మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాలల సహ-స్థాపన మార్గదర్శకాలను రేపు ప్రకటించనున్న మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం
నాడు పోస్టు చేయడమైనది:
02 SEP 2025 3:23PM by PIB Hyderabad
అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలలతో కలిపి ఏర్పాటు చేయటంపై... మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎండబ్ల్యూసీడీ), పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం (డీఓఎస్ఈఎల్), విద్యా మంత్రిత్వ శాఖ సహకారంతో, మార్గదర్శకాలను రేపు (బుధవారం, సెప్టెంబర్ 3, 2025) న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రకటించనుంది.
ఈ కార్యక్రమానికి కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి, కేంద్ర విద్యా శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, ఎండబ్ల్యూసీడీ, డీఓఎస్ఈఎల్ ఉన్నతాధికారులు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సంబంధిత శాఖల ప్రతినిధులు, అంగన్వాడీ కార్యకర్తలు హాజరవుతారు.
వికసిత్ భారత్ కోసం మానవ వనరులతో పటిష్టమైన పునాదిని నిర్మించాలనే ప్రధానమంత్రి లక్ష్య సాధనలో ముందడుగుగా ఈ కార్యక్రమం నిలుస్తుంది. ఈ మార్గదర్శకాలు అంగన్వాడీలు, పాఠశాలలను ఒకేచోట ఏర్పాటు చేయటం వంటి సమీకృత నమూనాల ద్వారా చిన్నపిల్లల సంరక్షణ, విద్య (ఈసీసీఈ) ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. 2.9 లక్షలకు పైగా అంగన్వాడీ కేంద్రాలు ఇప్పటికే పాఠశాలలతో కలిపి ఏర్పాటు చేసినందున, ఈ మార్గదర్శకాలు వాటి నిర్వహణకు సంబంధించి స్పష్టతనిస్తాయి. తద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మార్గం సులువు అవుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2163164)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13