ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎనిమిదో పోషణ మాసోత్సవానికీ, ‘స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్’కూ ఈ నెల 17న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం


మహిళలు, బాలల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా భారత్‌లో అత్యంత భారీ స్థాయి ప్రచార ఉద్యమానికి

కేంద్ర ఆరోగ్య శాఖ, కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖల సంయుక్త సారథ్యం


దేశం నలుమూలలా ఒక లక్ష కన్నా ఎక్కువ ఆరోగ్య శిబిరాల నిర్వహణ ప్రణాళిక...

అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో రోజువారీ ఆరోగ్య శిబిరాలు


మహిళల ఆరోగ్య సేవలకు ఢోకా లేకుండా చూడడానికి దేశమంతటా సమగ్ర ప్రచార ఉద్యమం..

రోగాల ముందస్తు గుర్తింపు, నివారణ ప్రధాన చర్యలు, ఆరోగ్య సంరక్షణ పై ప్రత్యేక శ్రద్ధ

సాధారణ వ్యాధులు, క్యాన్సర్, రక్తహీనత, క్షయ, సికిల్ సెల్ వ్యాధులతో పాటు

తల్లుల ఆరోగ్య పరిక్షల నిర్వహణకు ఏర్పాట్లు..

అవగాహనను పెంచేందుకు సమావేశాలు, సూచనలు, సదస్సులు

స్థాయి, అందుబాటు, ప్రజాసమీకరణే లక్ష్యంగా అనేక మంత్రిత్వ శాఖల సహకారంతో

ప్రభుత్వానికీ, ప్రజలకూ మధ్య సమన్వయ సాధన

Posted On: 14 SEP 2025 4:50PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ  నరేంద్ర మోదీ ఈ  నెల 17న ఎనిమిదో పోష మాసోత్సవాలతో పాటు ‘స్వస్థ్ నారీసశక్త్ పరివార్ అభియాన్’ను ప్రారంభించనున్నారుఇది దేశవ్యాప్తంగా మహిళలుకౌమారదశకు త్వరలో చేరుకొనే బాలికలతో పాటు పిల్లలకు కూడా ఆరోగ్య సంరక్షణ సేవలనుపోషణ సేవలను పటిష్ఠపరిచే దిశగా ఒక చరిత్రాత్మక ఘట్టానికి నాందీ ప్రస్తావన కాబోతోంది.

ఈ కార్యక్రమానికి ఆరోగ్యకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో పాటు మహిళాశిశు అభివృద్ధి శాఖ కూడా సంయుక్త నాయకత్వాన్ని అందిస్తాయిఈ సంయుక్త సారథ్యం మహిళలుబాలల ఆరోగ్యంపోషణ విషయాలపై ఈ రెండు శాఖల ఉమ్మడి నిబద్ధతను చాటిచెబుతుందిదేశం నలు మూలల ఆరోగ్య శిబిరాలతో పాటు ఆరోగ్య కేంద్రాల బాధ్యతను ఆరోగ్యకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాను తీసుకొనిరోగ నివారణప్రోత్సాహకరరోగాన్ని నయం చేయడం ప్రధానం అనే దృష్టితో అవసరమైన సేవలను సమకూర్చడానికి వెన్నుదన్నుగా నిలవనుందిమహిళాశిశు అభివృద్ధి శాఖ తన వంతుగా పోష  మాసోత్సవం సందర్భంగా అమలు పరిచే కార్యకలాపాలను ప్రచార ఉద్యమంతో ఏకీకృతం చేస్తుందిమహిళలనుబాలికలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున పోషణ సంబంధిత సలహాలుసూచనలను ఇవ్వడంతో పాటు కొన్ని జాగ్రత్తలను చెప్పే కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారురక్తహీనతను అరికట్టడంసంతులిత ఆహారాన్ని తీసుకోవాలని తెలియజేయడంనెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత వంటి అంశాలపై చైతన్యాన్ని పెంచే కార్యక్రమాలను ఈ రెండు మంత్రిత్వ శాఖలు కలిసికట్టుగా నిర్వహిస్తాయిఈ కార్యక్రమాలతో మహిళలకుపూర్వ కౌమార దశలో ఉన్న బాలికలకు తమ శారీరక స్వస్థతపోషణ సంబంధిత జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యం అవుతుంది.


ఆరోగ్యంపోషణశరీర దారుఢ్యంతో పాటు ‘వికసిత్ భారత్’లక్ష్యాన్ని 2047 కల్లా సాధించాలన్న గౌరవ ప్రధానమంత్రి దృష్టికోణాన్ని ముందుకు తీసుకుపోవడమే ‘స్వస్థ్ నారిసశక్త్ పరివార్ అభియాన్’ ఉద్దేశందేశవ్యాప్తంగా నిర్వహించే ఈ ముమ్మర ప్రచార ఉద్యమంతో సమాజంలో ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యాన్నిస్తూ రోగ నివారణరోగాన్ని నయం చేయడం ప్రధానమన్న దృష్టితో అవసరమైన ఆరోగ్య సేవలను అందజేస్తారుసాధారణ వ్యాధులురక్తహీనతక్షయలతో పాటు సికిల్‌ సెల్ వ్యాధి పరీక్షలను నిర్వహించడాన్నిరోగాలను ముదరడానికన్నా ముందుగానే గుర్తించడంచికిత్సలకు సంబంధించిన సేవలను ఈ ప్రచార ఉద్యమం పటిష్ఠపరుస్తుందిఅలాగే ప్రసవానికి పూర్వం గర్భవతుల సంరక్షణటీకాలుపోషణఅలాగే మహిళలు నెలసరి సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంజీవనశైలిమానసిక స్వస్థత సంబంధిత అవగాహన కార్యకలాపాలు.. ఈ మార్గాల్లో తల్లులపిల్లలకౌమార దశలో ఉన్న బాలికల స్వస్థత సంరక్షణకు కూడా పెద్దపీట వేస్తుందివీటికి తోడుఈ ప్రచార ఉద్యమం ఊబకాయం రాకుండా అడ్డుకోవడంచక్కని పోషణలతో పాటు స్వచ్ఛంద రక్త దానం.. వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవరచుకొనేలా స్ఫూర్తిని నింపుతుంది.    


image.png

ఆరోగ్యంకుటుంబ సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి శ్రీ జె.పినడ్డా సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’ లో ఒక సందేశాన్ని రాశారుఅందులో ఆయన ‘దేశమంతటా మహిళలకుబాలలకు ఆరోగ్యసంరక్షణ సేవలను బలపరచడంతో పాటు వారికి మరింత మెరుగైన సేవలనునాణ్యమైన పోషణను అందించడమూవారిని చైతన్యపరచడమూ ఈ కార్యక్రమం ఉద్దేశాలు’ అని పేర్కొన్నారుప్రజల భాగస్వామ్యంతో నిర్వహించ తలపెట్టిన ఈ ప్రచార ఉద్యమంలో తప్పక పాలుపంచుకోవాల్సిందిగా ప్రయివేటు రంగంలోని అన్ని ఆసుపత్రులతో పాటు ఆరోగ్యసంరక్షణ రంగంలోని ఆసక్తిదారులందరికీ ఆయన విజ్ఞ‌ప్తి చేశారు.
   
image.png      image.png


దేశవ్యాప్తంగా ప్రారంభోత్సవంఆరోగ్య శిబిరాలు
ఈ ప్రచార కార్యక్రమాన్ని దేశంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలుకమ్యూనిటీ  హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీలు), జిల్లా ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ ఆరోగ్య  కేంద్రాలన్నిటా ఈ నెల 17న మొదలుపెట్టివచ్చే నెల (అక్టోబరు) 2వ తేదీ వరకు నిర్వహిస్తారు.

ఒక లక్ష కన్నా ఎక్కువ సంఖ్యలో ఆరోగ్య  శిబిరాలను ఏర్పాటు చేస్తారుదేశంలోని మహిళలుబాలలకు ఆరోగ్య సేవల సంబంధిత ప్రచార ఉద్యమాన్ని ఇంత పెద్ద స్థాయిలో నిర్వహించడం ఇదే మొదటిసారి.


దేశమంతటా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలన్నిటిలోను రోజువారీ ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తారు.

ఈ ప్రచార ఉద్యమంలో కేంద్ర మంత్రులురాష్ట్రాల మంత్రులుపార్లమెంట్ సభ్యులుఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారుఆశాలుఏఎన్ఎంలుఆంగన్వాడీ కార్యకర్తలుస్వయంసహాయ బృందాలుపంచాయతీ రాజ్ సంస్థలుపట్టణ స్థానిక సంస్థలుమై భారత్ స్వయంసేవకులుయువజన బృందాలు క్షేత్ర స్థాయిలో ప్రజా సమీకరణ నేతృత్వం వహిస్తారు.
ప్రధాన ఆరోగ్య సేవలు
మహిళా రోగుల వైద్యంశిశు రోగుల వైద్యంకన్నుఈఎన్‌టీదంతచర్మ రోగాలుమనోరోగుల చికిత్స సహా నిపుణుల సేవలను వైద్య కళాశాలలుజిల్లా ఆసుపత్రులుకేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రయివేటు ఆసుపత్రుల్లో అందుబాటులోకి తీసుకువస్తారు.

ఈ ప్రయత్నాలకు తోడుఎయిమ్స్రక్షణ మంత్రిత్వ శాఖరైల్వే శాఖల ఆధీనంలోని ఆసుపత్రులుఈఎస్ఐసీ ఆసుపత్రులుసీజీహెచ్ఎస్ కేంద్రాలతో పాటు జాతీయ ప్రాధాన్యం కలిగిన సంస్థలు కూడా తమ వంతుగా కృషి చేస్తూ నిపుణుల సేవలను సమకూరుస్తాయిమొత్తంమీద చివరి వ్యక్తికి కూడా నిరంతరాయంగా ఆరోగ్య సంరక్షణ లభించేటట్లు చూస్తారుఈ కార్యక్రమానికి సాయం చేస్తామంటూ అనేక ప్రయివేటు రంగంలోని ఆరోగ్య కేంద్రాలు ముందుకు వచ్చాయిదీంతో ఈ  కార్యక్రమ స్థాయినాణ్యంలభ్యత విస్తరించగలదని భావిస్తున్నారు.

పదిహేను రోజుల పాటు కొనసాగించే ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కింద ప్రస్తావించిన సేవలను అందిస్తారు:

సాధారణ వ్యాధులువెల్‌నెస్ సంబంధిత సేవలు: బీపీరక్తంలో చక్కెర పాళ్లుబీఎంఐ రీక్షల సదుపాయాన్ని శిబిరాల్లో అందుబాటులోకి తీసుకువస్తారుఅధిక రక్తపోటుమధుమేహంతో పాటు ఊబకాయం బారిన పడిందీ లేనిదీ నిర్ధారణ చేస్తారురిస్కు అంచనాలుసలహాలతో పాటు జీవనశైలిలో ఏమేం మార్పులు చేసుకొంటే మంచిదో తెలపడంపోషణవ్యాయామ సలహాలుధూమపానంపై చైతన్యం తెస్తారు. దీర్ఘకాలిక వ్యాధుల జాడలను ముందుగానే పసిగట్టడంతో పాటు రోగాలు మరీ ముదిరిపోకుండా చూసుకోవడంలో కూడా బాధితులకు తోడ్పాటును అందిస్తారు.  

క్యాన్సర్ పరిక్షలు: నోటి రీక్షలుస్వీయ స్తన పరీక్షగర్భాశయ ద్వారానికి సంబంధించిన కేన్సర్ పరిక్షల వంటివి మహిళలకు ప్రయోజనం చేకూరుస్తాయిమౌఖిక క్యాన్సర్రొమ్ము క్యాన్సర్గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ల విషయంలో చైతన్యాన్ని పెంచే సదస్సులతో పాటు మామోగ్రఫీఅంకాలజీ సంరక్షణకు స్పెషాలిటీ సేవలను కూడా అందుబాటులో ఉంచుతారు.  
     

రక్తహీనతపోషణమహిళలకుకౌమార దశలోని బాలికలకు పెద్ద ఎత్తున హెచ్‌బీ రీక్షలతో పాటు రక్తహీనత రీక్షలను కూడా నిర్వహిస్తారుఐఎఫ్ఏ సప్లిమెంట్లుక్రిమినాశక మాత్రలను అందజేస్తారుపోషణ విషయాలపై కౌన్సెలింగుసంతులిత ఆహారాన్ని తీసుకోవడం ఎలా?, ఆరోగ్యకరమైన వంటకాలను తయారు చేసుకోవడం ఎలా?, అన్నప్రాశన కార్యక్రమాల నిర్వహణ తీరు వంటివి పోషణ పరమైన చైతన్యాన్ని పెంచుతాయినెలసరి వేళ తీసుకోవాల్సిన జాగ్రతలను అందించడం ద్వారా అమ్మాయిల్లో అవగాహనను పెంచుతారువీటికి అదనంగాఎఫ్ఎస్ఎస్ఏఐ ఆధ్వర్యంలో సరి అయిన ఆహారాన్నే తీసుకోండి (‘ఈట్ రైట్’అనే కార్యక్రమంలో భాగంగా సురక్షితఆరోగ్యప్రదసమతుల్య ఆహార పద్ధతులను పాటించడాన్ని ప్రజలకు తెలియజేస్తారు.

క్షయబలహీన మహిళలకు టీబీ పరిక్షఉమ్మి సేకరణసంచార ఎక్స్-రే యూనిట్లతో త్వరిత గతిన రోగనిర్ధారణ పరీక్షలను అందుబాటులోకి తెస్తారురోగులకు చికిత్సను అందించడానికి డాట్స్ కేంద్రాలతో వారిని కలుపుతారుపోషణమనోసామాజిక సహాయాన్ని అందించడానికి స్వయంసేవకులను ‘నిక్షయ్ మిత్ర’లుగా రంగంలోకి దించుతారు.

సికిల్ సెల్ వ్యాధిఫలానా వర్గం వారికి సికిల్ సెల్ పరిక్షసికిల్ సెల్ కార్డుల పంపిణీకౌన్సెలింగ్ సేవల ద్వారా గిరిజనులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారుఆనువంశిక కౌన్సెలింగురెఫరల్ మార్గాల్లో దీర్ఘకాలిక సంరక్షణవ్యాధి నిర్వహణ సేవలను అందిస్తారు.
 

మాతాశిశు ఆరోగ్య సంరక్షణహీమోగ్లోబిన్ రీక్షరక్తపోటు (బీపీపర్యవేక్షణబరువు రీక్షగర్భంలో పిండం వృద్ధి చెందుతున్న తీరును గమనిస్తుండడం సహా గర్భవతులకు కాన్పు కన్నా ముందు సమగ్ర సంరక్షణ సేవలను అందిస్తారుమాతా  శిశు సురక్ష (ఎంసీపీకార్డుల పంపిణీసురక్షిత గర్భావస్థసంస్థాగత ప్రసవం అంశాలపై కౌన్సెలింగుచిన్నారుల ఎదుగుదల తీరును పర్యవేక్షించడంశిశువులకుచిన్న పిల్లలకు ఎలాంటి ఆహారాన్ని అందజేయాలి?, ఏయే టీకామందులు ఇప్పించాలివంటి అంశాల్లో అందజేసే సేవలు తల్లీబిడ్డల ఆరోగ్య ఫలితాలను మరింత మెరుగుపరుస్తాయి.

టీకాలు: బాలలతో పాటు కౌమార దశలోని బాలికలకు క్యాచ్-అప్ టీకామందును ఇప్పించడం సహా గర్భవతులకు టీడీ టీకామందును కూడా ఇప్పించడానికి ప్రాధాన్యాన్నిస్తారు.  

చైతన్యాన్ని పెంచడంతో పాటు కౌన్సెలింగు ఇవ్వడం: నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత చర్యలను ప్రచారంలోకి తీసుకురావడానికీశానిటరీ ప్యాడ్లను పంపిణీ చేయడానికీ మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కౌన్సెలింగ్ సదస్సులను ఏర్పాటు చేస్తారునూనెచక్కెర వాడకాన్ని తగ్గించుకోవాలనీఆరోగ్యాన్ని పెంచే ఆహారపదార్థాల వైపు మొగ్గు చూపాలంటూ స్వయంసహాయ బృందాలుపంచాయతీ  రాజ్  సంస్థల నాయకత్వంలో నిర్వహించే ప్రచార ఉద్యమాల్లో ప్రజలను ప్రోత్సహిస్తారు.
 

రక్తదానం: గాయపడ్డవారికి అందించాల్సిన సేవలుశస్త్రచికిత్సలురక్త సంబంధిత అనారోగ్య చికిత్సను పటిష్ఠపరచడానికి దేశవ్యాప్తంగా రక్త దాన ప్రోత్సాహక కార్యక్రమాలను నిర్వహిస్తారురక్తాన్ని దానమిచ్చేందుకు ముందుకు వచ్చే వారి పేర్లను ఎలక్ట్రానిక్ మాధ్యమంలోని ఈ-రక్తకోశ్ పోర్టల్ (https://eraktkosh.mohfw.gov.inలో నమోదు చేసిరక్త దాన సంబంధిత ప్రతిజ్ఞ‌ా కార్యక్రమాలను మైగవ్  (www.mygov.in) మాధ్యమం ద్వారా నిర్వహిస్తారు.

డిజిటల్ మాధ్యమం ద్వారా ఆరోగ్య సేవలు: లబ్ధిదారులను పీఎం-జేఏవైఆయుష్మాన్ వయ వందనతో పాటు ఏబీహెచ్ఏ పథకాల్లో చేర్చుకొంటారుకార్డును సరిచూడడానికీఫిర్యాదులను పరిష్కరించడానికీ ఆరోగ్య శిబిరాల్లో హెల్ప్‌ డెస్కులను ఏర్పాటు చేస్తారు.
ఆయుష్ సేవలు: మహిళల్లోనుకుటుంబాల్లోను సమగ్ర ఆరోగ్య సేవలతో పాటు వెల్‌నెస్ సంబంధిత సేవలను ప్రోత్సహించడానికి యోగఆయుర్వేద సూచనలుసలహాలు సహా ఇతరత్రా ఆయుష్ సేవలను అందిస్తారు.

యువతనుపౌరులను సమీకరించడంప్రజల భాగస్వామ్యంతో ముందుకు పోయే ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రచార ఉద్యమంలో మన దేశ యువతనీప్రజలను కలుపుకొని వెళ్లేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకొంటారుచైతన్యాన్ని పెంచేందుకు చేపట్టే ప్రచార కార్యక్రమాల్లోనుఆరోగ్య పరిరక్షణ ప్రతిజ్ఞ‌ను స్వీకరించే కార్యక్రమాల్లోనుసాంస్కృతిక కార్యక్రమాల్లోనుప్రజాసమీకరణ కార్యక్రమాల్లోను మైభారత్ స్వయంసేవకులు చురుకుగా పాల్గొంటారుస్వచ్ఛంద రక్తదానంతో పాటు అవయ దానం కోసం ప్రతిజ్ఞ చేయాల్సిందిగా పౌరులను మైగవ్ పోర్టల్ (www.mygov.in)  ద్వారా ప్రోత్సహిస్తారుక్షయ రోగులకు పోషణసలహాలుసూచనలు ఇవ్వడంతో పాటు వారి సంరక్షణ బాధ్యతలు తీసుకొనేందుకు ‘నిక్షయ్ మిత్ర’లుగా మారడానికి ఉద్దేశించిన ప్రత్యేక వేదిక www.mygov.in ) లో పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా ప్రోత్సహిస్తారుఈ సమగ్ర సమాజ దృష్టికోణం ప్రచార ఉద్యమం వీలైనంత ఎక్కువ ప్రాంతాలకు చేరుకొనిఆశిస్తున్న ప్రభావాన్ని కలగజేయడంలో తోడ్పడుతుందని భావిస్తున్నారు.


ఏకోన్ముఖ ప్రభుత్వ సేవలు
ఈ ప్రచార ఉద్యమానికి మహిళలుబాలల అభివృద్ధి శాఖతో పాటు అనేక ఇతర మంత్రిత్వ శాఖలు కూడా అండదండగా నిలవనున్నాయిస్వయంసహాయ బృందాలుపంచాయతీ రాజ్ సంస్థల మాధ్యమం ద్వారా గ్రామీణాభివృద్ధి శాఖపంచాయతీ రాజ్ శాఖలు మహిళలను సమీకరిస్తాయిపాఠశాలలుఉన్నత  విద్యబోధన సంస్థలతో సమన్వయాన్ని విద్య మంత్రిత్వ శాఖ ఏర్పరుస్తుందిమైభారత్ కార్యకర్తలతో యువజన వ్యవహారాలుక్రీడల శాఖ చేయి కలిపి ఆరోగ్యాన్ని కాపాడుకొనే విషయంలో చైతన్యాన్నిఅందుబాటునూ పెంచడంలో సాయపడుతుందిదివ్యాంగజనులకు సంబంధించిన సహాయ కార్యకలాపాల విషయంలో సామాజిక  న్యాయంసాధికారత శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజెబిలిటీస్ (డీఈపీడబ్ల్యూడీమద్దతిస్తుందిరక్షణ శాఖరైల్వేల మంత్రిత్వ శాఖకార్మికఉపాధికల్పన  శాఖఆయుష్ శాఖభారీ పరిశ్రమల శాఖహోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలు తమ తమ ఆధీనంలోని వైద్య సంస్థల్లో ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తాయి.‌

 

***


(Release ID: 2167051) Visitor Counter : 2