సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మహారాష్ట్రలోని అహల్యానగర్ లో సామర్థ్య విస్తరణతో పునరుద్ధరించిన డాక్టర్ విఠల్ రావు విఖే పాటిల్ సహకార చక్కెర కర్మాగారాన్ని ప్రారంభించిన కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా


పద్మశ్రీ డాక్టర్ విఠల్ రావు విఖే పాటిల్, పద్మభూషణ్ బాలాసాహెబ్ విఖే పాటిల్ విగ్రహాలను ఆవిష్కరించిన శ్రీ అమిత్ షా

ఔరంగాబాద్ పేరును శంభాజీనగర్‌గా, అహ్మద్‌నగర్ పేరును అహల్యానగర్‌గా మార్చే ధైర్యం ఛత్రపతి శివాజీ మహారాజ్ అనుచరులకు మాత్రమే ఉంటుంది - ఔరంగజేబు అనుచరులకు అలాంటి ధైర్యం ఉండదు.

సహకార చక్కెర మిల్లులను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా రైతుల సంక్షేమానికి భరోసా ఇచ్చిన మోదీ ప్రభుత్వం

పద్మశ్రీ పాటిల్ ఏర్పాటు చేసిన మొదటి సహకార చక్కెర కర్మాగారంతో మహారాష్ట్రలోనే కాకుండా అనేక ఇతర రాష్ట్రాలలో కూడా రైతులకు మేలు

చక్కెర మిల్లుల లాభాలు దళారీలకు కాకుండా నేరుగా రైతులకే చేర్చడంలో మార్గదర్శకుడుగా నిలచిన పద్మశ్రీ డాక్టర్ విఠల్‌రావు విఖే పాటిల్

సహకార ఉద్యమాన్ని శక్తిమంతం చేసి విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి కోసం సహకార రంగం లాభాలను వినియోగించుకునే సంప్రదాయానికి నాంది పలికిన డాక్టర్ బాలాసాహెబ్ విఖే పాటిల్

సహకార చక్కెర కర్మాగారాలు క్రషింగ్ లేని సీజన్‌లో మల్టీ-ఫీడ్ ఇథనాల్, శీతల పద్దతుల్లో కూరగాయల నిల్వ, పండ్ల గుజ్జు తయారీ మొదలైన బహుళ కార్యకలాపాలతో విస్తరించాలి.

2025–26 ఆర్థిక సంవ

Posted On: 05 OCT 2025 6:36PM by PIB Hyderabad

మహారాష్ట్రలోని అహల్యానగర్‌లో ప్రవర షుగర్ ఫ్యాక్టరీ విస్తరణ సదుపాయాన్ని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు ప్రారంభించారు. పద్మశ్రీ డాక్టర్ విఠల్‌రావు విఖే పాటిల్,  పద్మభూషణ్ బాలాసాహెబ్ విఖే పాటిల్ విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు శ్రీ ఏక్నాథ్ షిండే, శ్రీ అజిత్ పవార్, కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ మురళీధర్ మోహోల్  సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు శ్రీ అమిత్ షా షిర్డీ సాయిధామ్ ను సందర్శించి, సాయిబాబాకు ప్రార్థనలు చేశారు. దేశంలోని ప్రజలందరి సంతోషం, సౌభాగ్యం కోసం ప్రార్థించారు.

 

అహల్యానగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీ అమిత్ షా ప్రసంగిస్తూ, ఔరంగాబాద్ పేరును శంభాజీనగర్ గా, , అహ్మద్ నగర్ పేరును అహల్యానగర్ గా మార్చే ధైర్యం ఛత్రపతి శివాజీ మహారాజ్ అనుచరులకు మాత్రమే ఉందని, ఔరంగజేబు అనుచరులకు అలాంటి ధైర్యం లేదని అన్నారు. ఈసారి భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలో 60 లక్షల హెక్టార్లకు పైగా వ్యవసాయ భూములు, పంటలు ధ్వంసమయ్యాయని ఆయన అన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం వాటా కింద మహారాష్ట్రకు రూ. 3,132 కోట్లు కేటాయించామని, అందులో రూ.1,631 కోట్లను మోదీ ప్రభుత్వం ఏప్రిల్లోనే విడుదల చేసిందని ఆయన చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వంలోని శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, శ్రీ ఏక్నాథ్ షిండే, శ్రీ అజిత్ పవార్ ముగ్గురూ కూడా రైతులకు సహాయం చేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టారని శ్రీ షా చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 2,215 కోట్ల ఉపశమన ప్యాకేజీని ప్రకటించిందని, దీనివల్ల 31 లక్షలమంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.

నష్టపోయిన రైతులకు రూ.10,000 నగదు, 35 కిలోల ఆహార ధాన్యాలు అందించే పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని ఆయన తెలిపారు. అంతేకాక, స్వల్పకాలిక వ్యవసాయ రుణాల వసూలును నిలిపివేశారని, భూమి శిస్తు,  పాఠశాల పరీక్షలలో మినహాయింపులు మంజూరు చేశారని పేర్కొన్నారు.

 

మహారాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదికను పంపిన మరుక్షణం నుంచి ఆ రాష్ట్ర  రైతులకు సహాయం చేయడంలో ప్రధాని మోదీ నుంచి ఏ మాత్రం ఆలస్యం ఉండదని ప్రధాని తరపున కేంద్ర హోంమంత్రి హామీ ఇచ్చారు. రైతుల పట్ల నిజమైన శ్రద్ధ వహించే ప్రభుత్వాన్ని మహారాష్ట్ర ప్రజలు ఎన్నుకోవడంవల్లే ఇదంతా సాధ్యమైందని ఆయన ఉద్ఘాటించారు.

పద్మశ్రీ డాక్టర్ విఠల్ రావు విఖే పాటిల్,  పద్మభూషణ్ బాలాసాహెబ్ విఖే పాటిల్ నిలువెత్తు విగ్రహాలను ఆవిష్కరించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, పద్మశ్రీ విఖే పాటిల్ తన యావత్తు జీవితాన్ని ఈ ప్రాంతంలోని, మహారాష్ట్ర లోని రైతుల సంక్షేమానికే అంకితం చేశారని ఆయన అన్నారు. భారతదేశ సహకార ఉద్యమానికి మార్గదర్శకులలో డాక్టర్ విఠల్ రావ్ విఖే పాటిల్ ఒకరని ఆయన అన్నారు. మహారాష్ట్ర సహకార రంగ చరిత్రలో పద్మశ్రీ డాక్టర్ విఠల్ రావు విఖే పాటిల్, ధనంజయరావు గాడ్గిల్, వైకుంఠ్ భాయ్ మెహతా త్రయం రాష్ట్రంలో సహకార ఉద్యమానికి పునాది వేశారని పేర్కొన్నారు. 

 

పద్మశ్రీ విఖే పాటిల్ ప్రపంచంలోనే మొట్టమొదటి సహకార చక్కెర మిల్లును స్థాపించారని, ఈ చొరవ మహారాష్ట్రకే కాకుండా గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, అనేక ఇతర రాష్ట్రాల్లోని రైతుల సౌభాగ్యానికి దారితీసిందని శ్రీ షా అన్నారు.చక్కెర కర్మాగారాల లాభాలు వ్యాపారుల జేబుల్లోకి కాకుండా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లే వ్యవస్థకు పద్మశ్రీ డాక్టర్ విఠల్ రావు విఖే పాటిల్ మార్గదర్శకుడని ఆయన తెలిపారు.

పద్మశ్రీ డాక్టర్ విఠల్ రావు విఖే పాటిల్ కుమారుడు డాక్టర్ బాలాసాహెబ్ విఖే పాటిల్ సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడమే కాకుండా విద్య, ఆరోగ్యం, గ్రామీణ పురోగతి కోసం సహకార రంగ లాభాలను ఉపయోగించే కొత్త సంప్రదాయానికి మార్గదర్శిగా నిలిచారని కేంద్ర సహకార శాఖ మంత్రి అన్నారు. డాక్టర్ బాలా సాహెబ్ విఖే పాటిల్ ఎనిమిది దశాబ్దాల పైబడిన తన జీవితంలో ఏడు సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారని, అటల్ బిహారీ వాజ్ పేయీ ప్రభుత్వంలో కూడా పనిచేశారని ఆయన అన్నారు.

ఆయన సేవలకు కృతజ్ఞతగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాధవపురా మర్కంటైల్ కోఆపరేటివ్ బ్యాంకునకు పునరుద్ధరణ ప్యాకేజీని అందించిందని, ఇది గుజరాత్. లోని 225 సహకార బ్యాంకులను కాపాడటానికి సహాయపడిందని శ్రీ షా అన్నారు. ఈ ప్రముఖులిద్దరూ సహకారం, గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమం రంగాలకు ఎనలేని కృషి చేశారని ఆయన అన్నారు.

ఈ రోజు డాక్టర్ విఠల్ రావు విఖే పాటిల్ కోఆపరేటివ్ చక్కెర కర్మాగారాన్ని కూడా పునరుద్ధరించినట్లు శ్రీ అమిత్ షా తెలిపారు. 1950-51లో ఈ కర్మాగారాన్ని ఏర్పాటు చేసినప్పుడు దాని చెరకు క్రషింగ్ సామర్థ్యం రోజుకు 500 టన్నుల చెరకు కాగా, ఇప్పుడు రోజుకు 7200 టన్నులకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో, దాని సామర్థ్యం రోజుకు 7200 టన్నుల నుంచి  15000 టన్నులకు పెరుగుతుంది. ప్రధాని మోదీ సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినప్పుడు, సహకార చక్కెర మిల్లులను బలోపేతం చేయడానికి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) ఒక పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు. ఈ పథకం కింద, సమర్థంగా పనిచేసే యూనిట్లకు ఆర్థిక సహాయం అందించారు. వీటిలో డాక్టర్ విఠల్ రావు విఖే పాటిల్ కోఆపరేటివ్ షుగర్ మిల్లును ఇప్పుడు విస్తరిస్తున్నారు. 

ఈ చక్కెర కర్మాగారానికి చెందిన ఆల్కహాల్ డిస్టిలేషన్ ప్లాంట్ సామర్థ్యం రోజుకు 15 కిలోలీటర్ల నుంచి  92 కిలోలీటర్లకు (కేఎల్పీడీ) పెరిగిందని, దానిని రోజుకు 240 కిలోలీటర్లకు విస్తరించడానికి ఆమోదం లభించిందని శ్రీ షా పేర్కొన్నారు. అదేవిధంగా, ఇథనాల్ ప్లాంట్ సామర్థ్యం రోజుకు 20 కిలోలీటర్ల (కేఎల్పీడీ) నుంచి రోజుకు 150 కిలోలీటర్లకు పెరిగింది. బయోగ్యాస్ ప్లాంట్ సామర్థ్యం రోజుకు 12,000 క్యూబిక్ మీటర్ల నుంచి  30,000 క్యూబిక్ మీటర్లకు పెరిగింది. కోజనరేషన్ ప్లాంట్ సామర్థ్యం 30 మెగావాట్ల నుంచి 68 మెగావాట్లకు పెరిగింది.

 

ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో చక్కెర మిల్లుల సంఖ్య 67 కి పెరిగిందని, చక్కెర ఉత్పత్తి 1 మిలియన్ మెట్రిక్ టన్నులు పెరిగిందని సహకార శాఖ మంత్రి తెలిపారు.

డిస్టిలరీల సంఖ్య రెట్టింపు అయిందని, ఇథనాల్ ఉత్పత్తి సామర్ధ్యం ఐదు రెట్లు పెరిగిందని, వాటి సరఫరా పది రెట్లు పెరిగిందని ఆయన అన్నారు. పెట్రోల్ లో ఇథనాల్ కలపడం ఇప్పుడు 20 శాతానికి చేరుకుందని చెప్పారు. శ్రీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సహకార చక్కెర మిల్లులు ఎంతగా ప్రయోజనం పొందాయో ఇది స్పష్టం చేస్తుందని ఆయన అన్నారు. రైతులకు రూ.10,000 కోట్లకు పైగా ఆదాయపు పన్ను బకాయిలను మాఫీ చేయడం మోదీ ప్రభుత్వం తీసుకున్న ప్రధాన నిర్ణయాలలో ఒకటని ఆయన పేర్కొన్నారు. పన్ను పరిష్కారాల విషయంలో సహకార రంగానికి కార్పొరేషన్లతో సమానమైన హోదాను మోదీజీ ఇచ్చారని ఆయన చెప్పారు. 

సహకార సంఘాలను క్రమబద్ధీకరించడానికి మోదీ ప్రభుత్వం మొదటిసారిగా సెటిల్మెంట్ చట్టాన్ని రూపొందించిందని, అది కూడా గతకాలం నుంచి వర్తించే ప్రభావంతో ఉందని శ్రీ షా అన్నారు. ఈ చర్య ఇప్పుడు సహకార చక్కెర మిల్లులకు రూ.4,400 కోట్ల వార్షిక ఆర్థిక భారం నుంచి  విముక్తి కలిగిస్తుందని సహకార మంత్రి తెలిపారు.

సహకార చక్కెర కర్మాగారాలను ఉద్దేశించి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ, వారి ఇథనాల్ ప్లాంట్లను మల్టీ-ఫీడ్ ఇథనాల్ యూనిట్లుగా మార్చాలని,  కూరగాయల వ్యర్థాలు, మొక్కజొన్న, బియ్యం నుంచి ఇథనాల్ ను ఉత్పత్తి చేసే వ్యవస్థలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం అవసరమైన ఆర్థిక సహాయాన్ని నేషనల్ కోఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్ సీడీసీ) అందజేస్తుందని ఆయన చెప్పారు. ఇథనాల్ సేకరణలో అన్ని సహకార సంఘాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా, మోదీ ప్రభుత్వం ఎన్సీడీసీ రుణ పథకం కింద రూ.10,000 కోట్లు అందించింది. మొలాసిస్ పై జీఎస్టీని 28 శాతం నుంచి  5 శాతానికి తగ్గించింది.

ఇటీవల ప్రధాని మోదీ దాదాపు అన్ని ఆహార ఉత్పత్తులపై జీఎస్టీని జీరో చేయడంతో సహా 395 వస్తువులపై జీఎస్టీని తగ్గించారని, ఇది దేశ ప్రజలకు, ముఖ్యంగా తల్లులు, అక్కాచెల్లెళ్లకు ప్రయోజనం చేకూర్చిందని శ్రీ అమిత్ షా అన్నారు. ఈ దీపావళి సందర్భంగా విదేశీ ఉత్పత్తులను మన ఇళ్లలోకి ప్రవేశించబోనివ్వమని ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును ఆయన ప్రస్తావించారు. 140 కోట్ల మంది భారతీయులు భారతదేశంలో తయారైన ఉత్పత్తులను మాత్రమే ఉపయోగిస్తామని ప్రతిజ్ఞ చేస్తే, 2047 కంటే ముందే భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటుందని శ్రీ షా అన్నారు. భారతదేశంలోనే 140 కోట్ల మంది వినియోగదారులతో కూడిన మార్కెట్ ఉన్నందున ఉత్పత్తి కోసం ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు భారతదేశానికి రావాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

సహకార చక్కెర మిల్లులు క్రషింగ్ లేని సీజన్లో కూడా మల్టీ-ఫీడ్ ఇథనాల్ ఉత్పత్తిని కొనసాగించాలని, శీతలీకరణ ద్వారా కూరగాయలనిల్వ, ,పండ్లు, రసాలు, పండ్ల గుజ్జు వంటి వాటి ఉత్పత్తికి కూడా విస్తరించాలని శ్రీ అమిత్ షా అన్నారు.నాఫెడ్, ఎన్సీసీఎఫ్ తో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా సహకార చక్కెర మిల్లులు బహుముఖంగా మారాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. 

 

****


(Release ID: 2175208) Visitor Counter : 7