రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఇండియన్ నేవల్ అకాడమీలో భారతీయ నౌకా సేన థింక్-25 తుది పోటీలు


విజేతగా నిలిచిన జైపూర్‌కి చెందిన జయశ్రీ పెరివాల్ ఉన్నత పాఠశాల

Posted On: 06 NOV 2025 10:09AM by PIB Hyderabad

ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఏ)లో 2025, నవంబర్ 5న భారతీయ నౌకా సేన నిర్వహించిన థింక్ 25 క్విజ్ తుది పోటీ ఉత్సాహంగా ముగిసిందిఈ కార్యక్రమానికి నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠి ముఖ్యఅతిథిగా హాజరయ్యారుదీంతో దేశవ్యాప్తంగా నిర్వహించిన విజ్ఞానంఆవిష్కరణసుసంపన్నమైన భారతీయ నౌకా వారసత్వానికి సంబంధించిన మేధో యాత్ర ముగిసింది.

మహాసాగర్’ ఇతివృత్తంతో ఈ ఏడాది నిర్వహించిన ఈ కార్యక్రమం.. అన్వేషణసమర్థతనిబద్ధత అనే భారతీయ నౌకా సేన స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందిఅలాగే యువతలో సముద్ర భద్రతా అవగాహనను పెంపొందించాలనే అంకితభావాన్ని సూచిస్తుందిదేశవ్యాప్తంగా వేలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొనగా.. ఉత్తరదక్షిణతూర్పుపశ్చిమ జోన్ల నుంచి 16 పాఠశాలలు సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయి.

తెలివితేటలుబృంద స్ఫూర్తిఆసక్తిని నిరూపించుకుంటూ.. ప్రతిష్ఠాత్మక థింక్ - 25 తుది పోటీకి ఎనిమిది జట్లు చేరుకున్నాయి.

తుది పోటీదారులుజయశ్రీ పెరివాల్ ఉన్నత పాఠశాల – జైపూర్భారతీయ విద్యాభవన్ కన్నూర్సుబోధ్ పబ్లిక్ స్కూల్ జైపూర్శిక్షా నికేతన్ జంషెడ్‌పూర్పద్మ శేషాద్రి బాల భవన్ సీనియర్ సెకండరీ స్కూల్ చెన్నైకేంబ్రిడ్జి కోర్టు హై స్కూల్ జైపూర్డాక్టర్ వీరేంద్ర స్వరూప్ ఎడ్యుకేషన్ సెంటర్ కాన్పూర్పీఎం శ్రీ జేఎన్‌వీ సమస్టిపూర్.

ఈ పోటీల్లో జైపూర్‌కి చెందిన జయశ్రీ పెరివాల్ హై స్కూల్ విజేతగా నిలవగాసమస్టిపూర్‌కు చెందిన పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ రన్నరప్‌గా నిలిచి థింక్ - 25 కు స్ఫూర్తిదాయకమైన ముగింపు తీసుకువచ్చాయి.

ఈ సందర్భంగా నౌకాదళ ప్రధానాధికారి మాట్లాడుతూ.. ఉత్సాహంఅవగాహనభారతీయ నౌకా సేన వారసత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకొని ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను ప్రశంసించారుయువతలో ఉత్సాహాన్ని పెంపొందించడంఆవిష్కరణలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని వివరించారుఇవే భవిష్యత్తులో నౌకా సేనను నడిపించే నాయకులనుమేధావులను తయారు చేస్తాయన్నారు.

భారతీయ నౌకా సేవ అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా తుది పోటీలు ప్రత్యక్ష ప్రసారమయ్యాయిదేశవ్యాప్తంగా వివిధ పాఠశాలలునౌకాసేన సంస్థలుసముద్ర రంగంపై ఆసక్తి ఉన్నవారు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.

అన్వేషణఆసక్తినైపుణ్యాలు దిశగా యువతను ప్రోత్సహించేలా జ్ఞానంపరిశోధన అనే సాహస యాత్రను కొనసాగిస్తూ.. థింక్ - 26 నిర్వహించేందుకు భారత నౌకా సేన ఎదురుచూస్తోంది.

 


(Release ID: 2186895) Visitor Counter : 4