కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
మాజీ సైనికుల ఆరోగ్య పథకం లబ్ధిదారుల కోసం మందుల పంపిణీ సేవలను ప్రారంభించిన భారత తపాలాశాఖ
Posted On:
17 OCT 2025 1:54PM by PIB Hyderabad
మాజీ సైనికుల ఆరోగ్య పథకం (ఈసీహెచ్ఎస్) లబ్ధిదారుల కోసం ప్రత్యేకమైన మందుల పంపిణీ సేవను మాజీ సైనికుల సంక్షేమ శాఖ సహకారంతో భారత తపాలా శాఖ ప్రారంభించింది. ఈ సేవ ద్వారా ఈసీహెచ్ ఎస్ పాలీక్లినిక్లలో అందుబాటులో లేని ముందులను లబ్ధిదారుల ఇంటికే నేరుగా పంపిస్తారు.
ఈ కార్యక్రమం ద్వారా మందులను ఈసీహెచ్ఎస్ పాలీక్లినిక్స్ వద్ద ఉన్నసాధారణ సేవా కేంద్రం ద్వారా గ్రామ స్థాయి వ్యాపారులు సేకరించి ప్యాకింగ్ చేస్తారు. తపాలాశాఖ విశ్వసనీయ డెలివరీ వ్యవస్థ ద్వారా మందులను దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తారు. ఈ విధానం ద్వారా ఔషధాలు సురక్షితంగా, సమయానికి, దేశం నలుమూలలలో ఉన్న లబ్ధిదారులకు చేరుతాయి.
ఈ సేవను తొలిసారిగా 2025 జూలై 31న ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. అక్కడ విశేష స్పందన
లభించడంతో ఈ సేవను తరువాత జాతీయ రాజధాని ప్రాంతానికి (హర్యానా, ఉత్తరప్రదేశ్) విస్తరించారు. ప్రయోగాత్మక ప్రాజెక్టులో1700 మందుల ప్యాకెట్లను పంపిణీ చేసి పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమవ్వడంతో.. దేశవ్యాప్తంగా 458 ఈసీహెచ్ఎస్ కేంద్రాల మ్యాపింగ్ పూర్తయింది. 2025 అక్టోబర్ 17 నుంచి ఈ సేవను దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.
ఈ కార్యక్రమం ద్వారా భారత తపాలా శాఖ తన విస్తృత పోస్టల్ వ్యవస్థను ప్రజాసేవ కోసం వినియోగించడంలో నిబద్ధతను మరోసారి చాటుకుంది. ఈ సేవ ఈసీహెచ్ఎస్ లబ్ధిదారులకు సకాలంలో, నమ్మకంతో మందులు అందేలా చేస్తూ.. మాజీ సైనికుల సంక్షేమానికి కీలక పాత్ర పోషిస్తోంది. ఇది దేశ నిర్మాణం, పౌర సంక్షేమంలో భాగంగా తపాలాశాఖ విశ్వసనీయతను మరింత బలపరుస్తుంది.
***
(Release ID: 2180401)
Visitor Counter : 7