ప్రధాన మంత్రి కార్యాలయం
సావిత్రీబాయి ఫులే అద్భుతమైన సేవలపై ఒక కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
05 SEP 2025 5:00PM by PIB Hyderabad
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సావిత్రీబాయి ఫూలే అందించిన అద్భుత సేవలను గుర్తు చేసుకుంటూ కేంద్ర మంత్రి శ్రీమతి సావిత్రీ ఠాకూర్ రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రజలతో నేడు పంచుకున్నారు.
కేంద్ర మంత్రి శ్రీమతి సావిత్రీ ఠాకూర్ ‘‘ఎక్స్’’లో ఉంచిన పోస్టుకు శ్రీ మోదీ స్పందించారు.
‘‘ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సావిత్రీబాయి ఫూలే గారి అసాధారణ సేవలను మంత్రి శ్రీమతి సావిత్రీ ఠాకూర్ గుర్తు చేశారు.
కేంద్ర మంత్రి చెప్పినట్లు.. సావిత్రీబాయి ఫూలే వారసత్వం ఇప్పటికీ మన దేశ ఆశయాలకు ప్రేరణగా నిలుస్తోంది. విద్యను ప్రాముఖ్యంగా పరిగణిస్తూ దేశ నిర్మాణంలో మహిళలను సమాన భాగస్వాములుగా సాధికారపరచడం వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది. ’’
(रिलीज़ आईडी: 2164304)
आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam