సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav
iffi banner

ఐసీఎఫ్‌టీ-యునెస్కో గాంధీ పతకం: శాంతి, అహింసను ప్రోత్సహించే సినిమాలకు ఐఎఫ్ఎఫ్ఐ 2025 సత్కారం

భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 46వ ఎడిషన్‌లో ప్రారంభించిన ఐసీఎఫ్‌టీ-యునెస్కో గాంధీ పతకం, యునెస్కో ఆధ్వర్యంలోని ఐసీఎఫ్‌టీ పారిస్‌తో కలిసి అందించే అంతర్జాతీయ గౌరవం.

"ఈ పురస్కారం సాంస్కృతిక సమన్వయాన్ని, మహాత్మా గాంధీ ప్రబోధించే శాంతి, అహింసలను ప్రోత్సహించే చిత్రాలకు అందిస్తారు.

గౌరవ జ్యూరీ ప్యానల్ సభ్యులు 10 పేరొందిన చిత్రాలను ఈ ఏడాదికి ఎంపిక చేశారు. ప్యానల్ సభ్యుల్లో..  చలన చిత్ర, టెలివిజన్ దర్శకుడు-నిర్మాత, అల్జీర్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ కళాత్మక సంచాలకులు డాక్టర్ అహ్మద్ బెడ్జావి (జ్యూరీ అధ్యక్షులు), అంతర్జాతీయ చలనచిత్ర, టెలివిజన్, ఆడియోవిజువల్ కమ్యూనికేషన్ మండలి (సీఐసీటీ-ఐసీఎఫ్‌టీ) ఉపాధ్యక్షులు, ప్లాట్‌ఫారమ్ ఫర్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ (పీసీఐ) డైరెక్టర్ జూయాన్ హున్, యునికా ఉపాధ్యక్షులు (అంతర్జాతీయ సినిమా యూనియన్) సెర్జ్ మిచెల్, అంతర్జాతీయ థియేటర్ ఇనిస్టిట్యూట్ (ఐటీఐ) మాజీ డైరెక్టర్-జనరల్ టోబియాస్ బియాంకోన్, అంతర్జాతీయ చలనచిత్ర, టెలివిజన్, ఆడియో విజువల్ కమ్యూనికేషన్ మండలి (సీఐసీటీ-ఐసీఎఫ్‌టీ) డైరెక్టర్-జనరల్ జార్జెస్ డ్యూపాంట్, యునెస్కోలో మాజీ సీనియర్ అంతర్జాతీయ సివిల్ సర్వెంట్లు ఉన్నారు.

బ్రైడ్స్

నాటక రచయిత్రి, నిర్మాత నాదియా ఫాల్స్ తొలి నాటక చిత్రం 'బ్రైడ్స్'ను సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో మొదటిసారి ప్రదర్శించారు. ఈ చిత్రం వరల్డ్ సినిమా (డ్రామాటిక్) విభాగంలో గ్రాండ్ జ్యూరీ బహుమతికి నామినేట్ అయింది.

ఇద్దరు బ్రిటీష్ ముస్లిం బాలికలు, చెదిరిపోయిన తమ కుటుంబాల నుంచి దూరంగా వెళ్లి, జీవితంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలన్న తపనతో చేసే ప్రయాణాన్ని ఈ చిత్రం చూపిస్తుంది. అయితే వాళ్లు ఎక్కడికి వెళ్తున్నారో అర్థం చేసుకునే దానికన్నా ముందు, వారు వదిలి వచ్చిన గత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ప్రపంచంలో నానాటికీ పెరుగుతున్న వైరుధ్యాల నేపథ్యంలో తీవ్రవాదం, యువత గుర్తింపు, అనుబంధం, విశ్వాసం, అవకాశం వంటి అంశాలను సంచలనాలకు దూరంగా, మానవతా దృక్పథంతో ఆకట్టుకునేలా ఈ సినిమాను చిత్రీకరించారు.

సేఫ్ హౌజ్ (అసలు శీర్షిక – ఫర్ మోర్కెట్)

కొత్త తరం చలనచిత్ర నిర్మాత, నార్వే రచయిత ఎరిక్ స్వెన్సన్, తాజాగా తీసిన అంతర్యుద్ధ నాటక చిత్రం 'సేఫ్ హౌస్'. 48వ గోథెన్‌బర్గ్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో ప్రారంభ చిత్రంగా, ప్రపంచంలోనే తొలిసారిగా దీన్ని ప్రదర్శించగా, ఆడియన్స్ డ్రాగన్ అవార్డు (ఉత్తమ నార్డిక్ చిత్రం)ను గెలుచుకుంది.

హనా

అవార్డు గెలుచుకున్న కొసోవన్ నిర్మాత ఉజ్కాన్ హైసాజ్ తొలి చిత్రం 'హనా', 56వ భారత అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో ప్రదర్శించారు.

ఇది ఒక నటి కథనం. కొసోవోలోని మహిళా పునరావాస కేంద్రంలో చేరిన ఆమె, యుద్ధ బాధితుల బాధను కళ ద్వారా వ్యక్తపరచటానికి సహాయం చేస్తుంది. కానీ, ఆ బాధితుల కథలు విన్నప్పుడు ఆ నటి.. గతంలోని చేదు అనుభవాలను, చెదిరిపోయిన అస్తిత్వాన్ని గుర్తుచేసుకుంటుంది.

జ్ఞాపకాలు, గాయాలు నయం కావటానికి, మర్చిపోలేని కష్టాలను ఎదుర్కొనేందుకు కళకున్న శక్తిని లోతుగా, మనసుని కదిలించేలా 'హనా' సినిమా వివరిస్తుంది.

కె పోపర్

ఇరానియన్ నటుడు, నాటక రచయిత ఇబ్రహీం అమిని దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా కె పోపర్, టాలిన్ బ్లాక్ నైట్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో ప్రదర్శించారు.

ఈ చిత్రంలో ఇరాన్‌కు చెందిన టీనేజ్ అమ్మాయి కే-పోప్ విగ్రహాన్ని విపరీతంగా ఆరాధిస్తుంది. అతని ప్రదర్శన చూడటానికి ఆమె సియోల్‌కు ప్రయాణించాలని నిర్ణయించుకుంటుంది. అందుకు ఆమె తల్లి నిరాకరించిన నేపథ్యంలో వారిద్దరి మధ్య.. కలలు, భయాలు, తరతరాల విలువలకు సంబంధించిన అంశాలపై ఘర్షణ చెలరేగుతుంది.

ఈ చిత్రంలోని సన్నివేశాలు సున్నితంగా ఉంటాయి. యువత ఆశయాలు, సామాజిక సంబంధాలు, తల్లిదండ్రుల ఆందోళన, మనం ఏం కోరుకుంటున్నాం, దేన్ని అనుభవిస్తున్నాం అనే అంశాల మధ్య ఉన్న అంతరాన్ని తెలియజేస్తుంది.

ది ప్రెసిడెంట్స్ కేక్ (అసలు శీర్షిక – మమ్లాకెట్ అల్-ఖసబ్)

ఇరాక్ రచయిత, నిర్మాత, ఉపాధ్యాయుడైన హసన్ హాది, 'ది ప్రెసిడెంట్స్ కేక్' చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఈ సినిమాను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో మొదటిసారిగా ప్రదర్శించగా.. ఆడియెన్స్ అవార్డు, కెమెరా డి'ఓర్ అవార్డులు గెలుచుకుంది. అలాగే 98వ ఆస్కార్ అవార్డులకు 'ఉత్తమ విదేశీ చిత్రం' విభాగంలో ఇరాక్ తరఫున ఈ సినిమా ఎంపికైంది.

1990ల నాటి ఇరాక్‌లోని పరిస్థితులను నేపథ్యంగా తీసిన సినిమా ఇది. తొమ్మిదేళ్ల లామియా అనే అమ్మాయి, ఆ దేశాధ్యక్షుడి పుట్టినరోజుకు కేకు తయారుచేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఇరాక్ లో ఉన్న రాజకీయ గందరగోళ పరిస్థితులు, ఐక్యరాజ్యసమితి ఆంక్షలతో ప్రజల రోజువారీ జీవనమే కష్టతరంగా ఉంటుంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేకు తయారీకి కావాల్సిన వస్తువుల కోసం లామియా ప్రయత్నిస్తుంది. 

యుద్ధాలు, రాజకీయ సమస్యల వల్ల ఏర్పడే ఆహార కొరత కారణంగా పిల్లలు అనుభవించే దుర్భర జీవితాలను ఈ సినిమా చూపిస్తుంది.

కేవలం పిండి కోసం మొదలైన ప్రయత్నం, చివరకు ఆహారం, భద్రత, బాలల హక్కులకు దూరమవటం వంటి అంశాలను తెలియజేసే బాధాకరమైన కథనంతో సినిమా సాగుతుంది.

ది వేవ్ (అసలు శీర్షిక – లా ఓలా)

చిలీ సినిమా పరిశ్రమలో అగ్ర నిర్మాతల్లో ఒకరైన సెబాస్టియన్ లెలియో మొదటి సంగీత నాటకీయ చిత్రం ది వేవ్. ఈ చిత్రాన్ని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో తొలిసారి ప్రదర్శించారు.

2018 నాటి చిలీ ఫెమినిస్ట్ నిరసనలు, సమ్మెల స్ఫూర్తితో రూపొందించిన ఈ చిత్రం, యూనివర్సిటీ విద్యార్థిని జూలియా చుట్టూ తిరుగుతుంది. నిరసనలు పెరుగుతున్న తరుణంలో, ఆమె ఎదుర్కొన్న లైంగిక దాడికి సంబంధించిన వాస్తవాలను జీర్ణం చేసుకోలేక సతమతమవుతుంది.

కొరియోగ్రఫీ, కోరస్, భావోద్వేగ విముక్తి కలిగించే ప్రదర్శనలను ఉపయోగించి, సామూహిక ఆగ్రహాన్ని ఉత్తేజకరమైన సినిమాటిక్ దృశ్యంగా మార్చి, సంగీతం, రాజకీయ ఆవశ్యకతల అద్భుతమైన సమ్మేళనాన్ని లెలియో ఈ సినిమా ద్వారా చూపించారు.

యకూషిమా ఇల్యూజన్ (అసలు శీర్షిక – ఎల్ ఇల్యూజన్ డి యకూషిమా)

జపనీస్ దర్శకురాలు నవోమి కవాసే, లక్సెంబర్గిష్-జర్మన్ నటి విక్కీ క్రీప్స్ తో కలిసి అస్తిత్వానికి సంబంధించిన కథనంతో దీన్ని రూపొందించారు. లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో ప్రదర్శించగా, గోల్డెన్ లియోపర్డ్ పురస్కారానికి నామినేట్ అయింది.

జపాన్‌లో పనిచేస్తున్న ఫ్రెంచ్ ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్ ఓ బాలుడి ప్రాణాలను రక్షించటానికి ప్రయత్నిస్తూనే, కనిపించకుండా పోయిన తన భాగస్వామి కోసం వెతుకుతుంది. ఆ దేశంలో ప్రతి సంవత్సరం అదృశ్యమయ్యే వారిలో తన భాగస్వామి ఉంటారు.

కవాసే శైలికి తగినట్లుగా.. మరణం, త్యజించటం, మానవ జీవితాలను పెనవేసే కనిపించని అనుబంధాలపై అంతర్ దృష్టితో ఈ చిత్రం ఉంటుంది.

తన్వి ది గ్రేట్

నటుడు, దర్శకుడు అనుపమ్ ఖేర్ రూపొందించిన ‘తన్వి ది గ్రేట్’ ను, థియేటర్లలో ప్రశంసలు పొందిన తర్వాత ప్రతిష్టాత్మక ఐఎఫ్ఎఫ్ఐలో ప్రదర్శించారు.

 

***

iffi reel

(Release ID: 2188585) Visitor Counter : 2