ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వ్యాపార సౌలభ్యంలో భాగంగా… ఆటోమేటిక్ ఐఎఫ్ఎస్ సీ కోడ్ రిజిస్ట్రేషన్ ను ప్రవేశపెట్టిన సీబీఐసీ

Posted On: 07 OCT 2025 4:11PM by PIB Hyderabad

 కస్టమ్స్ విధానాలను సరళీకృతం చేయటానికివాణిజ్య సౌలభ్యాన్ని పెంపొందించటానికి.. మానవ ప్రమేయం లేకుండా ఐఎఫ్ ఎస్ సీ కోడ్ ను ఆటోమేటిక్ గా ఆమోదించే ప్రక్రియను కేంద్ర పరోక్ష పన్నులుకస్టమ్స్ బోర్డు (సీబీఐసీప్రవేశపెట్టిందిదీనిద్వారా సులభతర వ్యాపార సౌలభ్యానికి ఐఎఫ్ఎస్ సీ కోడ్ ను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

ఈ కొత్త కార్యక్రమం ద్వారా ఒకే దిగుమతిఎగుమతి కోడ్ (ఐఈసీకోసం ఒకే ఇన్సెంటివ్ బ్యాంకు ఖాతాఐఎఫ్ఎస్ సీ ఇప్పటికే ఏదైన ఒక కస్టమ్స్ కేంద్రంలో ఆమోదం పొంది ఉంటేవాటిని ఇతర కస్టమ్స్ కేంద్రాల్లోనూ నమోదు చేయాల్సిందిగా కోరితేవెంటనే ఆమోదం లభిస్తుందిపోర్టు అధికారి ప్రమేయం లేకుండాకస్టమ్స్ అధికారిక వ్యవస్థ ఆయా అభ్యర్థనలకు నేరుగా అంటే ఆటోమేటిక్ గా ఆమోదం తెలుపుతుంది.

ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం:

i. బ్యాంకు ఖాతాఐఎఫ్ఎస్ సీ కోడ్ అభ్యర్థనలను వేగంగా పరిశీలించటం.

ii. వివిధ పోర్టుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయటం.

iii. ఎగుమతి ప్రోత్సాహకాలను ఎగుమతిదారుల బ్యాంకు ఖాతాల్లో వీలైనంత త్వరగాఎలాంటి అంతరాయాలు లేకుండా జమ చేయటం.

iv. మొత్తంగా వాణిజ్య సామర్థ్యాన్ని పెంచటం.

కస్టమ్స్ ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా ఎగుమతిదారు ఇచ్చిన బ్యాంక్ ఖాతాకు ఎగుమతికి సంబంధించిన ప్రయోజనాలు అందుతాయిఐసీఈగేట్ లో ఎగుమతిదారుఆథరైజ్డ్ డీలర్ (ఏడీకోడ్ ను ఆన్ లైన్ లో నమోదు చేసుకునే సౌకర్యం ఇప్పటికే ఉందిదిగుమతిఎగుమతి కోడ్ (ఐఈసీద్వారా ఇన్సెంటివ్ లింక్డ్ బ్యాంకు ఖాతాలుఐఎఫ్ఎస్ సీ కోడ్ ల నమోదు అభ్యర్థనలకు ప్రతి పోర్టు లోకేషన్ లో కస్టమ్స్ అధికారులతో ఆమోదం పొందాల్సిన అవసరం ఉండేదిదీనివల్ల ఒకే బ్యాంకు ఖాతాఐఎఫ్ఎస్ సీని వివిధ కస్టమ్స్ కేంద్రాల్లో నమోదు చేసినప్పుడు ఒకే పని పునరావృతం కావటంఅభ్యర్థనలు పెండింగ్ లో ఉండటం వంటివి జరిగేవి.

సాంకేతకత వినియోగంతో విధానాలను సరళీకృతం చేయటానికిలావాదేవీల ఖర్చులను తగ్గించేందుకుమెరుగైన కస్టమ్స్ అనుభవాలతో భారత వాణిజ్య సమాజంలో సులభతర వ్యాపార మార్గాలను పెంచటానికి సీబీఐసీ కట్టుబడి ఉంది.

 

*** 


(Release ID: 2176297) Visitor Counter : 4