ఆయుష్
azadi ka amrit mahotsav

ద్రవ్య పోర్టల్ మొదటి ఫేజ్ లో 100 ఆయుష్ ఔషధాల జాబితా


ద్రవ్య పోర్టల్ కేవలం డిజిటల్ పత్రాల కేంద్రమే కాదు... భారత విజ్ఞాన సంప్రదాయానికి ప్రతిరూపం:

కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్

ఆయుష్ ఔషధాలపై పురాతన, ఆధునిక పరిశోధనలను డిజిటైజ్ చేసి ఏకం చేయటానికి, విభిన్న రంగాల ఆవిష్కరణలను ప్రోత్సహించటానికి ఏఐ పోర్టల్ ను రూపొందించిన సీసీఆర్ఏఎస్

प्रविष्टि तिथि: 09 OCT 2025 11:49AM by PIB Hyderabad

ద్రవ్య పోర్టల్ మొదటి దశలో 100 కీలక ఔషధాల జాబితాను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుందిఈ జాబితాకు సంబంధించిన కచ్చితత్వాన్నిప్రామాణికతను నిర్ధారించేందుకు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ద్వారా నిరంతరం డేటాను నవీకరిస్తారు.

 

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డిజిటైజ్డ్ రిట్రీవల్ అప్లికేషన్ ఫర్ వర్సటైల్ యార్డ్ స్టిక్ ఆఫ్ ఆయుష్ (ద్రవ్యకార్యక్రమంఒక వినూత్న ఆన్ లైన్ విజ్ఞాన నిధి.

 

ద్రవ్య పోర్టల్ ఏఐతో మాత్రమే కాకఆయుష్ గ్రిడ్ఔషధ పదార్థాలుఔషధ విధానానికి సంబంధించి ఇతర కార్యక్రమాలతోనూ అనుసంధానం అవుతుందిక్యూఆర్ కోడ్ అనుసంధానంతో దేశవ్యాప్తంగా ఉన్న ఔషధ మొక్కల ఉద్యానవనాలుఔషధ నిల్వ కేంద్రాల్లో ప్రామాణిక సమాచారాన్ని తెలుసుకునే వీలుంటుంది.

 

సంప్రదాయ వైద్యంలో ఆధారాలతో అనుసంధానండిజిటల్ పరివర్తనకు తొలి అంచెగా... గోవాలో జరిగిన 10వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 23న కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ పోర్టల్‌ను ఆవిష్కరించిందిఈ కార్యక్రమంలో గోవా గవర్నర్ శ్రీ అశోక్ గజపతి రాజుగోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్కేంద్ర ఆయుష్ సహాయ మంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్కేంద్ర విద్యుత్నూతన అండ్ పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద ఎస్సో నాయక్ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా పాల్గొన్నారుప్రపంచవ్యాప్తంగా ఆయుష్ ఔషధాలకు సంబంధించి ప్రామాణికమైనపరిశోధనాధారిత సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి సాంకేతికతను ఉపయోగించుకోవాలనే మంత్రిత్వ శాఖ ప్రాధాన్యతను ఈ కార్యక్రమం తెలియజేస్తుంది.

 

సమగ్రమైనఅందరికీ అందుబాటులో ఉండే సమాచార కేంద్రం ద్రవ్య పోర్టల్ఇది శాస్త్రీయ ఆయుర్వేద కేంద్రాలుప్రామాణిక ఆన్ లైన్ పరిశోధనా వేదికల నుంచి డేటాని తీసుకుని ఎప్పటికప్పుడు నవీకరిస్తుందిస్పష్టమైన వినియోగదారు ఇంటర్‌ఫేస్‌తో రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా ఆయుష్ వ్యవస్థల్లో ఉపయోగించే ఔషధాల కోసం అన్వేషించేందుకుఆయుర్వేద ఫార్మకోథెరపోటిక్స్వృక్షశాస్త్రంరసాయన శాస్త్రంఫార్మసీఫార్మకాలజీభద్రతా సమాచారానికి సంబంధించిన వివరణాత్మక ప్రొఫైళ్లను పొందవచ్చు.

 

"ద్రవ్య పోర్టల్ కేవలం డిజిటల్ పత్రాల కేంద్రమే కాదుభారత విజ్ఞాన సంప్రదాయానికి ప్రతిరూపంసంప్రదాయ జ్ఞానాన్ని అత్యాధునిక సాంకేతికతో అనుసంధానించటమే కాకప్రపంచ సహకారంఆవిష్కరణకు.. ఆయుర్వేదంఇతర ఆయుష్ వ్యవస్థలను బలోపేతం చేస్తున్నాంఅని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్ అన్నారు.

 

ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేశ్ కొటేచా మాట్లాడుతూ.. "ఆయుష్ జ్ఞానాన్ని శాస్త్రీయంగాప్రపంచమంతటా అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేది ద్రవ్యఈ వేదిక పాత ఆయుర్వేద గ్రంథాల్లోని సమాచారాన్ని కొత్త పరిశోధనలతో కలిపి నేటి తరానికి తెలియజేస్తుందిశాస్త్రవేత్తలకే కాకప్రపంచవ్యాప్తంగా ఉన్న విధానకర్తలునూతన ఆవిష్కరణలు చేసేవారికి నమ్మదగినసాంకేతికతో కూడిన గొప్ప వనరుగా ఇది ఉపయోగపడుతుంది” అని అన్నారు.

 

"పరిశోధకులువైద్యులువిద్యార్థులకు ఈ వేదిక కీలకమవుతుందివిభిన్న విభాగాల పరిశోధనలను ఇది సులభతరం చేస్తుందిఔషధ ప్రమాణాల ఏకీకరణఆయుష్ ఔషధ ఆధారాల ధ్రువీకరణను మెరుగుపరుస్తుంది” అని సీసీఆర్ఏఎస్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ రబినారాయణ్ ఆచార్య తెలిపారు.

 

సులువుగా మార్పులు చేసుకోగలిగే డిజైన్ఎప్పటికప్పుడు కొత్త సమాచారాన్ని తీసుకునే సామర్థ్యం ద్రవ్యకు ఉందిపాత వైద్య విధానాలను ఆధునిక సైన్స్ పరిజ్ఞానంతో కలిపేందుకు వేసిన గొప్ప ముందడుగు ఇదిదీని ద్వారా సరైన ఆయుష్ సమాచారం అందరికీ సులువుగా అందుబాటులో ఉండటమే కాకఅన్వేషించుకునేలాప్రపంచంలో అందరికీ ఉపయోగపడేలా ఉంటుంది.

 

***


(रिलीज़ आईडी: 2176848) आगंतुक पटल : 39
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Punjabi , Urdu , हिन्दी , English , Gujarati , Malayalam , Marathi , Tamil