కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
అమెరికాకు మెయిల్ బుకింగ్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన తపాలా శాఖ
प्रविष्टि तिथि:
31 AUG 2025 9:15AM by PIB Hyderabad
ఈ నెల 22న విడుదల చేసిన పబ్లిక్ నోటీసుకు కొనసాగింపుగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు మెయిల్ బుకింగ్ నిలిపివేత నిర్ణయాన్ని తపాలా శాఖ సమీక్షించింది.
అమెరికాకు పంపే మెయిల్‌లను రవాణా చేయడానికి రవాణా సంస్థలు అశక్తత వ్యక్తం చేయడం.. నిర్ధిష్ట నియంత్రణ యత్రాంగాలు అందుబాటులో లేని క్రమంలో అమెరికాకు పంపే ఉత్తరాలు, పత్రాలు, 100 డాలర్ల వరకు విలువ గల కానుకలు సహా అన్ని రకాల మెయిల్ బుకింగ్ పూర్తిగా నిలిపివేయాలని తపాలా శాఖ నిర్ణయించింది.
పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ.. వీలైనంత త్వరగా సేవలను పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వస్తువులను బుక్ చేసుకున్న, పంపలేకపోయిన వినియోగదారులు తపాలా ఖర్చులను తిరిగి పొందే సదుపాయం కల్పించింది.
విలువైన వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తపాలా శాఖ ప్రకటించింది.
(रिलीज़ आईडी: 2162554)
आगंतुक पटल : 6