ప్రధాన మంత్రి కార్యాలయం
నహాయ్-ఖాయ్ ఆచారంతో ప్రారంభమవుతున్న శుభకరమైన చఠ్ మహాపర్వ్ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
25 OCT 2025 9:06AM by PIB Hyderabad
‘‘పవిత్రమైన నహాయ్-ఖాయ్ అనే సంప్రదాయ ఆచారంతో నేడు ప్రారంభమవతుతున్న నాలుగు రోజుల చఠ్ మహాపర్వ్ సందర్భంగా దేశమంతటా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ నాలుగు రోజుల పండుగకు ఉన్న విశిష్ట సాంస్కృతిక ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ.. అన్ని వ్రతుల అచంచలమైన భక్తికి ప్రధానమంత్రి నివాళులు అర్పించారు.
చఠ్ పండుగకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న గుర్తింపును గుర్తుచేస్తూ.. విదేశాల్లో నివసించే భారతీయ కుటుంబాలు కూడా ఈ పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరిస్తున్నారని ప్రధాని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చఠీ మయ్యాకు అంకితమైన ఒక భక్తిగీతాన్ని ప్రధానమంత్రి పంచుకున్నారు. అందరూ ఆ గీతంలో ఉన్న ఆధ్యాత్మిక అనుభూతిలో మునిగిపోవాలని ఆయన ఆహ్వానించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్టులో మోదీ ఇలా పేర్కొన్నారు.
“పవిత్రమైన నహాయ్-ఖాయ్ అనే ఆచారంతో నేడు నాలుగు రోజుల చఠ్ మహాపర్వం ప్రారంభమవుతోంది. బిహార్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అన్ని వ్రతదారులకు నా నమస్కారం, వందనం!”
“మన సంస్కృతిలోని ఈ మహత్తర ఉత్సవం నిరాడంబరతకి, సంయమనానికి ప్రతీక. ఈ పర్వదినం పవిత్రత, నియమనిష్ఠలతో కూడినది. ఈ పవిత్ర సందర్భంలో ఛఠ్ ఘాట్ల వద్ద కనిపించే దృశ్యాలు కుటుంబ, సామాజిక సౌభ్రాతృత్వానికి అద్భుతమైన ప్రేరణనిస్తాయి. ఛఠ్ పండుగ ప్రాచీన సంప్రదాయాలు మన సమాజంపై ఎంతో లోతైన ప్రభావాన్ని చూపుతాయి’’
“నేడు ప్రపంచం నలుమూలలలో చఠ్ పర్వాన్ని భారతీయ సాంస్కృతికి ప్రతీకగా, మహోత్సవంగా జరుపుకుంటున్నారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ కుటుంబాలు ఈ పండుగ ఆచారాలలో ఎంతో ఆత్మీయతతో భాగస్వాములు అవుతున్నారు. చఠీ మయ్యా అందరికీ తన ఆశీస్సులు ప్రసాదించాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’’
“చఠ్ మహాపర్వ్ అనేది భక్తి, ఆరాధన, ప్రకృతి ప్రేమతో కూడిన ఒక విశిష్ట సమ్మేళనం. ఇందులో అస్తమించే సూర్యునికీ, ఉదయించే సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తారు. ప్రసాదంలో కూడా ప్రకృతిలోని రంగులు ప్రతిబింబిస్తాయి. చఠ్ పూజలో వినిపించే గీతాల్లో, స్వరాల్లో భక్తి, ప్రకృతి ప్రేమ స్పష్టంగా కనిపిస్తాయి.’’
‘‘ నిన్ననే బెగూసరాయ్ వెళ్లే అవకాశం లభించడం నాకు కలిగిన గొప్ప అదృష్టం. బిహార్ కోకిల శారదా సిన్హా గారికి బెగూసరాయ్‌తో ఆత్మీయ సంబంధం ఉంది. శారదా సిన్హా గారితోపాటు బిహార్‌కు చెందిన అనేక ప్రజా కళాకారులు తమ గీతాల ద్వారా చఠ్ పండుగకు ప్రత్యేకమైన భావాన్ని అందించారు.”
“ఈ మహాపర్వదిన సందర్భంగా నేను నేడు మీ అందరితో చఠీ మయ్యాకు అంకితమైన కొన్ని భక్తిగీతాలను పంచుకుంటున్నాను. వాటిని విన్న ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులవుతారు.”
https://m.youtube.com/watch?v=6e6Hp6R5SVU”
***
(Release ID: 2182559)
Visitor Counter : 6
Read this release in:
Odia
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Gujarati
,
Tamil
,
Kannada