ప్రధాన మంత్రి కార్యాలయం
తమిళనాడులోని కరూర్‌లో ఓ రాజకీయ ర్యాలీ సందర్భంగా దురదృష్టకర ఘటన.. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారాన్ని ప్రకటించిన ప్రధానమంత్రి
Posted On:
28 SEP 2025 12:03PM by PIB Hyderabad
తమిళనాడులోని కరూర్‌లో ఓ రాజకీయ ర్యాలీ సందర్భంగా దురదృష్టవశాత్తు చోటుచేసుకున్న ఘటనలో మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రకటించారు. ఇదే ఘటనలో గాయపడ్డ వారికి రూ.50,000 చొప్పున పరిహారం అందజేస్తారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పీఎంఓ ఇండియా వేర్వేరు సందేశాలను పొందుపరుస్తూ:
‘‘తమిళనాడులోని కరూర్‌లో ఓ రాజకీయ ర్యాలీ సందర్భంగా దురదృష్టవశాత్తు చోటుచేసుకున్న ఘటనలో మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని అందజేయనున్నట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50,000 వంతున పరిహారంగా అందజేస్తారు’’ అని పేర్కొంది.
(Release ID: 2172584)
Visitor Counter : 17
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam