ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మధ్యతరగతి ప్రజలకు మద్దతు ఇవ్వడంలో ప్రభుత్వం తిరుగులేని నిబద్ధతను స్పష్టం చేసిన ప్రధానమంత్రి

Posted On: 04 SEP 2025 8:53PM by PIB Hyderabad

దేశ ఆర్థిక పురోగతికి, సామాజిక మార్పునకు చోదకశక్తిగా కొనసాగుతున్న భారతదేశ మధ్యతరగతికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం తిరుగులేని నిబద్ధతతో ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

చరిత్రాత్మక ఆదాయపు పన్ను తగ్గింపు పరంపరలో, తాజా జీఎస్టీ సంస్కరణలు టెలివిజన్లుఎయిర్ కండిషనర్లుఇంకా ఇతర రోజువారీ అవసరాలతో సహా ఇళ్లలో వాడే వస్తువులను లక్షలాది కుటుంబాలకు మరింత చౌకగా అందుబాటులోకి తెచ్చే లక్ష్యాన్ని కలిగి ఉన్నాయి.

సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో శ్రీ సునీల్ వాచాని చేసిన ఒక పోస్టుకు శ్రీ మోదీ స్పందిస్తూ, 'కష్టపడి పనిచేసే మధ్యతరగతి... మన వృద్ధి ప్రయాణానికి కేంద్ర బిందువుచరిత్రాత్మక ఆదాయ పన్ను తగ్గింపులుఇప్పుడు టీవీలుఏసీలుఇతర రోజువారీ అవసర వస్తువులను మరింత చౌకగా అందుబాటులోకి తెచ్చే తదుపరి తరం జీఎస్టీ సంస్కరణల ద్వారాజీవన సౌలభ్యాన్ని పెంచడానికి, కోట్లాది కుటుంబాల ఆకాంక్షలకు మద్దతు ఇవ్వడానికి మేం కట్టుబడి ఉన్నాం” అని పేర్కొన్నారు

 

(Release ID: 2164004) Visitor Counter : 2