ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ... 73వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు


· భారత్ - రష్యా మధ్య ప్రత్యేక, విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటన

· రష్యా అధ్యక్షుడిని భారత్‌కు ఆహ్వానించిన భారత ప్రధాని

प्रविष्टि तिथि: 07 OCT 2025 6:47PM by PIB Hyderabad

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు గౌరవనీయులు వ్లాదిమిర్ పుతిన్‌తో ఈ రోజు టెలిఫోన్‌లో సంభాషించారు.

పుతిన్ 73వ పుట్టినరోజు సందర్భంగా శ్రీ మోదీ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలని, ఆయన ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ద్వైపాక్షిక ఎజెండాలో పురోగతిపై వారిద్దరూ సమీక్షించారు. భారత్ - రష్యా మధ్య ప్రత్యేక, విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు.

భారత్-రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం భారత్ రావాల్సిందిగా గౌరవ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను శ్రీ మోదీ ఆహ్వానించారు.


(रिलीज़ आईडी: 2176083) आगंतुक पटल : 22
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam