ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వారణాసిలోని బీహెచ్‌యూలో జరిగిన సంసద్ సంస్కృత ప్రతియోగిత బహుమతి ప్రదాన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

Posted On: 23 FEB 2024 2:21PM by PIB Hyderabad

నమపార్వతీ పతయే... హర హర మహాదేవ్!

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్కాశీ విద్వత్ పరిషత్ అధ్యక్షుడు ఆచార్య వశిష్ఠ త్రిపాఠికాశీ విశ్వనాథ న్యాస పరిషత్ అధ్యక్షుడు ఆచార్య నాగేంద్రరాష్ట్ర మంత్రులుఇతర ప్రముఖులువిశిష్ట విద్యావేత్తలుపోటీల్లో పాల్గొన్నవారుసోదరీసోదరులారా,

కుటుంబ సభ్యులందరికీ నమస్కారంఈ పవిత్ర మహామాన ప్రాంగణంలోవిద్యావేత్తలు ముఖ్యంగా యువ పండితుల మధ్య ఉంటే.. జ్ఞాన నదిలో మునిగి తేలిన అనుభూతి కలుగుతోందికాలానికి అతీతమైన ప్రదేశంగాపురాతనమైన నగరంగా పరిగణించే కాశీ గుర్తింపును మన నవ యువత బాధ్యతాయుతంగా బలోపేతం చేస్తోందిఇది హృదయాన్ని సంతృప్తిగర్వంతో నింపడమే కాకుండా.. ఈ ‘అమృత కాలం’లో ఈ దేశానికి యువత నాయకత్వం వహించగలదే నమ్మకాన్ని ఇచ్చిందిజ్ఞానానికి రాజధాని కాశీయేనేడుఈ కాశీ సామర్థ్యంసారం మరోసారి శుద్ధి అవుతోందిఇది యావత్ భారత్ గర్వించదగిన అంశంకాశీ సంసద్ సంస్కృత ప్రతియోగితకాశీ సంసద్ జ్ఞాన ప్రతియోగితకాశీ సంసద్ ఫొటోగ్రఫీ ప్రతియోగిత పోటీల విజేతలకు బహుమతి ప్రదానం చేసే అవకాశం నాకు లభించిందివిజేతల కృషినిప్రతిభను అభినందిస్తున్నానువారి కుటుంబాలకుమార్గదర్శకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానువిజయానికి కొన్ని అడుగుల దూరంలో నిలిచిన వారికిపోరాడి నాలుగో స్థానం దక్కించుకున్న వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నానుకాశీ జ్ఞాన సంస్కృతిలో భాగమవడంఈ పోటీల్లో పాల్గొనడం మీకు గర్వకారణంమీలో ఎవరూ ఓడిపోలేదుఎవరూ వెనకబడిపోలేదుఈ పోటీల్లో పాల్గొని మీరు ఎంతో నేర్చుకున్నారు.. ఎన్నో అడుగులు ముందుకు వేశారుకాబట్టి ఈ పోటీల్లో పాల్గొన్నవారందరూ అభినందనలకు అర్హులే.

ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్టుకాశీ విద్వత్ పరిషత్ఇతర పండితులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానుకాశీ పార్లమెంట్ సభ్యునిగా నా లక్ష్యాన్ని చేరుకోవడంలో మీరు కీలకమైన పాత్రను పోషించారుగణనీయమైన సహకారాన్ని అందించారుగత పదేళ్లలో కాశీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించే రెండు పుస్తకాలను ఈ రోజు ఆవిష్కరించాంగడచిన పదేళ్లలో ప్రతి దశలోనూ కాశీ సాధించిన ప్రగతితో పాటుగా.. దాని సంస్కృతి సారాంశాన్ని ఈ కాఫీ టేబుల్ పుస్తకాలు వివరిస్తాయివీటికి అదనంగా.. కాశీలో నిర్వహించిన అన్ని సంసద్ పోటీలకు సంబంధించిన చిన్న పుస్తకాలు కూడా విడుదలయ్యాయిఈ నేపథ్యంలో కాశీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

స్నేహితులారా,

మనమంతా కేవలం పావులమనిఈ కాశీలో కార్యాలన్నీ చేస్తున్నది పరమ శివుడుఆయన భక్తులు మాత్రమే అని మీకు తెలుసుశివుని కరుణ ప్రసరించిన ప్రదేశం దానికదే అభివృద్ధి చెందుతుందిఈ క్షణం శివుడు పరమానందభరితుడై ఉన్నాడుఅందుకేఆయన ఆశీస్సులతో గత పదేళ్లుగా కాశీ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోందిఈ రోజు కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను కాశీ కుటుంబ సభ్యుల కోసం ప్రారంభించుకుంటున్నాంశివరాత్రిఏకాదశి పర్వదినాల కంటే ముందే.. అభివృద్ధి ఉత్సవాన్ని కాశీలో నిర్వహించుకుంటున్నాంఇక్కడికి రావడానికంటే ముందే కాశీ సంసద్ ఫొటోగ్రఫీ ప్రతియోగిత గ్యాలరీని వీక్షించానుగత పదేళ్లుగా గంగా అభివృద్ధితో పాటుగా.. ఈ నగరంలో ఎంత వేగంగా మారిందో మీరు వీక్షించారునేను నిజం చెబుతున్నానో లేదో మీరే చెప్పండినేను చెబుతున్నది అక్షర సత్యంమార్పు వచ్చిందిసంతృప్తి కలిగిందిచిన్నారులు పాత కాశీని చూసి ఉండకపోవచ్చు.. కాశీ ఎప్పుడూ ఇలాగే ఉండేదేమో అని వారు అనుకుంటారుఇదే నా కాశీ శక్తిఇది కాశీ ప్రజల గౌరవంఇది పరమ శివుని అనుగ్రహంభగవంతుడు ఏదైనా పని చేయాలనుకుంటే.. ఆయన్ను ఎవరు ఆపగలుగుతారుబెనారస్‌లో ఏదైనా మంచి జరిగిన ప్రతి సందర్భంలోనూ.. ప్రజలు తమ చేతులను పైకెత్తి ‘‘నమపార్వతీ పతయే హర హర మహాదేవ్!’’ అంటారు.

స్నేహితులారా,

మన విశ్వాసానికి సంబంధించిన పుణ్యక్షేత్రంగా మాత్రమే కాశీ పరిమితం కాలేదు.. ఇది భారత నిత్య చైతన్యాన్ని మేల్కొల్పిన కేంద్రంఒకప్పుడు భారత అభివృద్ధి గాథ ప్రపంచానికి ప్రతిధ్వనించిందిదాని వెనుక భారత ఆర్థిక సామర్థ్యం మాత్రమే కాకుండా.. సాంస్కృతికసామాజికఆధ్యాత్మిక సంపద కూడా ఉందికాశీలాంటి పుణ్యక్షేత్రాలువిశ్వనాథ్ ధామం లాంటి గుడులు దేశ ప్రగతికి యజ్ఞ వాటికలుగా ఉండేవిఇక్కడ ధ్యానంతో పాటుగా తాత్విక చర్చలు కూడా జరిగేవిఇక్కడ సంవాదాలతో పాటు పరిశోధన కూడా జరిగేవిఅలాగే.. సంస్కృతి మూలాలుసాహిత్యసంగీత ప్రవాహాలు కూడా ఇక్కడ ఉన్నాయికాబట్టిభారత్‌లో ఏ కొత్త ఆలోచనలు ఉద్భవించినా.. ఏ సరికొత్త శాస్త్రాలు పుట్టుకొచ్చినా.. అవి ఏదైనా సాంస్కృతిక కేంద్రంతో సంబంధాన్ని కలిగి ఉండేవిదీనికి ఉదాహరణగా మన ముందు కాశీ ఉందిశివుని నగరమైన కాశీ.. బుద్ధుడి బోధనల భూమిగానూ పరిఢవిల్లిందిజైన తీర్థంకరుల జన్మభూమి అయిన కాశీలోనే ఆది శంకరాచార్యులకు జ్ఞానం సిద్ధించిందివిజ్ఞానంపరిశోధనప్రశాంతత కోసం దేశవ్యాప్తంగా ఉన్న వారు మాత్రమే కాకుండా.. ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు కాశీకి వస్తారుప్రతి ప్రాంతానికిప్రతి భాషకుప్రతి మాండలీకానికిప్రతి సంప్రదాయానికి చెందిన ప్రజలు ఈ నగరానికి వచ్చి స్థిరపడతారుఇలాంటి వైవిధ్యం ఉన్న చోటే కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయికొత్త ఆలోచనలు ఎక్కడ వికసిస్తాయో అక్కడ అభివృద్ధికి అవకాశాలు సైతం పెరుగుతాయి.

కాబట్టిసోదరీసోదరులారా,

విశ్వనాథ్ ధామ్ ప్రారంభం సందర్భంగా నేను ఏం చెప్పానో ఓసారి గుర్తు తెచ్చుకోండి. ‘‘భారత్‌కు విశ్వనాథ్ ధామ్ నిర్ణయాత్మక దిశను అందిస్తుందిఇది ఉజ్వలమైన భవిష్యత్తు వైపు భారత్‌ను నడిపిస్తుంది’’ అని చెప్పానుఅది ఈ రోజు మనకు కనిపించకపోవచ్చుకానీ నిర్ణయాత్మక భవిష్యత్తు దిశగా భారత్‌ను నడిపించేలా జాతీయ పాత్రను పోషించడానికి విశ్వనాథ్ ధామ్ తన దివ్యమైన రూపంలో పునరాగమనం చేస్తోందివిశ్వనాథ ధామ్ ప్రాంగణంలో దేశం నలుమూల నుంచి వచ్చిన పండితుల సమావేశాలు జరుగుతున్నాయిన్యాస శాస్త్ర ప్రసంగ సంప్రదాయాన్ని కూడా విశ్వనాథ ఆలయం పునరుద్ధరిస్తోందిశాస్త్రీయ సంగీతంతో పాటు.. పండితుల చర్చలు కాశీలో ప్రతిధ్వనిస్తున్నాయితద్వారా దేశవ్యాప్తంగా ఉన్న మేధావుల మధ్య ఆలోచనలు పంచుకునే సంస్కృతి కూడా పెరుగుతుందిఇది ప్రాచీన జ్ఞానాన్ని పరిరక్షించడంతో పాటు.. కొత్త ఆలోచనలను సృష్టిస్తుందికాశీ సంసద్ సంస్కృత ప్రతియోగితకాశీ సంసద్ జ్ఞాన ప్రతియోగిత కూడా ఈ ప్రయత్నంలో భాగమే.

ఉపకారవేతనాలతో సహా పుస్తకాలువస్త్రాలుఇతర అవసరమైన వనరులను వేల మంది సంస్కృత అభ్యాసకులకు అందిస్తున్నాంఉపాధ్యాయులకు సైతం తోడ్పాటు అందిస్తున్నాంఇది మాత్రమే కాదు.. తమిళ సంగమంగంగా పుష్కరాల ద్వారా ‘ఏక్ భారత్శ్రేష్ఠ భారత్’ తరహా కార్యక్రమాల్లో విశ్వనాథ ధామ్ భాగంగా ఉందిఈ నమ్మకమే కేంద్రంగా ఆదీవాసీ సాంస్కృతిక ఉత్సవం ద్వారా సామాజిక సమ్మిళిత్వమనే సంకల్పం బలోపేతం అవుతోందిఆధునిక శాస్త్రీయ దృక్పథానికి అనుగుణంగా పురాతన విజ్ఞానంపై కాశీ పండితులువిద్వత్ పరిషత్ నూతన పరిశోధన చేస్తున్నాయిత్వరలో నగరంలో అనేక చోట్ల ఆలయ ట్రస్టు ఆధ్వర్యంలోఉచిత భోజనం అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని నాకు తెలిసిందిఅన్నపూర్ణ మాత నగరంలో ఎవ్వరూ ఆకలితో ఉండకుండా గుడి బాధ్యత తీసుకుంటోందివిశ్వాసానికిసామాజికజాతీయ సంకల్పాలకు శక్తికేంద్రంగా కాశీ ఎలా విలసిల్లుతుందో.. అదే తరహాలో నవ భారత్‌కు సైతం సరికొత్త స్ఫూర్తిగా ఈ క్షేత్రం నిలుస్తోందిఇక్కడి నుంచి ఉత్తీర్ణులై వెళ్లే యువత భారతీయ విజ్ఞానానికిసంప్రదాయానికిసంస్కృతికి ఈ ప్రపంచంలో పతాకధారులుగా మారతారని నేను విశ్వసిస్తున్నానుఅంతర్జాతీయ సంక్షేమం అనే సంకల్పానికి బాబా విశ్వనాథుని భూమి సాక్ష్యంగా నిలుస్తోంది.

స్నేహితులారా,

మన విజ్ఞానంశాస్త్రంఆధ్యాత్మికత వివిధ భాషల ద్వారా సుసంపన్నమయ్యాయిఅందులో సంస్కృతం అగ్రస్థానంలో ఉందిభారత్ ఒక ఆలోచన అయితే.. సంస్కృతం దాని ప్రాథమిక వ్యక్తీకరణభారత్ ఒక యాత్ర అయితే.. సంస్కృతం దాని చరిత్రలో తొలి అధ్యాయంభిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారత్దానికి మూలం సంస్కృతంఅందుకే, ‘‘భారతస్య ప్రతిష్ఠే దవే సంస్కృతం సంస్కృతి స్థతా’’ అంటే భారత ప్రతిష్ఠలో సంస్కృతం గణనీయమైన పాత్ర పోషిస్తుందని ఇక్కడ చెబుతుంటారుమన దేశంలో ఒకప్పుడు శాస్త్రీయ పరిశోధన భాషగా సంస్కృతం ఉండేదిఅలాగే శాస్త్రీయ విజ్ఞాన భాష కూడా సంస్కృతమేఖగోళశాస్త్రంలో సూర్య సిద్ధాంతమైనా.. ఆర్యభట్టలీలావతి గణితమైనా.. చరకుడుసుశ్రుతుడి వైద్య శాస్త్రమైనా లేదా బృహత్ సంహిత అయినా.. అన్నీ సంస్కృతంలోనే లిఖితమయ్యాయివీటితో పాటుగా.. సంగీతంకళలు సైతం ఈ భాష నుంచే పుట్టుకొచ్చాయిఈ రూపాల ద్వారానే భారత్‌కు గుర్తింపు వచ్చిందికాశీలో సంస్కృతంలో వల్లించే వేదాలనే కంచిలోనూ మనం వింటాంఇవే వేల ఏళ్లుగా దేశాన్ని ఐక్యంగా ఉంచిన ‘ఏక్ భారత్శ్రేష్ఠ భారత్’కు శాశ్వతమైన స్వరాలుగా భాసిల్లుతున్నాయి.

స్నేహితులారా,

ప్రస్తుతంవిరాసత్ (వారసత్వం), వికాస్ (అభివృద్ధి)కి నమూనాగా కాశీ నిలుస్తోందిసంప్రదాయాలుఆధ్యాత్మికత చుట్టూ.. ఆధునికత ఎలా విస్తరిస్తుందో ఈ ప్రపంచం చూస్తోందినూతన ఆలయంలో రామ్ లల్లాను ప్రతిష్ఠించిన అనంతరం అయోధ్య కూడా ఇదే పద్ధతిలో అభివృద్ధి చెందుతోందిదేశవ్యాప్తంగా బుద్ధునికి సంబంధించిన ప్రదేశాల్లో ఆధునిక మౌలికవసతులుసౌకర్యాల అభివృద్ధి జరుగుతోందిఖుషీనగర్లో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఉత్తర్ ప్రదేశ్ లబ్ధి పొందుతోందిఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు ప్రస్తుతం దేశంలో నిర్మాణంలో ఉన్నాయిఇదే విశ్వాసంతో దేశాభివృద్ధిని వేగవంతం చేయడమే కాకుండా.. విజయంలో కొత్త ప్రామాణికాలను నిర్దేశిస్తుందిఇది మోదీ ఇచ్చే గ్యారంటీమోదీ హామీ అంటే కచ్చితంగా నెరవేరుతుందనే గ్యారంటీ అని మీకు తెలుసుపార్లమెంట్ సభ్యుడిగా నా కోసం.. ఇంకా మీ కోసం కూడా ఓ పనిని వెంట తీసుకువచ్చానుమీరు అది చేస్తారానేను ఎన్నో పనులు మీకు అప్పచెప్పాను.. ఇక్కడి ప్రజలు వాటిని అద్భుతంగా స్వీకరించారుప్రతి అంశంతోనూ వారు అనుసంధానమై.. కొత్త తరంలో చైతన్యాన్ని నింపుతున్నారుఈ పోటీలు సాధారణమైనవి కాదునా లక్ష్యం ‘సబ్కా ప్రయాస్’ (సమష్టి కృషిప్రయోగాన్ని విజయవంతం చేయడంరానున్న రోజుల్లో ప్రతి పర్యాటక ప్రదేశంలో ఏం జరుగుతుందో అందరూ చూడాలని నేను భావిస్తున్నానుప్రజలు పోస్టు కార్డులు ముద్రిస్తారువాటిపై ఓ ప్రత్యేకమైన ఫొటో ఉంటుందిదాని వెనక ఏదైనా రాయడానికి వీలుగా ఖాళీగా ఉంటుందిఛాయాచిత్ర పోటీలకు వచ్చిన కాశీ ఫొటోలకు ఓటింగ్ పెట్టాలిప్రజలు ఓటు వేసిన టాప్ 10 ఫోటోలను పోస్టుకార్డులుగా ముద్రించి టూరిస్టులకు విక్రయించాలిఅలాగే ఈ పోటీలు ప్రతి ఏటా జరగాలిప్రతి సారీ 10 కొత్త ఫొటోలు వస్తాయిఅయితే అది ఓటింగ్ ద్వారా మాత్రమే జరగాలిఉత్తమ ఫొటోలను ఎంపిక చేయడానికి కాశీ ప్రజలు ఓటు వేయాలిఈ ఫొటోల కోసం మనం ఆన్లైన్ పోటీలు నిర్వహించవచ్చామనం చేయగలమాసరే చేద్దాం.

రెండో పని కొంత మంది తమ మొబైల్ ఫోన్ల ద్వారా ఫొటోలు తీసి ఈ ఫొటోగ్రఫీ పోటీల్లో పాల్గొని ఉంటారునిర్దేశించిన పరిమాణంలో ఉన్న పేపర్లో వివిధ ప్రదేశాల వద్ద స్కెచ్చులు గీసే పోటీలను మనం నిర్వహిద్దాంఉత్తమ స్కెచ్చులకు బహుమతులు కూడా ఉంటాయితర్వాత ఈ స్కెచ్చుల్లో ఉత్తమమైన పదింటిని పోస్టుకార్డులుగా ఎంపిక చేయాలిదీన్ని మనం చేద్దామాస్వరం ఎందుకు తగ్గింది?.. సరే!

మూడో పని కాశీ క్షేత్రానికి లక్షల మంది ప్రజలు వస్తుంటారు.. కాబట్టి.. గైడ్‌ల అవసరం చాలా ఉందితమకు ఎవరైనా ఇక్కడి విశేషాల గురించి వివరిస్తే బాగుంటుందని వారు ఎదురు చూస్తుంటారుఇక్కడికి వచ్చే యాత్రికుల హృదయంమనస్సుల్లో కాశీ పూర్తిగా నిండిపోవాలిదీనికి ఇక్కడి విశేషాల గురించి అద్భుతంగా వివరించే గైడ్‌ల అవసరం ఉందిఅందుకే ఉత్తమ గైడ్‌ల కోసం పోటీ అవసరమని చెబుతున్నానుఈ పోటీల్లో అందరూ పాల్గొనవచ్చుఉత్తమ ప్రదర్శన చేసిన వారికి బహుమతిసర్టిఫికెట్లు దక్కుతాయిగైడ్‌గా పనిచేయడం భవిష్యత్తులో ఓ జీవనోపాధిగా మారొచ్చుకొత్త రంగం అభివృద్ధి చెందుతుందిమీరు అలా చేస్తారామీరు దీనిని తిరస్కరించడం లేదుస్నేహితులారామీరు ఈ పరీక్షలో పాల్గొనాలని భావించడం లేదాఅయితేమన ఎంపీ (పార్లమెంట్ సభ్యుడుపిల్లల చదువుపై దృష్టి సారించకుండా.. వాళ్లకి వేరే పనులు అప్పచెబుతున్నారని మీ ఉపాధ్యాయులు అంటారుమనలోనే ఎంత నైపుణ్యాభివృద్ధి జరుగుతుందో మీరే చూడండిఅది జరగాలిప్రతిభ వృద్ధి చెెందడానికి అవసరమైన ప్రతి అవకాశం ఇవ్వాలిభగవంతుడు అందరికీ అన్ని రకాల సామర్థ్యాలు ఇచ్చాడుకొందరు వాటిని పెంపొందించుకుంటారుమరికొందరు వాటిని తమలోనే దాచేసుకుంటారు.

కాశీ సుందరీకరణ చెందుతోందివంతెనలురోడ్లుభవనాలు నిర్మాణమవుతున్నాయిచేయిీచేయీ కలిపి లక్ష్యాన్ని సాధించేలా ప్రతి వ్యక్తినిప్రతి మెదడును సేవకుడిగాస్నేహితుడిగా నేను తీర్చిదిద్దాలిప్రతి ఒక్కరూ తమ మనసును శుద్ధి చేసుకోవాలిసేవకుడిగా పనిచేయాలిగెలుపొందిన వారికి హృదయపూర్వక అభినందనలుమరో కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆలస్యమవుతోందికానీ ఇక్కడఈ కార్యక్రమంలో మరి కాసేపు మీతో సమయం గడపాలనిపిస్తోందిచాలా మంది నాతో ఫొటోలు తీసుకోవాలని ప్రయత్నించడం నేను చూశానునాకూ ఓ కోరిక ఉంది.. అది మీతో కలసి ఫొటో తీసుకోవడంమీరు నాకు సాయం చేస్తారానేను చెప్పింది మీరు చేయాలి సరేనానేను ఇక్కడి నుంచి వెళ్లే వరకు మీరెవరూ నిల్చోకూడదునేను కిందకు వచ్చి ప్రతి బ్లాకులోనూ నిలబడతానుకెమెరాలు ఉన్నవారు వేదికపైకి రండిఈ ఫోటోలను నా వెంట తీసుకెళ్తానుమరిమీకుదీనికో పరిష్కారం నేను చెబుతానుమీ మొబైల్ ఫోన్లో నమో యాప్‌కి వెళ్లండినమో యాప్ డౌన్లోడ్ చేసుకోండిఅక్కడ ఫొటో విభాగం ఉంటుందిఒక సెల్ఫీ తీసుకొని అందులో అప్లోడ్ చేయండిబటన్ ప్రెస్ చేయండి.. మీరెక్కడ ఉన్నా.. నాతో మీరు దిగిన ఈ ఫోటోలన్నీ ఏఐ ద్వారా మీకు అందుతాయిమన కాశీలో సంస్కృతమే కాదు.. సైన్సు కూడా ఉందిమీరందరూ నాకు సాయం చేస్తారు కదామీరందరూ కూర్చోండిఎవ్వరూ నిల్చోకూడదుమీరు కూర్చొని తల పైకెత్తండి.. అందరి ఫొటో వస్తుందినా కెమెరా నవ్వుతున్న వారి ఫొటోలను మాత్రమే తీస్తుంది.

హర హర మహాదేవ్!

ఇప్పడు నేను కిందకు వస్తున్నానుఇక్కడ ఉన్న వారు ఇక్కడే కూర్చుంటారుమీరు అక్కడ కూర్చోండికెమెరాలు ఉన్నవారు స్టేజి మీదకు రండి.

సూచనఇది ప్రధాని హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం.

 

***


(Release ID: 2169366) Visitor Counter : 8