ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు

ఉర్సులా వాన్ డెర్ లేయన్‌లతో సంయుక్త టెలిఫోన్ సంభాషణలో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

వాణిజ్యం, సాంకేతికత, పెట్టుబడి, ఆవిష్కరణ, సుస్థిరత, రక్షణ, భద్రత, సమర్థ సరఫరా వ్యవస్థ వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని స్వాగతించిన నేతలు

భారత్-ఈయూ ఎఫ్‌టీఏ చర్చల త్వరిత ముగింపు పట్ల నిబద్ధతను పునరుద్ఘాటించిన నేతలు

ఉక్రెయిన్‌ సంఘర్షణ ముగింపు ప్రయత్నాలపై అభిప్రాయాలు పంచుకున్న నేతలు

తదుపరి భారత్-ఈయూ శిఖరాగ్ర సమావేశం కోసం ఇరువురు నేతలను భారత్‌కు ఆహ్వానించిన ప్రధానమంత్రి

Posted On: 04 SEP 2025 6:29PM by PIB Hyderabad

యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు గౌరవనీయ ఆంటోనియో కోస్టాయూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు గౌరవనీయ ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌లతో ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా ఉభయులతోనూ మాట్లాడారు.

ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య శక్తులుగా భారత్-ఈయూలు నమ్మకంఉమ్మడి విలువలుభవిష్యత్తు పట్ల ఉమ్మడి దృక్పథం ఆధారంగా ఏర్పడిన బలమైనసన్నిహిత సంబంధాన్ని పంచుకుంటున్నాయిప్రపంచ సమస్యలను సంయుక్తంగా పరిష్కరించడంలోసుస్థిరతను పెంపొందించడంలోపరస్పర శ్రేయస్సు కోసం నియమాల ఆధారిత క్రమాన్ని ప్రోత్సహించడంలో భారత్-ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్య పాత్రను నేతలు ప్రధానంగా ప్రస్తావించారు.

వాణిజ్యంసాంకేతికతపెట్టుబడిఆవిష్కరణసుస్థిరతరక్షణభద్రతసమర్థ సరఫరా వ్యవస్థ వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని నేతలు స్వాగతించారుభారత్-ఈయూ ఎఫ్‌టీఏ చర్చలను త్వరగా ముగించడంఐఎమ్ఈఈసీ కారిడార్ అమలు పట్ల ఉమ్మడి నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు.

ఫిబ్రవరిలో ఈయూ కాలేజ్ ఆఫ్ కమిషనర్స్ చారిత్రాత్మక భారత పర్యటన ఆధారంగా.. పరస్పర సౌలభ్యం కోసం వీలైనంత త్వరగా భారత్‌లో తదుపరి భారత్-ఈయూ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడం గురించి నేతలు చర్చించారుప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇరువురు నేతలను ఈ సమావేశంలో పాల్గొనడం కోసం భారత్‌కు ఆహ్వానించారు.

ఉక్రెయిన్‌ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నాలు సహా పరస్పర ప్రయోజనకరమైన ప్రాంతీయప్రపంచస్థాయి అంశాలపై నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారువివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించడంశాంతి-సుస్థిరతలను త్వరగా పునరుద్ధరించడం కోసం భారత్ స్థిరమైన మద్దతును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.

సంప్రదింపులు కొనసాగించడానికి నేతలు అంగీకరించారు.

 

***


(Release ID: 2163925) Visitor Counter : 2