ప్రధాన మంత్రి కార్యాలయం
"వందేమాతరం" జాతీయ గేయం 150వ స్మారక ఉత్సవాల ప్రారంభ దృశ్యాలను పంచుకున్న ప్రధానమంత్రి
Posted On:
07 NOV 2025 1:00PM by PIB Hyderabad
ఏడాది పొడవునా జరిగే "వందేమాతరం" జాతీయ గేయం 150వ స్మారక ఉత్సవాలను ఇవాళ న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రారంభించారు. "వందేమాతరం" కేవలం ఒక మాట మాత్రమే కాదు.. అది ఒక మంత్రం, ఒక శక్తి, ఒక స్వప్నం, పవిత్ర సంకల్పం అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ సామూహిక గేయాలాపన వర్ణనాతీతమైన, అద్భుతమైన అనుభవమని వర్ణిస్తూ.. ఒకే లయ, స్వరం, భావంతో గేయాలాపన హృదయాన్ని కట్టిపడేసింది’’ అని అన్నారు. వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా నవంబర్ 7వ తేదీ చరిత్రాత్మక రోజని ప్రధానమంత్రి అన్నారు.
స్మారక ఉత్సవాల ప్రారంభ దృశ్యాలను పంచుకుంటూ, సోషల్ మీడియా ఎక్స్ లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
|"దేశం కోసం పోరాడేందుకు తరతరాలను ప్రేరేపించిన వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ ప్రసంగం"
https://t.co/qQqjgmSXy5
"ఢిల్లీలో జరిగిన జాతీయ గేయం వందేమాతరం 150 సంవత్సరాల చారిత్రక వేడుకలో పాల్గొనటం ద్వారా, ఒక కొత్త శక్తిని పొందాను" pic.twitter.com/fnQBcyMS6a
"వందేమాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక తపాలా బిళ్ల, స్మారక నాణేన్ని విడుదల చేయడం నాకు గర్వంగా ఉంది" pic.twitter.com/nYBRGcFS1W
"ఈ సందర్భంగా వందేమాతరం చారిత్రక ప్రయాణాన్ని, సాంస్కృతిక ప్రాముఖ్యతను ఆకట్టుకునే విధంగా చూపించే ప్రదర్శనను కూడా నేను సందర్శించాను" pic.twitter.com/iQgtR9dtBD
"వందేమాతరం 150 సంవత్సరాలకు సంబంధించిన వెబ్‌సైట్‌ను ఇవాళ ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ప్రతి భారతీయుడు తన సొంత గొంతుతో ఈ అమర గేయాన్ని ఆలపించి, దానితో ఆత్మీయ అనుబంధాన్ని అనుభూతి చెందవచ్చు ps://vandemataram150.in”
https://t.co/7n0CCoyQFR
"వందేమాతరం సామూహిక గేయాలాపన సమయంలో ప్రతి స్వరంలోనూ దేశభక్తి, ఐక్యత, అంకితభావం, అద్భుతమైన ప్రతిధ్వని వినిపించింది. వందేమాతరం కేవలం పాట కాదు, భారతదేశ ఆత్మకు అభివ్యక్తీకరణ అని ఈ ప్రదర్శన తెలియజేసింది" pic.twitter.com/edq7j6sBAa
"బానిస కాలంలో వందేమాతర నినాదం, భారత్ స్వాతంత్ర్యం సాధిస్తుందని, భరతమాత చేతులకున్న సంకెళ్లు తొలగిపోతాయని, భరతమాత బిడ్డలు స్వయంగా తమ విధిని నిర్ణయించుకుంటారనే సంకల్పానికి ప్రకటనగా మారింది" pic.twitter.com/RC6Yfa32dC
వందేమాతరం గేయ రచనలో బంకిం బాబు ఉపయోగించిన ప్రతీ పదానికి, పదాల భావాలకు లోతైన అంతరార్థం ఉంటుంది. అందుకే ప్రతి యుగంలోనూ, ప్రతి కాలంలోనూ సందర్భోచితంగా ఉంటుంది. pic.twitter.com/3EALDsyQn2
"వందేమాతరం నినాదం చేస్తూ దేశం కోసం బలిదానం చేసిన అజ్ఞాత వ్యక్తులందరికీ ఇవాళ మనం 140 కోట్ల దేశవాసులం నివాళులర్పిస్తున్నాం" pic.twitter.com/GKamHwDhqq
"వందేమాతరం ప్రభావంతో మన దేశ నిర్మాణంలో నారీశక్తి అగ్రస్థానంలో ఉండాలనే భారతావని కలను మనం ఇవాళ మరోసారి సాకారం చేసుకుంటున్నాం" pic.twitter.com/hfLgETE9yX
"నూతన భారతం మానవత్వ సేవకు కమల, విమల స్వరూపమైతే.. అదే భారతదేశం, ఉగ్రవాదాన్ని నాశనం చేయటానికి 'దశ ప్రహరణ- ధారిణీ దుర్గ'గా మారగలదు" pic.twitter.com/MTIxTHOrRh
"జాతీయ నిర్మాణానికి మహా మంత్రమైన వందేమాతరం గేయంలోని ముఖ్యమైన పంక్తులను ఎందుకు తొలగించారో నేటి తరానికి తెలియటం అవసరం. ఇది చాలా పెద్ద అన్యాయం" pic.twitter.com/tWuzf7VqHd
"అభివృద్ధి చెందిన, స్వావలంబన భారత్ దిశగా అడుగులు వేస్తున్న దేశం మనది. నూతన విజయాలను సాధించినప్పుడల్లా, గర్వించదగిన
ప్రతి భారతీయుడి నినాదం - వందేమాతరం!” pic.twitter.com/GuQc6yuKoJ
(Release ID: 2187540)
Visitor Counter : 4