ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో రష్యా ఉప ప్రధాని శ్రీ దిమిత్రీ పాత్రుషేవ్ భేటీ

వ్యవసాయం, ఎరువులు, ఆహార శుద్ధి తదితర రంగాల్లో సహకారాన్ని పెంపొందించడంపై చర్చించిన నేతలు

భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం అధ్యక్షుడు శ్రీ పుతిన్‌కు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపిన ప్రధానమంత్రి

Posted On: 25 SEP 2025 8:57PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో రష్యా ఉప ప్రధాని గౌరవ దిమిత్రీ పాత్రుషేవ్ ఈ రోజు సమావేశమయ్యారు.
వ్యవసాయం, ఎరువులుఆహార శుద్ధి రంగాలతో పాటు రెండు దేశాల ప్రయోజనాలూ ముడిపడి ఉన్న ఇతర రంగాల్లో సహకారాన్ని ఇప్పటి కన్నా మరింత పెంచుకోవడంపై వారు తమ ఆలోచనలను పంచుకున్నారు.
అధ్యక్షుడు శ్రీ పుతిన్‌కు ప్రధానమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారుభారత్-రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి వచ్చే శ్రీ పుతిన్‌కు భారత్‌లో స్వాగతం పలకడానికి ఎదురుచూస్తున్నానని శ్రీ మోదీ అన్నారు.  

 

***


(Release ID: 2171979) Visitor Counter : 7