మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
దేశంలో మొదటిసారి అతిపెద్ద పాఠశాల స్థాయి ఆవిష్కరణల ప్రత్యక్ష పోటీ 3 లక్షలకు పైగా పాఠశాలలు పాల్గొన్న చరిత్రాత్మక ఘట్టం
పాఠశాల స్థాయి ఆవిష్కరణల పోటీ 'వికసిత్ భారత్ బిల్డథాన్ 2025'ను
ప్రారంభించిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
వికసిత, సమృద్ధ భారత్ సాధన మన ప్రతిభావంతులైన
పాఠశాల విద్యార్థుల భుజస్కంధాలపైనే ఉంది: శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
प्रविष्टि तिथि:
13 OCT 2025 5:07PM by PIB Hyderabad
వికసిత్ భారత్ బిల్డథాన్ (వీబీబీ) 2025ను కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా మూడు లక్షలకు పైగా పాఠశాలలు ఒకేసారి పాల్గొన్న ఈ “వికసిత్ భారత్ బిల్డథాన్ 2025” పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించిన భారతదేశంలోని అతి పెద్ద సమన్వయ ఆవిష్కరణ హ్యాకథాన్‌గా నిలిచింది. ప్రారంభ కార్యక్రమం సందర్భంగా మంత్రి ఒడిశా లోని భువనేశ్వర్‌లో ఖోర్డా పీఎంశ్రీ ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులతో సంభాషించారు.
ఈ సందర్భంగా శ్రీ ప్రధాన్ మాట్లాడుతూ... ఈ భారీ పాఠశాల స్థాయి ఆవిష్కరణల కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉత్సాహంగా పాల్గొన్న మూడు లక్షలకుపైగా పాఠశాలలు, విద్యార్థులను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడి నుంచి పుట్టుకొచ్చే సృజనాత్మక ఆలోచనలు కొత్త ప్రపంచ నమూనాల సృష్టికి దారితీస్తాయని, దేశీయ, ప్రపంచవ్యాప్త ప్రధాన సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడంలో సహాయపడతాయని శ్రీ ప్రధాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. వికసిత, సమృద్ధ భారత్ సాధన మన ప్రతిభావంతులైన పాఠశాల విద్యార్థుల భుజస్కధాలపైనే ఉందని మంత్రి పేర్కొన్నారు. వికసిత్ భారత్ బిల్డథాన్ (వీబీబీ ) వంటి మార్పుదాయక ప్రయత్నాల ద్వారానే భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత సాకారం అవుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు నిర్మాణంలో విద్యార్థులు చురుకైన పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.
విద్యా మంత్రిత్వశాఖకు చెందిన పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా విద్యార్థుల భాగస్వామ్యాన్ని, కృషిని ప్రశంసించారు. ఈ విభిన్నమైన కార్యక్రమం విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను పెంపొందించి, వారి సృజనాత్మక దృక్పథాన్ని మరింత బలపరుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమానికి మార్గనిర్దేశం చేసి మద్దతు అందించిన కేంద్ర విద్యామంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
అటల్ ఇన్నోవేషన్ మిషన్ మిషన్ డైరెక్టర్ శ్రీ దీపక్ బగ్లా మాట్లాడుతూ, వికసిత్ భారత్ బిల్డథాన్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ బిల్డథాన్ ఆవిష్కరణల ప్రక్రియను సామూహిక ఉద్యమంగా మార్చి, మారుమూల గ్రామాల్లోని పాఠశాలలను మహానగరాల్లోని పాఠశాలలతో అనుసంధానిస్తుందని తెలిపారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులతో సంభాషించేందుకు ఢిల్లీ మాతురా రోడ్‌లోని డెల్హీ పబ్లిక్ స్కూల్, ఢిల్లీ కంటోన్మెంట్ లోని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ నెం. 2 ను కూడా శ్రీ ప్రధాన్ సందర్శించారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సృజనాత్మక ప్రాజెక్టులను శ్రీ ప్రధాన్ పరిశీలించి, వారి అభ్యసన ప్రక్రియల గురించి తెలుసుకున్నారు. వారి సృజనాత్మకతను, ఉత్సాహాన్ని ప్రశంసిస్తూ, నిరంతరం జిజ్ఞాసువులుగా ఉండాలని ఉద్బోధించారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యసాధనకు దోహదపడగల వారి అసాధారణ సృజనాత్మకతను అభినందించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం 120 నిమిషాల ఆవిష్కరణల ప్రత్యక్ష పోటీ జరిగింది. రెండు గంటల పాటు జరిగిన ఈ లైవ్ టింకరింగ్ సెషన్‌లో కోటి మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు, ఇందులో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు 3–5 మంది చొప్పున జట్లుగా ఏర్పడి ఆత్మనిర్భర్ భారత్, స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్, సమృద్ధి అనే నాలుగు ఇతివృత్తాలపై ప్రోటోటైప్‌లను రూపొందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ స్పాట్‌లైట్స్ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది, దీనిలో మారుమూల ప్రాంతాలు, ఆకాంక్ష జిల్లాలు, కొండ రాష్ట్రాలు, సరిహద్దు ప్రాంతాల నుంచి 150కి పైగా పాఠశాలలు నేరుగా అనుసంధానమై తమ పురోగతిని, అనుభవాలను పంచుకున్నాయి.
రిజిష్టర్ చేసుకున్న పాఠశాలలు ( రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలవారీగా)
***
(रिलीज़ आईडी: 2178755)
आगंतुक पटल : 21