ప్రధాన మంత్రి కార్యాలయం
కవి, మేధావి అందెశ్రీ మృతి.. ప్రధానమంత్రి సంతాపం
Posted On:
10 NOV 2025 3:02PM by PIB Hyderabad
ప్రముఖ కవి, మేధావి అందెశ్రీ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. అందెశ్రీ మృతి మన సాంస్కృతిక జగతికీ, మేధో ప్రపంచానికీ పెద్ద లోటు అని శ్రీ మోదీ అన్నారు. ‘‘ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మకు అద్దం పట్టాయి. ఆయన ఒక ప్రముఖ కవి, మేధావి. ప్రజల గొంతుకగా ఉంటూ, వారి సంఘర్షణలనూ, తపననూ, మొక్కవోని స్ఫూర్తినీ ఎలుగెత్తి చాటారు. ఆయన రచనలు హృదయాలను స్పందింపచేసి, ప్రజలను ఏకతాటి పైకి తెచ్చి, సమాజ సామూహిక స్పందనను తీర్చిదిద్దాయి. సామాజిక చైతన్యాన్ని సాహితీ శోభతో ఆయన కలబోసిన తీరు విశిష్టమైంది’’ అని శ్రీ మోదీ అన్నారు.
‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘అందెశ్రీ మృతి మన సాంస్కృతిక జగతికీ, మేధో ప్రపంచానికీ పెద్ద లోటు . ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మకు అద్దం పట్టాయి. ఆయన ఒక ప్రముఖ కవి, మేధావి. ప్రజల గొంతుకగా ఉంటూ, వారి సంఘర్షణలనూ, తపననూ, మొక్కవోని స్ఫూర్తినీ ఎలుగెత్తి చాటారు. ఆయన రచనలు హృదయాలను స్పందింపచేసి, ప్రజలను ఏకతాటి పైకి తెచ్చి, సమాజ సామూహిక స్పందనను తీర్చిదిద్దాయి. సామాజిక చైతన్యాన్ని సాహితీ శోభతో ఆయన కలబోసిన తీరు విశిష్టమైంది. ఆయన కుటుంబానికీ, ఆయన అభిమానులకూ నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓం శాంతి.’’ అని పేర్కొన్నారు.
“అందె శ్రీ మరణం మన సాంస్కృతిక , మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఒక గొప్ప కవి, మేధావి అయిన ఆయన, ప్రజల పోరాటాలకు , ఆకాంక్షలకు ,అకుంఠిత స్ఫూర్తికి గొంతుకగా నిలిచారు. ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను ఏకం చేసే శక్తి, ప్రజల సాంఘిక హృదయ స్పందనకి రూపం ఇచ్చే శక్తీ ఉన్నాయి. ఆయన సామాజిక స్పృహను, సాహితీ సౌందర్యంతో మిళితం చేసిన విధానం అద్వితీయం. వారి కుటుంబసభ్యులకు,అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి."
***
(Release ID: 2188584)
Visitor Counter : 5
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam