హోం మంత్రిత్వ శాఖ
గత రెండు రోజుల్లో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో 258 మంది నక్సలైట్లు లొంగిపోయినట్లు ప్రకటించిన కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా
ఈ రోజు ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన నక్సలైట్లు 170 మంది
నిన్న ఛత్తీస్‌గఢ్‌లో 27 మంది.. మహారాష్ట్రలో 61 మంది నక్సలైట్లు లొంగిపోయారు
ఈ ముప్పు అంతం లక్ష్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని
ప్రభుత్వ అవిశ్రాంత కృషితో చరమాంకానికి చేరిన నక్సలిజం
లొంగిపోయిన వారిలో రూ. 1 కోటి రివార్డు గల సతీష్ అలియాస్ టీ. వాసుదేవ్ రావు (సీసీఎమ్) సహా
10 మంది సీనియర్ నక్సల్స్
ఏకే-47, ఐఎన్ఎస్ఏఎస్, ఎస్ఎల్ఆర్‌లు, 303 రైఫిల్స్ సహా
భారీ ఎత్తున ఆటోమెటిక్ ఆయుధాలను అప్పగించిన నక్సలైట్లు
నక్సలిజంపై మన పోరాటంలో ఇది గొప్ప రోజు
భారత రాజ్యాంగంపై నమ్మకంతో హింసను త్యజించిన వారి నిర్ణయం అభినందనీయం
లొంగిపోయే వారికి స్వాగతం.. తుపాకీ వదలని వారి అంతం చేయడం మా ప్రభుత్వ విస్పష్ట విధానం
నక్సలిజం మార్గంలో ఇంకా కొనసాగుతున్న వారు తమ ఆయుధాలను విడిచి జనజీవన స్రవంతిలో చేరాలని విజ్ఞప్తి చేస్తున్నా
ఒకప్పుడు ఉగ్రవాద స్థావరాలుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మఢ్, నార్త్ బస్తర్‌లను నేడు నక్సల్ విముక్త ప్రాంతాలుగా ప్రకటించడం చాలా సంతోషకరం
ఛత్తీస్‌గఢ్‌లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 జనవరి నుంచి 2100 మంది నక్సలైట్లు లొంగిపోయారు...
1785 మంది అరెస్టయ్యారు... 477 మంది హతమయ్యారు
2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని తుడిచిపెట్టాలనే మన ప్రభుత్వ దృఢ సంకల్పానికి ఈ గణాంకాలే నిదర్శనం
Posted On:
16 OCT 2025 6:04PM by PIB Hyderabad
గత రెండు రోజుల్లో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో 258 మంది నక్సలైట్లు లొంగిపోయినట్లు కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా ప్రకటించారు. ఇది నక్సలిజంపై మన పోరాటంలో ఒక గొప్ప రోజుగా ఆయన అభివర్ణించారు. ఛత్తీస్‌గఢ్‌లో ఈరోజు 170 మంది నక్సలైట్లు లొంగిపోగా.. నిన్న ఈ రాష్ట్రంలో 27 మంది, మహారాష్ట్రలో 61 మంది నక్సల్స్ లొంగిపోయినట్లు ఆయన తెలిపారు.
భారత రాజ్యాంగంపై నమ్మకంతో హింసను త్యజించిన వారి నిర్ణయాన్ని హోంమంత్రి ప్రశంసించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ముప్పును అంతం చేయడానికి చేస్తున్న అవిశ్రాంత ప్రయత్నాల కారణంగానే నక్సలిజం చరమాంకానికి చేరిందనడానికి ఇదే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
"నక్సలిజంపై మన పోరాటంలో ఇది ఒక గొప్ప రోజు. ఈ రోజు ఛత్తీస్‌గఢ్‌లో 170 మంది నక్సలైట్లు లొంగిపోయారు. నిన్న ఈ రాష్ట్రంలో 27 మంది తమ ఆయుధాలను విడిచిపెట్టారు. మహారాష్ట్రలో నిన్న 61 మంది జనజీవన స్రవంతికి తిరిగి వచ్చారు. మొత్తంగా గత రెండు రోజుల్లో 258 మంది వామపక్ష తీవ్రవాదులు హింసను త్యజించారు. భారత రాజ్యాంగంపై నమ్మకం ఉంచి హింసను త్యజించిన వారి నిర్ణయాన్ని నేను అభినందిస్తున్నాను. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ముప్పును అంతం చేయడానికి చేస్తున్న అవిశ్రాంత ప్రయత్నాల కారణంగానే నక్సలిజం చరమాంకానికి చేరిందని ఇది రుజువు చేస్తుంది. లొంగిపోవాలనుకునే వారికి స్వాగతం.. తుపాకీని వదలని వారి అంతంతో మోదీ ప్రభుత్వం విస్పష్ట విధానాన్ని అనుసరిస్తోంది. ఇప్పటికీ నక్సలిజం మార్గంలో ఉన్నవారు తమ ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో చేరాలని నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. 2026 మార్చి 31 లోపు నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి మేం కట్టుబడి ఉన్నాం." అని ‘ఎక్స్’ వేదికగా చేసిన ఒక పోస్టులో హోంమంత్రి శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.
"ఒకప్పుడు ఉగ్రవాద స్థావరాలుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మఢ్, నార్త్ బస్తర్‌లను నేడు నక్సల్ విముక్త ప్రాంతాలుగా ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 జనవరి నుంచి 2100 మంది నక్సలైట్లు లొంగిపోయారు. 1785 మంది అరెస్టయ్యారు. 477 మంది హతమయ్యారు. 2026 మార్చి 31కి ముందే నక్సలిజాన్ని అంతం చేయాలనే మా ప్రభుత్వ దృఢ సంకల్పానికి ఈ సంఖ్యలు అద్దం పడుతున్నాయి" అని శ్రీ అమిత్ షా ‘ఎక్స్’ వేదికగా చేసిన మరో పోస్టులో పేర్కొన్నారు.
లొంగిపోయిన నక్సలైట్ల జాబితాలో సతీష్ అలియాస్ టీ వాసుదేవ్ రావు (సీసీఎమ్), రనిత (ఎస్జెడ్సీఎమ్, మాడ్ డీవీసీ కార్యదర్శి), భాస్కర్ (డీవీసీఎమ్, పీఎల్ 32), నీలా అలియాస్ నందే (డీవీసీఎమ్, ఐసీ-నెల్నార్ ఏసీ కార్యదర్శి), దీపక్ పాలో (డీవీసీఎమ్, ఐసీ-ఇంద్రావతి ఏసీ కార్యదర్శి) సహా 10 మంది సీనియర్ నక్సల్స్ ఉన్నారు. టి వాసుదేవ్ రావు (సీసీఎమ్)పై రూ. 1 కోటి రివార్డు ప్రకటించారు. ఎస్జెడ్సీఎమ్ ర్యాంక్ ఉన్న నక్సల్స్‌పై రూ. 25 లక్షలు, డీవీసీఎమ్లపై రూ. 10 నుంచి రూ. 15 లక్షలు, ఏసీఎమ్లపై రూ. 5 లక్షల విలువైన రివార్డులు ఉన్నాయి. ఏకే-47లు, ఐఎన్ఎస్ఏఎస్, ఎస్ఎల్ఆర్‌లు, 303 రైఫిల్స్ సహా భారీ సంఖ్యలో ఆటోమేటిక్ ఆయుధాలను వారు అప్పగించారు.
***
(Release ID: 2180109)
Visitor Counter : 16