మొదట గ్రహిస్తేవాటిని సాధించే ప్రణాళిక సత్వరం రూపొందించగలంమరిభవిష్యత్ లక్ష్యాల గురించి ఆలోచించడానికి నవంబరు 9ని మించిన మంచి రోజు మరొకటి ఉంటుందా?

మిత్రులారా

ఉత్తరాఖండ్ నిజమైన గుర్తింపు దాని ఆధ్యాత్మిక బలంలోనే ఉందిఉత్తరాఖండ్ గనుక సంకల్పిస్తేకేవలం కొన్ని సంవత్సరాలలోనే అది ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా ఆవిర్భవించగలదుఇక్కడి ఆలయాలుఆశ్రమాలుధ్యానయోగా కేంద్రాలను ప్రపంచవ్యాప్త నెట్‌వర్క్‌కు అనుసంధానం చేయవచ్చు.

మిత్రులారా

దేశం నలుమూలల నుంచిప్రపంచం నలుమూలల మూలల నుంచి ప్రజలు ఇక్కడికి ఆరోగ్యం కోసం వస్తారుఉత్తరాఖండ్ లోని మూలికలకుఆయుర్వేద ఔషధాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోందిగత 25 సంవత్సరాలలోసుగంధ మొక్కలుఆయుర్వేద మూలికలుయోగా,  ఆరోగ్య సంరక్షణ పర్యాటకంలో ఉత్తరాఖండ్ అద్భుతమైన పురోగతి సాధించిందిఉత్తరాఖండ్‌లోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ యోగా కేంద్రాలుఆయుర్వేద కేంద్రాలుప్రకృతి చికిత్సా సంస్థలు,  హోమ్‌స్టేలతో ఒక సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఏర్పాటుకు ఇప్పుడు సమయం ఆసన్నమైందిఇది మన అంతర్జాతీయ పర్యాటకులకు ప్రత్యేక  ఆకర్షణగా ఉంటుంది.

మిత్రులారా

భారత ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాల్లో వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమానికి ఎంత ప్రాధాన్యం ఇస్తోందో మీ అందరికీ తెలుసుఉత్తరాఖండ్‌లోని అభివృద్ధి చెందిన ప్రతి గ్రామం కూడా స్వయంగా ఒక చిన్న పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాఅక్కడ హోమ్‌స్టేలు ఉండాలిఅక్కడ స్థానిక వంటకాలు,  స్థానిక సంస్కృతిని ప్రోత్సహించాలిఇతర ప్రాంతాల నుంచిలేదా విదేశాల నుంచి వచ్చే సందర్శకులు వెచ్చనిఇంటిలాంటి వాతావరణాన్ని అనుభూతి చెందిడబ్కేచుడ్కానీరోట్-ఆర్సారాస్-భాత్ఝంగోరే కీ ఖీర్ వంటి సాంప్రదాయ వంటకాలను ఆస్వాదిస్తే ఎంత సంతోషిస్తారో ఒక్కసారి ఊహించుకోండిఆ ఆనందం వారిని ఉత్తరాఖండ్‌కు ఒక్కసారి కాదుపదేపదే తిరిగి వచ్చేలా చేస్తుంది.

మిత్రులారా

ఉత్తరాఖండ్ లో మరుగునపడి ఉన్న సామర్థ్యాన్ని వెలికితీయడంపై ఇప్పుడు మనం దృష్టి పెట్టాలిహరేలాఫూల్దేయిభితౌలి వంటి స్థానిక పండుగలలో పాల్గొనే పర్యాటకులు ఆ అనుభవాలను జీవితాంతం గుర్తుంచుకుంటారుఇక్కడి జాతరలు కూడా అంతే ఉత్సాహంగా ఉంటాయినందా దేవి మేళాజౌల్జివి మేళాబాగేశ్వర్ ఉత్తరాయణి మేళాదేవీధురా మేళాశ్రావణి మేళాబటర్ ఫెస్టివల్ ఉత్తరాఖండ్ ప్రత్యేకతను చెబుతాయిఈ స్థానిక జాతరలుపండుగలను ప్రపంచ పటంలో ప్రదర్శించడానికి మనం "ఒక జిల్లాఒక పండుగ"  వంటి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు.

మిత్రులారా

ఉత్తరాఖండ్‌లోని అన్ని పర్వత ప్రాంత జిల్లాలు పండ్ల సాగుకు అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయిమనం ఈ కొండ జిల్లాలను ఉద్యాన పంటల  కేంద్రాలుగా మార్చడంపై దృష్టి పెట్టాలిబ్లూబెర్రీలుకివిమూలికలుఔషధ మొక్కలు వంటి పంటలు భవిష్యత్ వ్యవసాయంలో ప్రాముఖ్యం వహిస్తాయిఆహార శుద్ధిహస్తకళలుసేంద్రీయ ఉత్పత్తుల వంటి రంగాలను అభివృద్ధి చేయడానికి ఉత్తరాఖండ్ తన ఎంఎస్ఎంఈ రంగాన్ని మరింత బలోపేతం చేయాలి.

మిత్రులారా

ఉత్తరాఖండ్‌కు సంవత్సరం పొడవునా పర్యాటకానికి అపారమైన సామర్థ్యం ఉందిఇప్పుడు కనెక్టివిటీ మెరుగుపడుతున్నందునమనం అన్ని సీజన్ల పర్యాటకం వైపు అడుగులు వేయాలని నేను గతంలో సూచించానుశీతాకాల పర్యాటకానికి ఉత్తరాఖండ్ ఒక కొత్త అవకాశాల్ని అందిస్తున్నందుకు సంతోషంనాకు లభించిన తాజా గణాంకాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయిశీతాకాల పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందిపిథోర్‌ఘర్‌లో, 14,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో హై-ఆల్టిట్యూడ్ మారథాన్ ను నిర్వహించడం విశేషంఆది కైలాస్ పరిక్రమ రన్ కూడా దేశం మొత్తానికి స్ఫూర్తిగా మారిందిమూడు సంవత్సరాల కిందట, 2,000 మంది భక్తులు కైలాస్ యాత్ర చేసేవారుఈ రోజుఆ సంఖ్య 30,000 దాటిందిఈ సంవత్సరం 17 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారుకొద్ది రోజుల కిందట కేదార్ నాథ్ ఆలయాన్ని మూసివేశారుయాత్రా స్థలాలుఏడాది పొడవునా కొనసాగే పర్యాటక కార్యకలాపాలే ఉత్తరాఖండ్‌ అభివృద్ధిని కొత్త శిఖరాలకు తీసుకెళ్తున్నాయిఇక్కడ పర్యావరణసాహస టూరిజం రంగాల్లో కూడా అపారమైన అవకాశాలు ఉన్నాయిఉత్తరాఖండ్ దేశం లోని మొత్తం యువతను ఆకర్షించే ప్రధాన గమ్యస్థానంగా మారగలదు.

మిత్రులారా

ఉత్తరాఖండ్ నిర్మాణ కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతోందిరాష్ట్ర కొత్త చలనచిత్ర విధానం షూటింగ్‌లను మరింత సులభతరం చేసిందిఅలాగేఉత్తరాఖండ్ వివాహ గమ్యస్థానంగా కూడా ప్రాచుర్యం పొందుతోందిమీకు తెలిసినట్లుగానేను "భారతదేశంలో వివాహం చేసుకోండిఅనే ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నానువెడ్ ఇన్ ఇండియా కోసం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వివాహ సౌకర్యాలను అభివృద్ధి చేయాలిదీనిని సాధించడానికి, 5 నుండి ప్రధాన ప్రదేశాలను గుర్తించివాటిని ప్రముఖ వివాహ వేదికలుగా అభివృద్ధి చేయాలి.

మిత్రులారా

దేశం ఆత్మనిర్భర్ భారత్ లేదా స్వావలంబన భారత్ దిశగా వెళుతున్నదిస్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ద్వారానే ఈ లక్ష్యాన్ని చేరడం సాధ్యమవుతుందిఉత్తరాఖండ్ ఎల్లప్పుడూ ఈ దృష్టితోనే ఉందిస్థానిక ఉత్పత్తుల పట్ల ప్రేమవాటి వినియోగంవాటిని దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం ఈ రాష్ట్ర సంప్రదాయాలలో విడదీయరాని భాగంఉత్తరాఖండ్ ప్రభుత్వం 'వోకల్ ఫర్ లోకల్ప్రచారాన్ని వేగవంతం చేయడం సంతోషంగా ఉందిఈ కృషి ఫలితంగాఉత్తరాఖండ్ నుంచి  15 వ్యవసాయ ఉత్పత్తులు భౌగోళిక గుర్తింపును పొందాయిబేడు పండుబద్రీ ఆవు నెయ్యి ఇటీవల జీఐ గుర్తింపు పొందడం గొప్ప గర్వకారణంబద్రీ ఆవు నెయ్యి ప్రతి పర్వత ప్రాంత గృహానికి గర్వకారణంఇప్పుడుబేడు పండు పర్వత ప్రాంత గ్రామాల నుంచి రాష్ట్రం వెలుపలి మార్కెట్లకు చేరుతోందిదాని నుంచి  తయారుచేసిన ఉత్పత్తులు జీఐ  ట్యాగ్‌ను కలిగి ఉంటాయిఈ ఉత్పత్తులు ఎక్కడికి వెళ్లినాఅవి తమతో పాటు ఉత్తరాఖండ్  గుర్తింపును కూడా తీసుకువెళ్తాయిమనం ఇలాంటి జీఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తులు దేశంలోని ప్రతి ఇంటికి చేరేలా చూడాలి.

మిత్రులారా

"హౌస్ ఆఫ్ హిమాలయాస్ఉత్తరాఖండ్‌కు ఒక బలమైన బ్రాండ్‌గా మారడం సంతోషంగా ఉందిఇది స్థానిక గుర్తింపులన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తోందిఈ బ్రాండ్ కిందరాష్ట్రంలోని విభిన్న ఉత్పత్తులకు ఒక ఏకీకృత గుర్తింపు ఇచ్చారుతద్వారా అవి ప్రపంచ మార్కెట్‌లో పోటీ పడగలవురాష్ట్రంలోని అనేక ఉత్పత్తులు ఇప్పుడు డిజిటల్ వేదికలపై కూడా అందుబాటులో ఉన్నాయితద్వారా అవి వినియోగదారులకు నేరుగా అందుతాయిరైతులుకళాకారులుచిన్న పారిశ్రామికవేత్తలకు కొత్త మార్కెట్లు తెరుచుకుంటున్నాయిమనం ఇప్పుడు "హౌస్ ఆఫ్ హిమాలయాస్బ్రాండింగ్‌లో కొత్త శక్తిని నింపాలిదాని డెలివరీ విధానాలను కూడా మెరుగుపరుస్తూ ముందుకు సాగాలి

మిత్రులారా

ఉత్తరాఖండ్ అభివృద్ధి ప్రయాణం సంవత్సరాలుగా అనేక సవాళ్లను ఎదుర్కొందని మీకు తెలుసుకానీ బలమైన బీజేపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఈ అడ్డంకులను అధిగమించిపురోగతి వేగం ఎప్పుడూ తగ్గకుండా చూసిందిఉత్తరాఖండ్ లోని ధామి ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ని చిత్తశుద్ధితో అమలు చేసిఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందిమత మార్పిడి వ్యతిరేక చట్టంఅల్లర్ల నియంత్రణ చట్టం వంటి జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతమైన చర్యలు తీసుకుందిభూకబ్జా నిరోధంజనాభా మార్పులు వంటి సున్నితమైన అంశాలపై బీజేపీ ప్రభుత్వం దృఢమైన చర్యలు తీసుకుందివిపత్తు నిర్వహణ రంగంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం త్వరగాసున్నితంగా స్పందించి తన ప్రజలకు సహాయం చేయడానికి సాధ్యమయ్యే ప్రతి చర్యా తీసుకుంది

మిత్రులారా

ఉత్తరాఖండ్ రజతోత్సవ సందర్భంలోరాబోయే సంవత్సరాలలోమన ఉత్తరాఖండ్ తన గొప్ప సంస్కృతినిప్రత్యేక గుర్తింపును గొప్పగా ముందుకు తీసుకువెళుతూకొత్త అభివృద్ధి శిఖరాలను అధిరోహిస్తుందని నేను నమ్ముతున్నానుఈ రజతోత్సవ వేడుక సందర్భంగా ఉత్తరాఖండ్‌ ప్రజలందరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందనలుమన దేశ స్వాతంత్ర్యం 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే మరో 25 సంవత్సరాల నాటికి  ముందు చూపుతో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని మిమ్మల్ని కోరుతున్నా.  మనం ఈరోజే సరైన మార్గాన్ని ఎంచుకునిఆలస్యం చేయకుండా ముందుకు సాగాలిఉత్తరాఖండ్ ప్రభుత్వానికి ప్రతి అడుగులోనూ అండగా నిలబడటానికి భారత ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని నేను మీకు హామీ ఇస్తున్నాఉత్తరాఖండ్‌లోని ప్రతి కుటుంబానికి,  ప్రతి పౌరుడికి సంతోషంశ్రేయస్సు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూమీ అందరికీ ధన్యవాదాలు.

భారత మాతా కీ జై!

భారత మాతా కీ జై!

ఈ సంవత్సరం "వందేమాతరం" 150వ వార్షికోత్సవంకాబట్టిమనమంతా కలిసి చెబుదాం -

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

ధన్యవాదాలు.

 

****


(Release ID: 2188588) Visitor Counter : 10