ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని సనంద్‌లో మొదటి సమగ్ర ఓఎస్ఏటీ పైలట్ లైన్ పరిశ్రమ ప్రారంభం భారత సెమీకండక్టర్ ప్రయాణంలో ప్రధాన విజయం


* 2032 నాటికి ప్రపంచంలో పది లక్షల మంది సెమీకండక్టర్ల నిపుణుల కొరత
ఈ అంతరాన్ని తగ్గించడానికి భారత్ సిద్ధంగా ఉంది: శ్రీ అశ్వనీ వైష్ణవ్

* భారత్‌ను అంతర్జాతీయ సెమీకండక్టర్ హబ్‌గా మార్చడంలో గుజరాత్ రాష్ట్రానిది కీలకపాత్ర: శ్రీ అశ్వనీ వైష్ణవ్

* విశ్వవిద్యాలయాలకు అత్యాధునిక పరికరాలు... ఎస్‌సీఎల్ మొహాలీలో విద్యార్థులు రూపొందించిన 20 చిప్‌ల తయారీ: కేంద్ర మంత్రి వైష్ణవ్

Posted On: 28 AUG 2025 7:56PM by PIB Hyderabad

గుజరాత్ రాష్ట్రంలోని సనంద్‌లో భారత్‌లోనే పూర్తి స్థాయిలో తయారయ్యే మొదటి సెమీ కండక్టర్ ఓఎస్ఏటీ పైలట్ లైన్ పరిశ్రమను గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్‌తో కలసి కేంద్ర ఎలక్ట్రానిక్స్ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ ప్రారంభించారుఇది సీజీ పవర్‌కు చెందిన సంస్థప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌లో సెమీకండక్టర్ల చారిత్రక ప్రయాణ ఆరంభాన్ని ఈ కార్యక్రమం సూచిస్తుంది.

 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సెమీ కండక్టర్ డిజైన్తయారీక్షేత్రస్థాయిలో సామర్థ్యాలను అభివృద్ధి చేయాలనే భారత్ లక్ష్యాన్ని చేరుకొనే దిశగా.. పైలట్ లైన్ ప్రారంభం నిర్ణయాత్మక అడుగును సూచిస్తుందని పేర్కొన్నారుఈ పరివర్తనలో గుజరాత్ ప్రధాన కేంద్రంగా అవతరిస్తుందని చెప్పారుఓఎస్ఏటీ పైలట్ లైన్‌కున్న కీలకమైన పాత్రను వివరిస్తూ.. ఇక్కడ తయారు చేసిన చిప్‌లను వినియోగదారుల ఆమోదం కోసం పరీక్షిస్తారని శ్రీ వైష్ణవ్ వెల్లడించారుఆమోదం పొందిన చిప్‌లను వాణిజ్య ప్లాంట్ల కోసం పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయడం సులభతరమవుతుందిఇప్పటి వరకు పది ప్రాజెక్టులను ఆమోదించిన ఇండియా సెమీకండక్టర్ మిషన్ కార్యక్రమం ద్వారా సాధించిన గణనీయమైన విజయాల్లో ఈ ప్రారంభం కూడా ఒకటి.

ప్రతిభా సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాల్సిన ప్రాధాన్యతను తెలియజేస్తూ.. అంతర్జాతీయంగా అవసరమైన నిపుణులను తయారు చేయడమే ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రధాన ఆశయాల్లో ఒకటి అని మంత్రి తెలియజేశారు. 2032 నాటికిఒక మిలియన్ సెమీకండక్టర్ నిపుణుల కొరతను ప్రపంచం ఎదుర్కొంటుందనిఈ అంతరంలో తగ్గించే అవకాశం భారత్‌కు ఉందని పేర్కొన్నారు.

ఇప్పటి వరకుప్రభుత్వం 270 విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం కుదుర్చుకుందిఅత్యాధునిక సెమీ కండక్టర్ డిజైన్ పరికరాలను సమకూర్చింది. 2025లోనే ఈ పరికరాలను సుమారుగా 1.2 కోట్ల సార్లు ఉపయోగించారుఫలితంగా.. 17 సంస్థలు అభివృద్ధి చేసిన 20 చిప్‌లను మొహాలీలోని సెమీ-కండక్టర్ ల్యాబరేటరీ (ఎస్‌సీఎల్)లో విజయవవంతంగా తయారు చేస్తున్నారు.

ప్రపంచంలో అతి తక్కువ దేశాలు మాత్రమే ఇలాంటి అత్యాధునిక పరికరాలను విద్యార్థులకు అందిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారుఇది భారతీయ యువతకు సాధికారత కల్పిస్తుందనిసాంకేతిక వ్యవస్థను బలోపేతం చేస్తుందనిసెమీకండక్టర్ ప్రతిభలో అంతర్జాతీయ కేంద్రంగా దేశాన్ని నిలబెడుతుందని పేర్కొన్నారుగుజరాత్‌లో సెమీ కండక్టర్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వంముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్ అందిస్తున్న బలమైన తోడ్పాటును కూడా ఆయన గుర్తించారు.

సెమీ కండక్టర్ డిజైన్తయారీలో దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడంలో ఈ కార్యక్రమం పోషించే పాత్రను ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ ప్రశంసించారురాష్ట్ర పరిశ్రమల మంత్రి శ్రీ బలావత్ సింగ్ రాజ్‌పుత్ఎంఎల్ఏ శ్రీ కన్హుభాయ్ పటేల్పరిశ్రమలుఐటీ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులుసీజీ సెమీ సారథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

సీజీ సెమీ ఓఎస్ఏటీ ఫెసిలిటీ గురించి

గుజరాత్‌లోని సనంద్‌లో ఏర్పాటు చేసిన సీజీ సెమీ ఫెసిలిటీ భారత్‌ భూభాగంలోనే పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించే మొదటి అవుట్‌సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ (ఓఎస్ఏటీప్లాంట్ఇది చిప్ అసెంబ్లీప్యాకేజింగ్టెస్టింగ్పోస్ట్-టెస్ట్ సేవలుసంప్రదాయఆధునిక ప్యాకేజింగ్ సాంకేతికతలకు పూర్తి స్థాయి పరిష్కారాన్ని అందిస్తుందిఇది భారత్‌లో సెమీకండక్టర్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికిస్వయం సమృద్ధి సాధించాలన్న దేశం లక్ష్యానికి మద్దతు ఇస్తుందిఅలాగే అంతర్జాతీయ మార్కెట్ల అవసరాలను తీరుస్తుంది.

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతో.. సీజీ సెమీ రూ.7,600 కోట్లకు పైగా (దాదాపుగా 870 మిలియన్ అమెరికన్ డాలర్లుపెట్టుబడి పెడుతోందిగుజరాత్‌లోని సనంద్‌లో రెండు అత్యాధునిక పరిశ్రమ (జీ1, జీ2)లను అయిదేళ్లలో అభివృద్ధి చేస్తుంది.

ఈ రోజు ప్రారంభమైన జీపరిశ్రమకు రోజుకి 0.5 మిలియన్ యూనిట్లను తయారు చేసే సామర్థ్యం ఉందిఇది చిప్ అసెంబ్లీప్యాకేజింగ్టెస్టింగ్పోస్ట్ టెస్ట్ సేవలను పూర్తి స్థాయిలో అందిస్తుందిఅత్యధిక సామర్థ్యం ఉన్న పరికరాలులెవెల్ ఆటోమేషన్ట్రేసబిలిటీ కోసం అత్యాధునిక మ్యానుఫాక్చరింగ్ ఎగ్జిక్యూషన్ సిస్టమ్ (ఎంఈఎస్), విశ్వసనీయతవైఫల్యాలను విశ్లేషించడానికి అంతర్గత ప్రయోగశాలలు ఈ పరిశ్రమలో ఉన్నాయిప్రస్తుతం ఐఎస్ఓ 9001, ఏఐటీఎఫ్ 16949 ధ్రువీకరణ పొందే దశలో ఉందికార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత వివిధ ప్యాకేజీలను వినియోగదారులు పరీక్షిస్తారుఐఎస్ఎం పట్ల అంకితభావాన్ని ప్రదర్శిస్తూ.. 2026 క్యాలెండర్ సంవత్సరం నుంచి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించాలని సీజీ సెమీ ప్రయత్నిస్తోంది.

జీ1కు మూడు కి.మీదూరంలో నిర్మాణ దశలో ఉన్న జీపరిశ్రమ 2026 క్యాలెండర్ సంవత్సరం చివరి నాటికి ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారుజీ2లో కార్యకలాపాలు ప్రారంభమైతే.. ఈ సామర్థ్యం రోజుకు దాదాపుగా 14.5 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుందిఈ రెండూ కలసి భవిష్యత్తులో 5,000కు పైగా ప్రత్యక్షపరోక్ష ఉద్యోగాలు కల్పిస్తాయి.

ప్రారంభ కార్యక్రమంలో సీజీ పవర్ చైర్మన్ శ్రీ వెల్లాయన్ సుబ్బయ్య మాట్లాడుతూ.. ‘‘ఈ విజయం నాకు లేదా సీజీ సెమీకి చెందినది మాత్రమే కాదు.. ఇది జాతీయ విజయంగౌరవ ప్రధానమంత్రి నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడంలో దృఢ సంకల్పంపెట్టుబడితో ప్రభుత్వంపరిశ్రమ ఎలా కలసి ముందుకు రాగలవో ఇది చూపిస్తుందిఇక్కడ మనం తయారు చేసే ప్రతి చిప్ భారత దేశ సాంకేతిక సార్వభౌమత్వం దిశగా వేసే అడుగే’’ అని అన్నారు.

ఓఎస్ఏటీ నిర్మాణంనిర్వహణ కోసం ఈ రంగంలో వెయ్యేళ్లకు పైగా అనుభవం ఉన్న దిగ్గజాలందరినీ సీజీ సెమీ ఒక్క చోట చేర్చిందిభారతీయ ఇంజినీర్లుఆపరేటర్లుటెక్నీషియన్లను మూడు నెలల శిక్షణ కోసం మలేషియా పంపించడం ద్వారా నైపుణ్యాభివృద్ధిలోనూ సంస్థ పురోగతి సాధించిందిఇది కార్యకలాపాలను విస్తరించడంలో వేగవంతమైన అభ్యాసాన్నిసంసిద్ధతను తెలియజేస్తుంది.

ఈ ప్రారంభంతో.. ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్నిభారతీయ సెమీ కండక్టర్ వ్యవస్థను బలోపేతం చేయడంలో సీజీ సెమీ కీలక పాత్ర పోషిస్తుంది.

సీజీ సెమీ గురించి

సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ (మురగప్ప గ్రూప్), రెనెసస్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ (అంతర్జాతీయ సెమీ కండక్టర్ సంస్థ), స్టార్స్ మైక్రోఎలక్ట్రానిక్స్ (థాయ్‌లాండ్ కేంద్రంగా పనిచేసే ఓఎస్ఏటీఈఎంఎస్ సంస్థసంయుక్తంగా ఏర్పాటు చేసిన వెంచర్ సీజీ సెమీగుజరాత్‌లోని సనంద్ ప్రధాన కేంద్రంగా పని చేసే సీజీ సెమీ.. సెమీకండక్టర్ అసెంబ్లీపరీక్షలతో పాటు ఎస్ఓఐసీక్యూఎఫ్‌పీక్యూఎఫ్ఎన్బీజీఏఎఫ్‌సీక్యూఎఫ్ఎన్ఎఫ్‌సీబీజీఏ లాంటి అధునాతనసంప్రదాయ ప్యాకేజీలకు సమగ్ర పరిష్కారాలను అందిస్తుందిఆటోమోటివ్రక్షణమౌలిక వసతులుఐవోటీ లాంటి రంగాల్లో విభిన్న అప్లికేషన్లను అందిస్తుంది.

 

***


(Release ID: 2162037) Visitor Counter : 11