ప్రధాన మంత్రి కార్యాలయం
                
                
                
                
                
                    
                    
                        నేపాల్ పరిణామాలపై ప్రధానమంత్రి అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                09 SEP 2025 10:28PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ నేపాల్ పరిణామాలపై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది. అక్కడ చెలరేగిన హింసాత్మక ఘటనలో యువత ప్రాణాలు కోల్పోవటంపై ప్రధానమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నేపాల్ పౌరులంతా శాంతి, ఐక్యత విలువలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
‘‘ఎక్స్’’ లోని పోస్టులో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
"హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం ఇవాళ నేపాల్ లోని ప్రస్తుత పరిస్థితులపై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీతో చర్చించాను. నేపాల్ లో హింసాత్మక ఘటనలు హృదయవిదారకరంగా ఉన్నాయి. ఆ ఘటనల్లో చాలా మంది యువత ప్రాణాలు కోల్పోయారన్న విషయం తీవ్రంగా బాధించింది. నేపాల్ స్థిరత్వం, శాంతి, శ్రేయస్సు చాలా ముఖ్యం. నేపాల్ సోదరీసోదరులంతా శాంతియుతంగా ఉండాలని కోరుతున్నాను."
 
***
                
                
                
                
                
                (Release ID: 2165188)
                Visitor Counter : 9
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam