ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ రవి నాయక్ మృతికి సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
15 OCT 2025 8:58AM by PIB Hyderabad
గోవా ప్రభుత్వంలో మంత్రి శ్రీ రవి నాయక్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.
అనుభవజ్ఞుడైన పరిపాలకునిగాను, సమర్పణ భావం కలిగిన ఒక ప్రజాసేవకునిగాను శ్రీ నాయక్‌ను గుర్తుపెట్టుకుంటామనీ, గోవా అభివృద్ధికి ఆయన విశిష్ట సేవలను అందించారనీ శ్రీ మోదీ అన్నారు. మరీ ముఖ్యంగా, సమాజంలో ఆదరణకు నోచుకోకుండా మిగిలిపోయిన వర్గాల వారితో పాటు అణగారిన వర్గాల వారికి కూడా సాధికారతను కల్పించాలని శ్రీ నాయక్ తపించారని ప్రధానమంత్రి అన్నారు.
‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘గోవా ప్రభుత్వంలో మంత్రి శ్రీ రవి నాయక్ మరణవార్త తెలిసి, నేను బాధపడ్డాను. అనుభవజ్ఞుడైన పరిపాలకునిగా, సమర్పణ భావం కలిగిన ఒక ప్రజాసేవకునిగా ఆయనను మనం గుర్తుపెట్టుకుంటాం.. గోవా అభివృద్ధికి ఆయన విశిష్ట సేవలను అందించారు. మరీ ముఖ్యంగా, సమాజంలో ఆదరణకు నోచుకోకుండా మిగిలిపోయిన వర్గాల వారితో పాటు అణగారిన వర్గాల వారికి కూడా సాధికారతను కల్పించాలని ఆయన తపించారు. ఆయన కుటుంబానికీ, ఆయన మద్దతుదారులకూ ఈ దు:ఖ ఘడియలో నేను నా సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి.’’
***
(रिलीज़ आईडी: 2179250)
आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam