హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ముంబయిలో 'భారత నౌకా వాణిజ్య వారోత్సవం- 2025'ను ప్రారంభించిన కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా


“ భద్రత, స్థిరత్వం, స్వావలంబన: ఈ మూడు ప్రధాన అంశాల ఆధారంగా

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ... నౌకా వాణిజ్య దార్శనికత”

“ప్రస్తుత సమయం భారతదేశ నౌకా వాణిజ్య రంగానిది..

ఇది గేట్‌వే ఆఫ్ ఇండియా ఇక గేట్‌వే ఆఫ్ ది వరల్డ్‌’’

“మోదీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల నేడు

భారత్ ప్రపంచ నౌకా వాణిజ్య రంగంలో వర్థమాన శక్తిగా నిలుస్తోంది”

“సముద్రాల విషయంలో దేశానికి ఉన్న ధృడమైన స్థానం, ప్రభుత్వ స్థిరత్వం, నావికా సామర్థ్యాలను ఉపయోగించుకుంటూ అభివృద్ధి, భద్రత, పర్యావరణ పరిరక్షణలో పురోగతిని పెంపొందిస్తూ

ఇండో-పసిఫిక్, గ్లోబల్ సౌత్ మధ్య వారధిగా వ్యవహరిస్తోన్న భారత్”

“2047 నాటికి నౌకా వాణిజ్య విషయంలో భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాలన్న లక్ష్యాన్ని సాధించటంలో కీలక పాత్ర పోషిస్తోన్న ఇండియా మారిటైమ్ వీక్-2025”

“ప్రాకృతిక సమతుల్యతను కాపాడుతూ అభివృద్ధిని వేగవంతం చేసే

నౌకా వాణిజ్య భవిష్యత్‌ను తయారుచేయాలన్న లక్ష్యంతో ఉన్న భారత్”

“సముద్రాలపై ఆధారపడి జీవిస్తున్న చిన్న ద్వీప దేశాలు, గ్లోబల్ సౌత్ దేశాలను దృష్టిలో పెట్టుకొని హరిత, సుసంపన్న, సహకార సముద్ర వ్యవస్థను తయారు చేసే దార్శనికతతో ముందుకు సాగుతున్న భారత్”

“గత 11 సంవత్సరాలుగా భారత నౌకా వాణిజ్య రంగాన్ని జాతీయ సామర్థ్యం, ప్రాంతీయ స్థిరత్వం, ప్రపంచ శ్రేయస్సుకు కేంద్రంగా మార్చిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ”

‘మహాసాగర్’గా (మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్‌మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఎక్రాస్ రీజియన్) మారిన ప్రధానమంత్రి మోదీ నౌకా వాణిజ్య విధానం

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భారత్ ప్రభావానికి చిహ్నంగా ఉన్న మహాసాగర్

భారత్‌ను నౌకా వాణిజ్య రంగంలో ప్రపంచ నాయకత్వ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యాన్ని సాధించే దిశగా నడిపిస్తున్న ‘సాగర్ నుంచి మహాసాగర్’గా మార్చాలనే ప్రధానమంత్రి మోదీ ఆలోచన

పెట్టుబడులను, పారిశ్రామికవేత్తలనూ ఆకర్షించనున్న నౌకా వాణిజ్య పరిధిలోని

23.7 లక్షల స్క్వేర్ కిలోమీటర్లున్న భారత ప్రత్యేక ఆర్థిక మండలి

Posted On: 27 OCT 2025 4:37PM by PIB Hyderabad

కేంద్ర హోంసహకార మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు ముంబయిలో భారత నౌకా వాణిజ్య వారోత్సవం (ఇండియా మారిటైమ్ వీక్ 2025)ను ప్రారంభించారుఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ ఏక్‌నాథ్ షిండేశ్రీ అజిత్ పవార్.. కేంద్ర ఓడరేవులునౌకాయానజలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్‌తో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేంద్ర హోంసహకార మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ.. ప్రపంచ ప్రఖ్యాత గేట్‌వే ఆఫ్ ఇండియాకు ముంబయి నిలయంగా ఉందని అన్నారుప్రస్తుత సమయం భారత్‌ నౌక వాణిజ్య రంగానిదేనన్న ఆయన.. ఇది గేట్‌వే ఆఫ్ ఇండియాను... గేట్‌వే ఆఫ్ ది వరల్డ్‌గా మారుస్తోందని వ్యాఖ్యానించారుగత దశాబ్ద కాలంగా నౌకా వాణిజ్యం విషయంలో తీసుకొచ్చిన నిర్మాణాత్మక సంస్కరణల వల్ల భారత్ ఒక శక్తిమంతమైన కేంద్రంగా మారిందనిప్రపంచ నౌకా వాణిజ్య రంగంలో దేశం పూర్తి సామర్థ్యంతో నిలబడుతోందన్న విషయాన్ని సముద్రాలకు సంబంధించిన సదస్సులు నిరూపించాయన్నారు

11,000 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న తీరప్రాంతం వల్ల సముద్రాల విషయంలో దేశ సామర్థ్యంవ్యూహాత్మక ప్రాబల్యం పట్ల స్పష్టత ఉందని అమిత్‌షా తెలిపారు. 13 తీరప్రాంత రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు జాతీయ జీడీపీలో దాదాపు 60 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 23.7 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రత్యేక ఆర్థిక కేంద్రం (ఈఈజెడ్ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులనుపారిశ్రామికవేత్తలనూ ఆకర్షిస్తోందనిఆయా రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాల్లో దాదాపు 80 కోట్ల మంది నివసిస్తున్నారని ఆయన పేర్కొన్నారుహిందూ మహాసముద్ర ప్రాంతంలోని (ఐఓఆర్) 38 దేశాలు ప్రపంచ ఎగుమతుల్లో సుమారు 12 శాతం వాటా కలిగి ఉన్నాయని తెలిపారుఈ సమావేశం ద్వారా.. ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులకునౌకా వాణిజ్యవేత్తలకూ భారత్‌కు ఉన్న అపార సామర్థ్యాన్ని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు

నౌకా వాణిజ్యం విషయంలో దేశానికి ఉన్న ధృడమైన స్థానంప్రభుత్వపరంగా స్థిరత్వంనావికా సామర్థ్యాలను ఉపయోగించుకుంటూ అభివృద్ధిభద్రతపర్యావరణ పరిరక్షణలో ముందుకు సాగుతున్న భారత్.. ఇండో-పసిఫిక్గ్లోబల్ సౌత్ మధ్య వారధిగా వ్యవహరిస్తోందని కేంద్ర హోం మంత్రి వ్యాఖ్యానించారుసముద్రాల విషయంలో భారత్‌కు 5,000 సంవత్సరాల చరిత్ర ఉందన్న ఆయన.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ విషయంలో కొత్త చరిత్రను సృష్టించేందుకు దేశం సిద్ధంగా ఉందన్నారుఈ సమావేశంలో 100కు పైగా దేశాలు ప్రతినిధులు పాల్గొనటం అనేది.. ప్రపంచ భాగస్వామ్యంప్రాంతీయ స్థిరత్వానికి భారత్‌ అవలంబిస్తున్న సముద్ర విధానం కేంద్ర బిందువుగా ఉందన్న విషయాన్ని తెలియజేస్తోందని వివరించారు

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నౌకా వాణిజ్య చర్చా వేదికగా భారత నౌకా వాణిజ్య వారోత్సవం అవతరించిందని కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా అన్నారుఈ 2025 సమావేశం… 2047 నాటికి నౌకా వాణిజ్య రంగంలో ప్రముఖ స్థానాన్ని పొందాలనే లక్ష్యాన్ని భారత్‌ సాధించేందుకు గణనీయంగా దోహదపడుతుందన్నారుఈ విడత సమావేశంలో 100కు పైగా దేశాల నుంచి  350 మందికి పైగా వక్తలు, 500కు పైగా కంపెనీలు, 1 లక్ష మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారని ఆయన తెలిపారుఇది 10 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి అవకాశాలను కల్పిస్తుందన్నారుభారత్‌ పోటీని మాత్రమే కాకుండా పరస్పర సహకారాన్ని నమ్ముతోందని హోంమంత్రి  ప్రధానంగా ప్రస్తావించారుపరస్పర సహకారం ద్వారా దేశంలోని సముద్ర పరిశ్రమను ప్రపంచ పరిశ్రమలతో అనుసంధానించేందుకు ఒక సమగ్ర రోడ్‌మ్యాప్‌ను తయారు చేసినట్లు తెలిపారు

నౌకా వాణిజ్యం విషయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఉన్న దార్శనికత భద్రతస్థిరత్వంస్వావలంబన అనే మూడు ప్రధాన అంశాలపై ఆధారపడి ఉందని కేంద్ర హోంసహకార మంత్రి పేర్కొన్నారునౌకా వాణిజ్యానికి సంబంధించిన దార్శనికత- 2030లో భాగంగా సాగరమాలనీలి ఆర్థిక వ్యవస్థహరిత సముద్ర దార్శనికత వంటి కార్యక్రమాల ద్వారా ప్రపంచ నౌకానిర్మాణ పరిశ్రమలో భారత్‌ను టాప్ ఐదు దేశాల్లో ఒకటిగా నిలబెట్టాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారుకొత్త లోతైన భారీ పోర్టులను నిర్మిస్తున్నట్లు తెలియజేసిన ఆయన సంవత్సరానికి 10,000 మిలియన్ మెట్రిక్ టన్నుల సరకు రవాణా లక్ష్యంతో ముందుగు సాగుతున్నట్లు వెల్లడించారునౌకాశ్రయాలకు సంబంధించిన రవాణా పూర్తిగా డిజిటలైజ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారుభారత్-మధ్య ప్రాచ్యంఐరోపా ఎకనామిక్ కారిడార్తూర్పు సముద్ర వాణిజ్య కారిడార్ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ వంటి అనుసంధాన ప్రాజెక్టుల్లో కూడా భారత్‌కు ‌భాగస్వామ్యం ఉందన్నారు

గత 11 సంవత్సరాలుగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ.. భారత నౌకా వాణిజ్య రంగాన్ని జాతీయ సామర్థ్యంప్రాంతీయ స్థిరత్వంప్రపంచ శ్రేయస్సుకు కేంద్రంగా మార్చారన్న కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా.. ఈ మూడు లక్ష్యాలను సాధించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారునేడు ప్రపంచ వాణిజ్యంలో మూడింట రెండు వంతులు ఇండో-పసిఫిక్ ద్వారానే జరుగుతోందని.. భారత వాణిజ్యంలో 90 శాతం వాటాను సముద్ర మార్గాలు కలిగి ఉన్నాయన్నారుప్రధానమంత్రి మోదీ సముద్ర విధానం ‘మహాసాగర్’గా (మ్యూచువల్ అండో హోలిస్టిక్ అడ్వాన్స్‌మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఎక్రాస్ రీజియన్మారిందని.. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భారత్ ప్రభావానికి ఇది ప్రతీక అని అన్నారు. ‘సాగర్’ను ‘మహాసాగర్’గా మార్చాలనే ప్రధానమంత్రి మోదీ దార్శనికత.. భారత్‌ను 2047 నాటికి నౌకా వాణిజ్య రంగంలో ప్రపంచ నాయకత్వ స్థాయికి వెళ్లేలా చేస్తుందన్నారుదీనిని సాధించేందుకకు మోదీ ప్రభుత్వం బడ్జెట్‌ను 40 మిలియన్ డాలర్ల నుంచి 230 మిలియన్ డాలర్లకు తీసుకెళ్లిందని..  అంటే ఆరు రెట్లు పెంచిందని తెలిపారు.

సాగరమాల కింద మార్చి 2025 నాటికి పూర్తి చేసేందుకు 70 బిలియన్ డాలర్ల విలువైన 839 ప్రాజెక్టులను గుర్తించినట్లు తెలిపిన కేంద్ర హోం మంత్రి.. వీటిలో 17 బిలియన్ డాలర్ల విలువైన 272 ప్రాజెక్టుల నిర్మాణం ఇప్పటికే పూర్తైందన్నారు. 5 బిలియన్ డాలర్ల గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగుతోందని.. ఇది సముద్రాల ద్వారా జరిగే ప్రపంచ వాణిజ్యంలో భారతదేశ వాటాను గణనీయంగా పెంచుతుందని ధీమా వ్యక్తం చేశారు. 200 మిలియన్ డాలర్ల వ్యయంతో కొచ్చిన్ ఓడరేవులో దేశంలోనే అతిపెద్ద డాక్‌ను నిర్మించే విషయంలో ముందుకు సాగుతున్నట్లు తెలిపారుగుజరాత్‌లో మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారుఅంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా భారత చట్టాలను కూడా సవరించినట్లు తెలిపారు. 2025లో పార్లమెంటు 117 సంవత్సరాల నాటి ఇండియన్ పోర్ట్స్ బిల్లును ఆమోదించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసిన ఆయన.. ఇది సమకాలీన అవసరాలుప్రపంచ ధృకథాలకు అనుగుమంగా ఉందన్నారుప్రధాన ఓడరేవుల చట్టం- 2021 (మేజర్ పోర్ట్ అథారిటీస్ చట్టంద్వారా ఓడరేవులకు మరింత ఎక్కువ స్వయంప్రతిపత్తిని అందించేందుకువాటి సంస్థాగత వ్యవస్థను ఆధునికీకరించేందుకు మార్గాన్ని సుగమం చేసినట్లు పేర్కొన్నారుజాతీయ జలమార్గాల చట్టం- 2016 కింద 106 కొత్త జలమార్గాలను ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

దేశ భద్రతతీరప్రాంతమత్స్యకారుల భద్రతను పెంపొందించేందుకు మోదీ ప్రభుత్వం నీలి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసిందని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా పేర్కొన్నారుగత దశాబ్దంలో ఓడరేవుల ద్వారా సరకు రవాణా 118 శాతంకార్గో నిర్వహణ 150 శాతం పెరిగిందని తెలిపారు. ‘టీఏటీ’ని (టర్న్-అరౌండ్-టైమ్తగ్గించామన్న ఆయన.. దీనిని ప్రపంచ ప్రమాణాల స్థాయికి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారుసముద్ర రంగంలో చక్రీయ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకునౌకా నిర్మాణాన్ని మరింత వృద్ధి చేసేందుకు విధాన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపిన ఆయన.. ప్రాకృతిక సమతుల్యతను కాపాడుకుంటూ అభివృద్ధిని వేగవంతం చేసే విధంగా సముద్రాల విషయంలో హరిత భవిష్యత్‌ను నిర్మించటమే భారత్ లక్ష్యమని అన్నారుచిన్న ద్వీప దేశాలుగ్లోబల్ సౌత్‌లోని అనేక దేశాలు జీవనోపాధిమనుగడ కోసం సముద్రాలపై ఆధారపడి ఉన్నాయన్న విషయాన్ని దేశం మర్చిపోదన్న ఆయన.. ఆయా దేశాలకు వాతావరణ మార్పు అనేది అస్తిత్వ సమస్య అని అన్నారుదీనిని దృష్టిలో ఉంచుకొని భారత్.. హరితసుసంపన్నమైనసహకార సముద్ర రంగాన్ని సృష్టించే దార్శనికతతో ముందుకెళ్తోందని తెలిపారు

 

***


(Release ID: 2183142) Visitor Counter : 7