ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గాజా సంఘర్షణకు స్వస్తి పలికే దిశగా అధ్యక్షుడు శ్రీ ట్రంప్ చేపట్టిన శాంతి సాధన యత్నాలను స్వాగతించిన ప్రధానమంత్రి

Posted On: 30 SEP 2025 9:00AM by PIB Hyderabad

గాజా సంఘర్షణను సమాప్తం చేయడానికి అమెరికా అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ జే ట్రంప్ నడుం కట్టి ఒక సమగ్ర ప్రణాళికను ప్రకటించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు.


ఈ ప్రణాళిక పాలస్తీనాఇజ్రాయల్ ప్రజలతో పాటు సువిశాల పశ్చిమాసియా ప్రాంతానికి కూడా శాంతి భద్రతలతో పాటు దీర్ఘకాలికసుస్థిర ప్రాతిపదికలపై అభివృద్ధి చోటు చేసుకోవడానికి ఒక ఆచరణ సాధ్యమైన మార్గాన్నిఅందుబాటులోకి తీసుకు వస్తుందని ప్రధానమంత్రి అభిలషించారు.


సంఘర్షణకు ముగింపు పలికిచిరకాల శాంతిని నెలకొల్పేందుకు అధ్యక్షుడు శ్రీ ట్రంప్ ప్రతిపాదించిన ఈ ప్రణాళికను సమర్ధించడానికి సంబంధిత పక్షాలన్నీ ఏకతాటి మీదకు వస్తాయన్న ఆశాభావాన్ని శ్రీ మోదీ వ్యక్తం చేశారు.


సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరిచారు :
‘‘గాజా సంఘర్షణను ఆపేందుకు అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ ట్రంప్ ఒక సమగ్ర ప్రణాళికను ప్రకటించడాన్ని మేం స్వాగతిస్తున్నాం. ఈ ప్రణాళిక పాలస్తీనాఇజ్రాయల్ ప్రజలతో పాటు సువిశాల పశ్చిమాసియా ప్రాంతానికి కూడా శాంతి భద్రతలతో పాటు... దీర్ఘకాలికసుస్థిర ప్రాతిపదికలపై అభివృద్ధి కూడా చోటుచేసుకోవడానికి ఆచరణాత్మకమైన బాటను అందిస్తుంది. సంఘర్షణకు ముగింపు పలికిచిరకాల శాంతిని నెలకొల్పేందుకు అధ్యక్షుడు శ్రీ ట్రంప్ నడుంకట్టి ప్రతిపాదించిన ఈ ప్రణాళికను సమర్ధించడానికి సంబంధిత పక్షాలన్నీ ఏకతాటి మీదకు వస్తాయని మేం ఆశిస్తున్నాం".

@realDonaldTrump
@POTUS” 
అని పేర్కొన్నారు.

 

 

***

MJPS/ST


(Release ID: 2173402) Visitor Counter : 4