సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
స్వచ్ఛతతో పాటు పెండింగ్‌లో ఉన్న వాటి పరిష్కారం కోసం చేపట్టిన స్పెషల్ క్యాంపెయిన్ 5.0 విజయవంతంగా పూర్తి చేసిన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
స్పెషల్ క్యాంపెయిన్ 5.0 కింద మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యకలాపాలను తనిఖీ, సమీక్ష చేసిన సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్
ఈ స్పెషల్ క్యాంపెయిన్ 5.0 లో భాగంగా 2.6 లక్షల కిలోలకు పైగా పనికిరాని సామాగ్రిని పారవేయటం ద్వారా 77,000 చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని ఖాళీ చేసిన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
Posted On:
04 NOV 2025 7:52PM by PIB Hyderabad
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ స్ఫూర్తితో స్వచ్ఛత, పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారం కోసం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహించిన స్పెషల్ క్యాంపెయిన్ 5.0 విజయవంతంగా పూర్తైంది. కార్యాలయ ప్రాంగణాల్లో స్వచ్ఛత, కార్యాలయ సుందరీకరణను వ్యవస్థీకృతం చేయటంతో పాటు నిర్ణయాలు తీసుకోవటాన్ని మెరుగుపరచాలన్న లక్ష్యంతో అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు ఈ క్యాంపెయిన్‌ను నిర్వహించారు.
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చేపట్టిన స్పెషల్ క్యాంపెయిన్ 5.0 విశేషాలు:
* నిర్వహించిన బహిరంగ పారిశుద్ధ్య కార్యక్రమాలు - 1271, శుభ్రం చేసిన స్థలాల సంఖ్య: 2073
* పారవేసిన పనికిరాని సామాగ్రి మొత్తం- 262391 కిలోలు. దీనిలో 40,381 కిలోల ఈ-వ్యర్థాలు ఉన్నాయి. దీని ద్వారా వచ్చిన ఆదాయం రూ. 1.37 కోట్లు. ఖాళీ అయిన కార్యాలయ స్థలం: 77348 చదరపు అడుగులు. నడిచేందుకు పనిరావని ప్రకటించిన మొత్తం వాహన సంఖ్య- 174.
* రికార్డుల నిర్వహణలో భాగంగా సమీక్షించిన భౌతిక ఫైళ్లు- 35281. ఇందులో 11389 ఫైళ్లను తొలగించారు. 1486 ఈ-ఫైళ్లను సమీక్షించారు. వీటిలో 289 ఈ-ఫైళ్లను మూసేశారు.
* 489 ప్రజా ఫిర్యాదులు, 121 ప్రజా ఫిర్యాదుల అప్పీళ్లు, 19 ఎంపీలు పంపించిన అంశాలు, 2 రాష్ట్ర ప్రభుత్వాలు పంపించిన సమస్యలు, 2 పీఎంఓ పంపించిన సమస్యలను పరిష్కరించారు.
స్వచ్ఛత సందేశాన్ని అందరికి చేరవేయటం, అవగాహన కల్పించడం, ప్రజా భాగస్వామ్యాన్ని పెంచే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముద్రణ, ఎలక్ట్రానిక్, సామాజిక మాధ్యమాల ప్రచారం చేశారు.
ఈ కార్యక్రమం పురోగతిని కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు వారానికోసారి క్రమం తప్పకుండా సమీక్షించారు. మంత్రిత్వ శాఖ తరఫున నోడల్ అధికారి అయిన సీనియర్ ఆర్థిక సలహాదారు శ్రీ ఆర్.కె. జెనా రోజువారీగా ప్రతి మీడియా యూనిట్ నోడల్ అధికారులతో పురోగతిని సమీక్షించారు. సమాచార - ప్రసార శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్.. మంత్రిత్వ శాఖ కార్యాలయాలను తనిఖీ చేసి మెరుగుపరిచేందుకు కావాల్సిన సూచనలు చేశారు.
కార్యాలయ వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు, స్వచ్ఛత సందేశాన్ని వ్యాప్తి చేయడానికి మంత్రిత్వ శాఖ, దాని క్షేత్రస్థాయి కార్యాలయాలు అనేక ఉత్తమ పద్ధతులను అనుసరించాయి. వాటిలో కొన్ని:
1. అఖిల భారత రేడియో అహ్మదాబాద్‌లో ప్రహరీ గోడ సుందరీకరణ:
ఆఖిల భారత రేడియో (ఏఐఆర్- ఆల్ ఇండియా రేడియో) అహ్మదాబాద్ కార్యాలయ ప్రహరీ గోడకు మీడియా, వినోద రంగానికి సంబంధించిన చిత్రాలతో పేయింటింగ్ వేసి కొత్త రూపాన్ని ఇచ్చారు.
2. ఎస్ఆర్ఎఫ్‌టీఐ కోల్‌కతాలో 'వ్యర్థాల నుంచి కళ' :
ఎస్ఆర్‌ఎఫ్‌టీఐ విద్యార్థులు పాత వార్తాపత్రికలు, పారవేసిన కార్డ్‌బోర్డులతో ఒక జపనీస్ ఇల్లు, బోగన్విల్లే చెట్టును తయారు చేశారు. దీనిని సెట్‌లో ఒక వస్తువుగా ఉపయోగించారు.
3. ఎస్ఆర్‌ఎఫ్‌టీఐ కోల్‌కతా వ్యర్థాల సేకరణ స్థలం సుందరీకరణ: ఎస్ఆర్‌ఎఫ్‌టీఐలో వ్యర్థాలను సేకరించే స్థలమైన వ్యాట్‌ను అందంగా తీర్చిదిద్దారు.
4. ఐఐఎంసీ కొట్టాయంలో చెరువు నిర్మాణం
నీటి కొరత ఉన్న ఐఐఎంసీ కొట్టాయం క్యాంపస్‌లో ఒక మూలన ఒక చెరువును నిర్మించారు.
5. ప్రధాన సచివాలయంలో గది సుందరీకరణ:
ప్రధాన సచివాలయం సిబ్బంది, అధికారులు శాస్త్రి భవన్‌లోని రాజ్‌భాషా విభాగంలోని గది ‘116ఏ’ను అందంగా తీర్చిదిద్దారు.
చిత్రపటాల రూపంలో ముఖ్యమైన కార్యకలాపాలు:
1. ఈ కార్యక్రమంలో భాగంగా అవగాహన పెంచేందుకు భువనేశ్వర్‌లోని సీబీసీ.. పూరి బస్ స్టాండ్‌లో ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.
2. డీడీకే ప్రయాగ్‌రాజ్ శుభ్రత కార్యక్రమం
3. డీపీడీ తిరువనంతపురం లో శుభ్రతా కార్యక్రమం
ముందు, తరువాత
మంత్రిత్వ శాఖకు చెందిన కార్యాలయాలను సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి సందర్శించారు.
ప్రధాన సచివాలయం, శాస్త్రి భవన్, ఢిల్లీ
దూరదర్శన్ భవన్, ఢిల్లీ
ఆకాశవాణి భవన్, ఢిల్లీ
***
(Release ID: 2186506)
Visitor Counter : 6