హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జమ్మూలో వర్షాల కారణంగా సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో పర్యటించి, ప్రకృతి విపత్తుల వల్ల జరిగిన నష్టాన్ని సమీక్షించిన కేంద్ర హోంశాఖ, సహకార మంత్రిత్వశాఖ మంత్రి శ్రీ అమిత్ షా


జమ్మూలోని చక్ మంగూ గ్రామంలో వరద బాధితులను కలుసుకుని, తావీ వంతెన, శివ మందిరం, వరదల కారణంగా దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించిన కేంద్రమంత్రి


కేంద్రమంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం, తాజా పరిస్థితిపై సమీక్ష

ఇటీవల జరిగిన ప్రకృతి విపత్తుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రీ అమిత్‌ షా సంతాపం

జమ్మూ కాశ్మీర్ ప్రజలకు మోదీ ప్రభుత్వం అండగా ఉంటుంది. వారికి తక్షణ సాయాన్ని,

ఆర్థిక సహాయాన్ని, సాంకేతిక మద్దతును అందించి, ప్రజల భద్రత, పునరావాసం, పునర్నిర్మాణానికి కృషి చేస్తోంది: శ్రీ అమిత్‌ షా

డేటా విశ్లేషణ, కృత్రిమ మేధస్సు ఆధారంగా మేఘ విస్ఫోటనాలకు గల కారణాలను గుర్తించేందుకు వాతావరణ శాఖ, ఎన్‌ఎమ్‌డీఏలు అధ్యయనం చేయాలని సూచన.

నష్టాన్ని అంచనా వేసి, అవసరమైన సహాయాన్ని అందించనున్న

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సర్వే బృందాలు

జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం, అన్ని సంస్థల సమన్వయం, కృషితో జరగబోయే భారీ నష్టాన్ని నివారించగలిగాం. అనేకమంది ప్రాణాలను రక్షించగలిగాం. అయితే వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది: కేంద్ర హోం మంత్రి

గ్లేషియల్ లేక్ అవుట్‌బర్స్ట్ ఫ్లడ్ ముందస్తు హెచ్చరిక వ్యవస్థపై విమర్శన

Posted On: 01 SEP 2025 5:28PM by PIB Hyderabad

జమ్మూలో భారీ వర్షాలువరదలుకొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను కేంద్ర హోంశాఖసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా పరిశీలించారుప్రకృతి విపత్తు కారణంగా జరిగిన నష్టాన్ని ఆయన సమీక్షించారుజమ్మూ జిల్లా మంగు చక్ గ్రామంలో వరద ప్రభావితులైన ప్రజలను కేంద్రమంత్రి కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారుఅనంతరం బిక్రమ్ చౌక్ వద్దనున్న తావి బ్రిడ్జ్శివాలయంవరదల వల్ల దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు.

జమ్మూలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర హోం మంత్రి ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారుఈ సమావేశంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హాముఖ్యమంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లాకేంద్రంకేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇటీవల ఘటనల్లో జరిగిన ప్రాణనష్టంపై కేంద్ర హోం మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారుఈ విషాదంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ లెఫ్టినెంట్ గవర్నర్ముఖ్యమంత్రితో మాట్లాడారనీఈ క్లిష్ట సమయంలో సహాయం అందించేందుకు కేంద్రం అన్ని చర్యలూ చేపట్టిందని శ్రీ అమిత్‌ షా తెలిపారుకేంద్ర పాలిత ప్రాంతంఅన్ని సంస్థలూ కలసి సమన్వయంతో పనిచేసిజరగబోయే నష్టాన్ని గణనీయంగా తగ్గించామనీఅనేక ప్రాణాలను రక్షించగలిగామనీ ఆయన పేర్కొన్నారు.

అన్ని ముందస్తు హెచ్చరిక యాప్‌లపై విశ్లేషణ చేయడంవాటి ఖచ్చితత్వంగ్రామీణ స్థాయిలో అవి ఎలా పనిచేస్తున్నదీ తెలుసుకోవడం అవసరమని శ్రీ అమిత్ షా అన్నారుకీలకమైన విశ్లేషణతో మన వ్యవస్థలను మెరుగుపరచడం వల్ల ప్రాణనష్టం జరగకుండా చూడవచ్చని ఆయన సూచించారుజీఎల్ఓఎఫ్ (గ్లేషియల్ లేక్ అవుట్‌బర్స్ట్ ఫ్లడ్ముందస్తు హెచ్చరిక వ్యవస్థపై కూడా సమగ్ర సమీక్ష అవసరమని పేర్కొన్నారు.

 

CR5_0116 (1).JPG

మేఘ విస్ఫోటనాలకు దారి తీసే ధోరణులుమేఘాల్లో తేమ శాతం మధ్య సంబంధాన్ని విశ్లేషించేందుకు వాతావరణ శాఖజాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సంయుక్తంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారుకారణాలను గుర్తించి ముందస్తు హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారుసమాచార విశ్లేషణకృత్రిమ మేధను ఉయోగించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ దిశగాచర్యలు తీసుకోవాలని ఆయన సూచించారుఅవసరమైన అదనపు రేషన్‌ను భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐసమకూర్చాలని కూడా ఆయన సూచించారుపరిస్థితిని 10 రోజుల్లోగా అంచనా వేసిఆ తర్వాత సాధారణ రేషన్ పంపిణీపై నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.

CR5_0172.JPG

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అధునాతన సర్వే బృందాలు నష్టాన్ని అంచనా వేసి అవసరమైన సహయాన్ని అందిస్తాయని శ్రీ అమిత్ షా తెలిపారు.. కేంద్ర హోం కార్యదర్శితో పాటు కేంద్ర ప్రభుత్వంకేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన సంబంధిత విభాగాల సమావేశం 1, 2 రోజుల్లో జరుగుతుందని తెలిపారుహోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వం నుంచి వచ్చిన బృందాలు నష్టాన్ని అంచనా వేసేందుకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర హోం మంత్రి ఆదేశించారుఆరోగ్యజలవనరుల శాఖలు నీటి సరఫరాఆరోగ్య సేవలపై ముందస్తుగా దృష్టి సారించాలన్నారుసైన్యంకేంద్ర సాయుధ పోలీసు దళాలువైమానిక దళం నుంచి వైద్య విభాగాలు కూడా సాయాన్ని అందించాలని తెలిపారు.

జమ్మూ కాశ్మీర్ సాధారణంగానే ప్రకృతి వైపరీత్యాలు సంభవించే ప్రాంతం కావడంతో కేంద్ర వాటాగా రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి కోసం రూ. 209 కోట్ల మొత్తాన్ని ఈ ప్రాంతానికి కేటాయించామనివీటి ద్వారానే సహాయ చర్యలు కొనసాగుతున్నాయని కేంద్ర హోం మంత్రి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వంకేంద్ర పాలిత ప్రాంత విపత్తు నిర్వహణ సంస్థ సకాలంలో హెచ్చరికలు జారీ చేయడం వల్ల ప్రాణనష్టం గణనీయంగా తగ్గిందని కేంద్ర హోం మంత్రి అన్నారుజాతీయ విపత్తు ప్రతిస్పందన దళంభద్రతా బలగాలుకేంద్ర పాలిత ప్రాంతాల విపత్తు ప్రతిస్పందన దళం ఇతర ప్రతిస్పందన బృందాలన్నీ అప్రమత్తంగా ఉన్నాయనిహెలికాప్టర్లు కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారుఅలాగే ఆర్మీఎన్డీఆర్‌ఎఫ్‌ మోహరింపునకు సంబంధించి ముందుగానే అందరికి సమాచారం కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ప్రజల ఆస్తులు దెబ్బతిన్నాయనినష్టపోయిన ఇళ్లకు రాష్ట్ర విపత్తు స్పందన నిధి కింద చేయాల్సిన సహాయాన్ని అంచనా వేసివీలైనంత త్వరగా చెల్లిస్తామని శ్రీ అమిత్‌ షా వెల్లడించారుఅనేక రోడ్లు దెబ్బతినగా.. వాటి మరమ్మత్తుపునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారుచాలా రహదారులపై వాహన రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయనిఅవసరమైన చోట్ల సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారుప్రభావిత ప్రాంతాల్లో 80 శాతానికి పైగా విద్యుత్ సరఫరాని పునరుద్ధరించినట్లు తెలిపారుప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నారనిఆరోగ్య సేవలు సజావుగా కొనసాగుతున్నాయన్నారుఅత్యంత కీలక విభాగాల్లో మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నప్పటికీవాటి తాత్కాలిక పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారుజరిగిన నష్టాలను రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోందనికేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం అందిస్తుందని హామీ ఇచ్చారు.

 

CR5_0199.JPG

ఈ క్లిష్ట సమయంలో స్పందించడంతోపాటుఅన్ని సంస్థలూ చేస్తున్న ప్రయత్నాలను కేంద్రమంత్రి ప్రశంసించారుసహాయక చర్యలను జమ్మూ ప్రభుత్వం సమర్ధవంతంగా నిర్వహించిందని చెప్పారుముందు జాగ్రత్తగా 5000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారుఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన 17 బృందాలు, 23 ఆర్మీ బృందాలుభారత వైమానిక దళంయూటీడీఆర్‌ఎఫ్‌జమ్మూ కాశ్మీర్‌ పోలీసులుకేంద్ర సాయుధ పోలీసు దళాలు ఇప్పటికీ సహాయక చర్యల్లో నిమగ్నమై ప్రజలకు సహాయం అందిస్తున్నాయని తెలిపారుసహాయ శిబిరాల్లో జమ్మూ ప్రభుత్వం ఆరోగ్య సేవలుఆహార ఏర్పాట్లు చేసిందనిత్వరలోనే పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని కేంద్ర హోం మంత్రి ప్రజలకు హామీ ఇచ్చారు.

ఈ సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ప్రజలకు అండగా నిలుస్తుందని శ్రీ అమిత్‌ షా పునరుద్ఘాటించారుప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ప్రజలకు అండగా నిలిచి వారి తక్షణ ఉపశమనంఆర్థిక సహాయంసాంకేతిక సహాయాన్ని అందిస్తుందని తెలిపారుబాధిత ప్రజల భద్రతసంక్షేమానికి భరోసా ఇవ్వడంతోపాటు పునరుద్ధరణపునర్నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

***


(Release ID: 2162925) Visitor Counter : 2