ప్రధాన మంత్రి కార్యాలయం
టియాంజిన్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశంలో ప్రధానమంత్రి వ్యాఖ్యలు
Posted On:
31 AUG 2025 11:06AM by PIB Hyderabad
గౌరవనీయులారా,
మీ ఆత్మీయ స్వాగతానికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గతేడాది కజన్‌లో మన చర్చలు ఇరుదేశాల సంబంధాలకు సానుకూల దిశానిర్దేశం చేశాయి. సరిహద్దు వద్ద శాంతి, స్థిరత్వం నెలకొన్నాయి. సరిహద్దు నిర్వహణ పట్ల ఇరుదేశాల ప్రతినిధులు ఒక అవగాహనకు వచ్చారు. కైలాస్ మానససరోవర్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. రెండు దేశాల మధ్య నేరుగా విమాన సేవలు కూడా ప్రారంభంకానున్నాయి. ఇరుదేశాల మధ్య సహకారం 2.8 బిలియన్ల మంది ప్రజల ప్రయోజనాలతో ముడిపడి ఉంది. ఇది మొత్తం మానవాళి సంక్షేమానికి కూడా మార్గం సుగమం చేస్తుంది. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వంతో ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం.
గౌరవనీయులారా,
ఎస్‌సీవో సదస్సుకు విజయవంతంగా అధ్యక్షత వహించిన చైనాకు నా హృదయపూర్వక అభినందనలు. చైనా సందర్శనకు, నేటి సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
***
(Release ID: 2162553)
Visitor Counter : 2
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Bengali-TR
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada