ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం

Posted On: 25 AUG 2025 10:35PM by PIB Hyderabad

భారత్ మాతా కీ జై

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

ఎంతటి అద్భుత వాతావరణాన్ని ఈ రోజు మీరంతా సృష్టించారు!

గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ గారుముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ గారుకేంద్ర కేబినెట్‌లో సహచరుడు సి.ఆర్పాటిల్ గారుగుజరాత్ ప్రభుత్వంలోని మంత్రులుఅహ్మదాబాద్ మేయర్ ప్రతిభ గారుఇతర ప్రజా ప్రతినిధులుఅహ్మదాబాద్ సోదరీ సోదరులారా!

ఈ రోజు మీరంతా నిజంగా ఓ అద్భుత వాతావరణాన్ని సృష్టించారునేను చాలాసార్లు అనుకుంటాను.. ఈ లక్షలాది ప్రజల ప్రేమాశీస్సులను పొందిన నేను ఎంత అదృష్టవంతుడినో కదా అనినేను మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోదుచూడండీ.. ఓ చిన్న నరేంద్ర అక్కడ నిలబడి ఉన్నాడు!

మిత్రులారా,

ప్రస్తుతం గణేశోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా అద్భుతమైన కోలాహలం నెలకొందిగుజరాత్ అభివృద్ధికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు గణపతి బప్పా ఆశీస్సులతో నేడు శుభప్రదంగా ప్రారంభమవుతున్నాయిఈ రోజు అనేక అభివృద్ధి ప్రాజెక్టులను మీకు అంకితం చేసే అవకాశం లభించడం నా అదృష్టంఈ అభివృద్ధి పనుల సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు.

మిత్రులారా,

ఈ వర్షాకాలంలో గుజరాత్‌లోని అనేక ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయిదేశవ్యాప్తంగా ఒకదాని వెనుక ఒకటిగా మేఘ విస్ఫోట ఘటనలను చూస్తున్నాంఅలాంటి విధ్వంసకర దృశ్యాలను టీవీలో చూసినప్పుడు మనం స్థిమితపడడం కూడా కష్టమవుతుందిబాధిత కుటుంబాలన్నింటికీ నా ప్రగాఢ సానుభూతిఈ ప్రకృతి ఉగ్రత మానవాళి మొత్తానికియావత్ప్రపంచానికిమన దేశానికి సవాలుగా మారిందిఅన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం సహాయక చర్యల్లో పూర్తిగా నిమగ్నమైంది.

మిత్రులారా,

ఈ గుజరాత్ నేల ఇద్దరు మోహనులకు నిలయంఒకరు సుదర్శన చక్రధారి మోహనుడుమన ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడుమరొకరు చరఖాధారి మోహనుడు... సబర్మతీ మహర్షిపూజ్య బాపూజీవారిద్దరూ చూపిన మార్గాన్ని అనుసరిస్తూ భారత్ నేడు మరింత బలంగా ఎదుగుతుతోందిదేశాన్నిసమాజాన్ని ఎలా రక్షించుకోవాలో సుదర్శన చక్రధారి మోహనుడు మనకు నేర్పాడుపాతాళంలో ఉన్నా శత్రువును వేటాడి శిక్షించే సుదర్శన చక్రాన్ని న్యాయానికీ భద్రతకూ కవచంగా ఆయన నిలిపాడుఅదే స్ఫూర్తి నేడు భారత్ నిర్ణయాల్లో ప్రతిబింబిస్తోందిభారత్‌తోపాటు ప్రపంచమంతా దీన్ని గుర్తిస్తోందిమన గుజరాత్అహ్మదాబాద్ గతంలో ఎన్నో గడ్డు రోజులను ఎదుర్కొన్నాయిపతంగుల పోటీల్లో అల్లరిమూకలు ప్రాణాలను బలిగొన్న సమయాలుప్రజలు కర్ఫ్యూలో బతకాల్సి వచ్చిన రోజులుపండుగ పూట ఈ అహ్మదాబాద్ నేల రక్తంతో తడిసిన సందర్భాలు... ఇలా ఎన్నో ఘటనలను మనం చూశాంఈ దురాక్రమణదారులు మన రక్తాన్ని చిందించారుకానీఢిల్లీలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదుకానీ నేడు ఉగ్రవాదులుఉగ్రవాద సూత్రధారులు ఎక్కడ దాక్కున్నా మేం వదిలిపెట్టడం లేదుపహల్గామ్ ఘటనకు భారత్ ఎలా బదులిచ్చిందో ప్రపంచమంతా చూసిందికేవలం 22 నిమిషాల్లోనే అంతా తుడిచిపెట్టుకుపోయిందిలోపలికి చొచ్చుకెళ్లి బలంగా దెబ్బతీయడంవందల కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత లక్ష్యాలను కచ్చితంగా ఛేదించడం ద్వారా.. ఉగ్రవాద నాడీ కేంద్రంపై మేం దాడిచేశాంమన సాయుధ దళాల శౌర్యానికిసుదర్శన చక్రధారి మోహనుడి భారత ‘ఇచ్ఛాశక్తి’కి ఆపరేషన్ సిందూర్ ప్రతీకగా నిలిచింది.

మిత్రులారా,

చరఖాధారి మోహనుడైన మన పూజ్య బాపూజీ ‘స్వదేశీ’ ద్వారా భారత శ్రేయస్సుకు బాటలు వేశారుఇక్కడే సబర్మతీ ఆశ్రమం ఉందిబాపూజీ పేరుతో దశాబ్దాల పాటు అధికారాన్ని అనుభవించిన పార్టీ ఆయన ఆశయాలను తుంగలో తొక్కిందనడానికి ఈ ఆశ్రమమే సాక్షిబాపూజీ మంత్రప్రదంగా భావించిన ‘స్వదేశీ’తో వారు చేసిందేమిటికొన్నేళ్లుగా గాంధీ పేరుతో రాజకీయాలు నడుపుతున్నవారుస్వచ్ఛత గురించిగానీస్వదేశీ గురించిగానీ ఒక్క మాటైనా మాట్లాడడాన్ని మీరుచూసి ఉండరువారి దూరదృష్టి ఏమయిందో దేశానికి అర్థం కావడం లేదుఅరవై నుంచి అరవై అయిదేళ్లపాటు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్... అధికారంలో ఉన్నప్పుడు దిగుమతుల్లో ఇష్టారీతిన వ్యవహరిస్తూ కుంభకోణాలకు పాల్పడేందుకు వీలుగాభారత్‌ను ఇతర దేశాలపై ఆధారపడేలా చేసిందికానీ నేడు మన దేశం ‘ఆత్మనిర్భరత’ను ‘వికసిత భారత్’ నిర్మాణానికి పునాదిగా మలచుకుందిమన రైతులుమన మత్స్యకారులుమన పశుపోషకులుమన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల బలంతో.. అభివృద్ధి పథంలోస్వావలంబన మార్గంలో భారత్ వేగంగా పురోగమిస్తోందిగుజరాత్‌లో ఎంతమంది పశుపోషకులున్నారో చూడండి.. పాడి పరిశ్రమ ఎంత బలంగా ఉందో చూడండి..! కొన్ని గంటల కిందటే ఫిజీ ప్రధానమంత్రిని నేను కలిశానుతమ పాడి పరిశ్రమ రంగాన్నిసహకార ఉద్యమాన్ని మనలాగే అభివృద్ధి చేసుకోవాలని భావిస్తున్నట్టు ఎంతో గౌరవంతోశ్రద్ధాసక్తులతో ఆయన చెప్పారుమిత్రులారామన పాడి పరిశ్రమను బలోపేతం చేసింది మన పశుపోషకులేఅందులోనూ మన అక్కాచెల్లెళ్లు ఎనలేని కృషి చేశారుమన అక్కాచెల్లెళ్లు అంకితభావంతో పాడి పరిశ్రమను బలంగాస్వయం సమృద్ధంగా తీర్చిదిద్దారునేడు దీన్ని ప్రపంచమంతా కీర్తిస్తోంది.

కానీ మిత్రులారా,

స్వీయ ఆర్థిక ప్రయోజనాలే కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు నడుస్తున్న తీరును మనం స్పష్టంగా చూడొచ్చుప్రతి ఒక్కరూ తమ సొంత ఎజెండాను అమలు చేయడంలో తలమునకలై ఉన్నారుఈ అహ్మదాబాద్ గడ్డ నుంచినా ఔత్సాహిక చిన్న వ్యాపారవేత్తలకుదుకాణదారు సోదరీసోదరులకురైతు సోదరులకుపశుపోషకులైన అన్నాతమ్ముళ్లూ అక్కాచెల్లెళ్లకూ నేను చెబుతున్నాను... గాంధీ నడయాడిన ఈ నేల నుంచిచిన్న పారిశ్రామికవేత్తలురైతులుపశుపోషకులకు చెబుతున్నాను... మీలో ప్రతి ఒక్కరికీ పదే పదే నేను హామీ ఇస్తున్నానుమోదీకి మీ ప్రయోజనాలే అత్యున్నతంచిరు వ్యాపారులురైతులుపశువుల పెంపకందారులకు హాని కలిగించే ఎలాంటి చర్యలనైనా నా ప్రభుత్వం ఎప్పటికీ అనుమతించబోదుఎంత తీవ్రమయినా ఒత్తిడినైనా తట్టుకుని నిలిచేలా మన సామర్థ్యాన్నిబలాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటాం.

మిత్రులారా,

నేడు ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’కు గుజరాత్ గొప్పగా ఊతమిస్తోందిదీని వెనుక రెండు దశాబ్దాల కృషి ఉందిదాదాపు ప్రతిరోజూ ఇక్కడ కర్ఫ్యూ విధించిన రోజులను నేటి యువతరం చూడలేదువర్తక వ్యాపారాలు చేయడానికి కష్టతరమైన పరిస్థితి ఉండేదిఅశాంతి వాతావరణం నెలకొని ఉండేదికానీ నేడు భారత్‌లో అత్యంత సురక్షిత నగరాల్లో అహ్మదాబాద్ ఒకటిమీ అందరి కృషి వల్లే ఇది సాధ్యమైంది.

మిత్రులారా,

గుజరాత్‌లో ఏర్పడిన శాంతి భద్రతల వాతావరణం అన్ని విధాలా మనకు సానుకూల ఫలితాలనిస్తోందినేడు గుజరాత్ గడ్డపై అన్ని రకాల పరిశ్రమలూ విస్తరిస్తున్నాయిమన గుజరాత్ తయారీ కేంద్రంగా నిలుస్తుండడాన్ని చూసి యావత్‌రాష్ట్రమూ గర్విస్తోందిమీరంతాముఖ్యంగా ఇక్కడున్న అన్నాతమ్ముళ్లూ అక్కాచెల్లెళ్లూ తప్పక తెలుసుకోవాలిప్రత్యేక గుజరాత్ కోసం ‘మహా గుజరాత్ ఉద్యమం’ ఉద్యమం జరుగుతున్న సమయంలో చాలా మంది మమ్మల్నిలా అడిగారు – ‘‘మీరు ప్రత్యేక గుజరాత్‌ను ఎందుకు కోరుకుంటున్నారుఆకలితో నలిగిపోతారుఏముంది మీకు – ఖనిజాలూ లేవుజీవనదులూ లేవుపదేళ్లలో ఏడు సంవత్సరాలు కరువుతోనే గడుస్తాయిగనుల్లేవుపరిశ్రమల్లేవువ్యవసాయం కూడా పెద్దగా లేదుఓ వైపు రాన్మరోపక్క పాకిస్థాన్ ఉన్నాయిఏం చేస్తారు మీరు?’’ అని అడిగేవారు. ‘‘ఉప్పు తప్ప మీ దగ్గర ఇంకేమీ లేదు’’ అంటూ వారు ఎగతాళి చేశారుకానీసొంత కాళ్ళ మీద నిలబడాల్సిన గొప్ప బాధ్యత గుజరాత్‌పై పడినప్పుడు ఇక్కడి ప్రజలు వెనుకడుగు వేయలేదుఒకప్పుడు గుజరాత్‌లో ఏముందని అడిగిన వారికి నేడు స్పష్టంగా కనిపిస్తోంది – ఒక్క వజ్రాల గని కూడా ఇక్కడ లేకపోయుండొచ్చుకానీప్రపంచంలోని ప్రతీ పది వజ్రాల్లో తొమ్మిదింటి ప్రాసెసింగ్శుద్ధి గుజరాత్‌లోనే జరుగుతోంది.

మిత్రులారా,

కొన్ని నెలల కిందట నేను దాహోద్‌కు వచ్చానుఅక్కడి రైల్వే ఫ్యాక్టరీలో శక్తిమంతమైన ఎలక్ట్రిక్ రైలింజిన్లు తయారవుతున్నాయినేడు గుజరాత్‌లో తయారైన మెట్రో కోచ్‌లు ఇతర దేశాలకూ ఎగుమతి అవుతున్నాయిఇవే కాకుండామోటార్ సైకిళ్ళయినాకార్లయినా... వాటిని చాలా పెద్ద సంఖ్యలో గుజరాత్ ఉత్పత్తి చేస్తోందిదేశంలోనిప్రపంచంలోని పెద్ద కంపెనీలు ఇక్కడ కర్మాగారాలను నెలకొల్పుతున్నాయిగుజరాత్ అప్పటికే విమానాలకు చెందిన వివిధ భాగాలను తయారుచేసి ఎగుమతి చేస్తోందిఇప్పుడు వడోదరలో రవాణా విమానాల తయారీ కూడా మొదలైందిగుజరాత్‌లోనే విమానాలు తయారవుతున్నాయిఇది మనకు గర్వకారణం కాదాఇప్పుడు గుజరాత్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి కూడా ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందిరేపు 26వ తేదీన నేను హన్సల్‌పూర్‌కు వెళ్తున్నానుఅక్కడ ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సంబంధించిన ఓ పెద్ద కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నానునేడు సెమీకండక్టర్లు లేకుండా ఆధునిక ఎలక్ట్రిక్ పరికరాలేవీ తయారు చేయలేముగుజరాత్ ఇప్పుడు సెమీకండక్టర్ రంగంలోనూ గొప్ప పేరు తెచ్చుకోబోతున్నదిజౌళిరత్నాలుఆభరణాలు ఇప్పటికే గుజరాత్‌కు విశేష గుర్తింపును తెచ్చాయిఔషధాలువ్యాక్సిన్ల విషయానికొస్తే.. భారత్ నుంచి జరుగుతున్న మొత్తం ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల్లో మూడోవంతు వాటా గుజరాత్‌దే.

మిత్రులారా,

సౌరపవనఅణు ఇంధన రంగాల్లో భారత్ నేడు వేగంగా ముందుకు సాగుతోందిఈ పురోగతికి గుజరాత్ విశేష సహకారాన్ని అందిస్తోందిఇప్పుడేవిమానాశ్రయం నుంచి వస్తుండగా ఓ గొప్ప రోడ్ షో నిర్వహించారు నిజంగా అద్భుతంగా ఉందిమీరంతా అద్భుతాలు చేశారురోడ్‌షో అద్భుతంగా ఉందిప్రజలంతా ఇళ్ల పైకప్పులపైనాబాల్కనీల్లోనూ నిలబడి ఉన్నారుసహజంగానే నేను వారందరినీ గౌరవంగా పలకరిస్తూ వస్తున్నానుఅయితే పరిసరాలను గమనిస్తుండగా చాలా ఇళ్ల పైకప్పులపై సోలార్ రూఫ్‌టాప్ విద్యుత్ ప్లాంట్లు కనిపించాయిపర్యావరణ హిత ఇంధనంపెట్రోకెమికల్స్‌లోనూ గుజరాత్ ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందిదేశ పెట్రోకెమికల్ అవసరాలను తీర్చడంలో గుజరాత్ విశేష పాత్ర పోషిస్తోందిమన ప్లాస్టిక్ పరిశ్రమసింథటిక్ ఫైబర్ఎరువులుఔషధాలుపెయింట్ పరిశ్రమసౌందర్య సాధనాలు ఇవన్నీ ఎక్కువగా పెట్రోకెమికల్ రంగంపైనే ఆధారపడి ఉన్నాయిగుజరాత్‌లో పాత పరిశ్రమలు విస్తరిస్తున్నాయిఒకప్పుడు ప్రజలు ఎప్పుడూ దుఃఖంతోనే ఉన్న రోజులు నాకింకా గుర్తున్నాయి. 30 ఏళ్ల కిందటి పరిస్థితి గుర్తున్నవారికి ప్రజలు ఎందుకంతలా బాధలు పడ్డారో తెలుసు: ‘‘మిల్లులు మూతపడ్డాయిమిల్లులు మూతపడ్డాయిమిల్లులు మూతపడ్డాయి’’... రోజూ అదే కథఏ నాయకుడు వచ్చినా జర్నలిస్టులు ఒకే ఒక ప్రశ్న అడిగేవారు - “మిల్లులు మూతపడ్డాయిదాని గురించి మీరేం చేస్తారు?”. అప్పట్లో అది కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉందికానీ నేడు.. మిల్లుల సైరన్లు మోగకపోవచ్చుకానీ గుజరాత్‌లోని మూలమూలనా అభివృద్ధి పతాకం సమున్నతంగా ఎగురుతోందికొత్త పరిశ్రమలు వస్తున్నాయిఈ చర్యలన్నీ ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్ని బలోపేతం చేస్తున్నాయిఫలితంగాగుజరాత్ యువతకు ఎప్పటికప్పుడు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.  

స్నేహితులారా,

పరిశ్రమవ్యవసాయం లేదా పర్యాటకం ఏదైనా అయినా అద్భుతమైన అనుసంధానం చాలా ముఖ్యంగత 20, 25 సంవత్సరాల్లో గుజరాత్‌లో అనుసంధానం పూర్తిగా మారిపోయిందినేడు కూడా అనేక రోడ్డురైలు పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించానుసర్దార్ పటేల్ రింగ్ రోడ్డు ఇప్పుడు మరింత విస్తరణ జరగుతోందిఇది ఆరు లైన్ల రోడ్డుగా మారబోతోందిఈ రహదారి విస్తరణతో నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తగ్గనుందిఅలాగే విరంగాం–ఖుడద్–రాంపురా రహదారి విస్తరణతో రైతులకుపరిశ్రమలకు మరింత లాభం చేకూరనుందిఈ కొత్త అండర్‌పాసులురైల్వే ఓవర్‌బ్రిడ్జీలు నగర అనుసంధానాన్ని మరింత మెరుగుపరుస్తాయి.

స్నేహితులారా,

ఒకప్పటి కాలంలో పాత ఎర్ర బస్సులు మాత్రమే నడిచేవిఎక్కడికైనా వెళ్లాలంటే ‘ఎర్ర బస్సులో’నే వెళ్లాలని ప్రజలు చెప్పేవారుకానీ నేడు రోజులు మారాయిబీఆర్ టీఎస్ ‘జనమార్గ్’ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు కొత్త రవాణా సౌకర్యాలను అందిస్తున్నాయిమెట్రో రైలు కూడా వేగంగా విస్తరిస్తోందిఇది అహ్మదాబాద్ ప్రజలకు ప్రయాణ సౌలభ్యాన్ని అందిస్తుంది.

స్నేహితులారా,

గుజరాత్‌లో ప్రతి నగరం చుట్టూ పెద్ద పరిశ్రమల కారిడార్ ఉందికానీ 10 సంవత్సరాల కింద వరకుపోర్టులుపరిశ్రమల సమూహాల మధ్య మెరుగైన రైలు అనుసంధానం లేదుమీరు నన్ను 2014లో ఢిల్లీకి పంపిన తర్వాత ఈ సమస్యను పరిష్కరించేందుకు నేను పని ప్రారంభించానుగత 11 సంవత్సరాల్లో గుజరాత్‌లో దాదాపు 3,000 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్ లు వేశారు.  గుజరాత్‌లో మొత్తం రైల్వే వ్యవస్థ 100 శాతం విద్యుదీకరణగా మారిందినేడు గుజరాత్ లో ప్రారంభించిన రైల్వే ప్రాజెక్టులు రైతులుపరిశ్రమలుయాత్రికులకు మరింత సౌలభ్యాన్ని అందించనున్నాయి.

స్నేహితులారా,

నగరాల్లో నివసించే పేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించడమే మా ప్రభుత్వ లక్ష్యంఇందుకు విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించేందుకు ఏర్పడిన రామపీర్ నో టెక్రోరామపీర్ టిలాఇది  రామాపీర్ నో టేక్రోరామాపీర్ దీనికి ప్రత్యక్ష   పూజ్య బాపు ఎప్పుడూ పేదల గౌరవాన్ని ప్రాధాన్యతగా చూశారు.  నేడు సబర్మతి ఆశ్రమ ప్రవేశద్వారంలో పేదల కోసం నిర్మించిన కొత్త ఇళ్లతో ఆయన కల నెరవేరుతోంది. 1,500 పక్కా ఇళ్లు ఇవ్వడం అనేక కొత్త కలలకు పునాది వేసినట్టేఈ నవరాత్రిదీపావళికి ఈ ఇళ్లలో నివసించే ప్రజల ముఖాల్లో ఆనందం కనిపించనున్నదిపూజ్య బాపునకు నిజమైన నివాళిగా సబర్మతి ఆశ్రమ పునర్నిర్మాణం కూడా జరుగుతోందిమన దేశానికి స్ఫూర్తిగా నిలిచిన సర్దార్ పటేల్‌ ‘ఐక్యతా విగ్రహం’పూర్తి చేసిన సమయంలోనే నేను సబర్మతి ఆశ్రమ పనిని కూడా ప్రారంభించాలని అనుకున్నానుకానీ అప్పటి కేంద్ర ప్రభుత్వం మాకు మద్దతు ఇవ్వలేదుబహుశా వారు గాంధీజీకి కూడా గౌరవం ఇవ్వకపోయి ఉండొచ్చుఅందువల్ల ఆ పనిని నేను ముందుకు తీసుకెళ్లలేకపోయానుకానీ మీరు నన్ను ఢిల్లీకి పంపిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ‘ఐక్యతా విగ్రహం’ దేశానికీప్రపంచానికీ ప్రేరణ కేంద్రంగా మారినట్లే..  సబర్మతి ఆశ్రమ పునరుద్ధరణ పూర్తయిన తర్వాత.. ఈ ఆశ్రమం కూడా ప్రపంచ శాంతి కోసం గొప్ప స్ఫూర్తిని అందించబోతున్నదిస్నేహితులారాఈ మాటలు గుర్తుంచుకోండి.

స్నేహితులారా,

మన కార్మిక కుటుంబాలకు మెరుగైన జీవితం ఇవ్వడం మా లక్ష్యంఅందుకే చాలా సంవత్సరాల కిందట గుజరాత్‌లోని మురికివాడల్లో నివసించే వారి కోసం మేం పక్కా నివాస సముదాయాలను నిర్మించేందుకు ముందడుగు వేశాంగత కొన్ని సంవత్సరాల్లో గుజరాత్‌లో అనేక ప్రాజెక్టులు పూర్తయ్యాయిఅక్కడ మురికివాడల స్థానంలో ఇళ్లు నిర్మితమయ్యాయిఅలాగే ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది.

స్నేహితులారా,

ఎవరూ పట్టించుకోని వారిని కూడా నేను గౌరవిస్తానువెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యతనగరంలోని పేదల జీవితాన్ని సులభతరం చేయడం కూడా మా ప్రాధాన్యతని ఈ ఏడాది ఎర్రకోట నుంచి నేను చెప్పానుగతంలో వీధి వ్యాపారులను ఎవరూ పట్టించుకోలేదుమా ప్రభుత్వం వారి కోసం పీఎం స్వనిధి యోజన ప్రారంభించిందినేడు ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 70 లక్షల వీధి వ్యాపారులు బ్యాంకుల నుంచి రుణాలు పొందగలుగుతున్నారుఇక  గుజరాత్‌లో లక్షల మందికి లాభం చేకూర్చింది.

స్నేహితులారా,

గత 11 సంవత్సరాల్లో,  25 కోట్ల మంది పేదరికాన్ని జయించారుఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు పేదరికం నుంచి బయటపడటం ప్రపంచానికి ఒక అద్భుతం. 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు రావడాన్ని ప్రపంచంలోని అన్ని ఆర్థిక వ్యవస్థలూ చర్చిస్తున్నాయి.

స్నేహితులారా,

ఒక పేదవాడు పేదరికం నుంచి బయటపడినప్పుడు అతను మధ్యతరగతి రూపంలో కొత్తశక్తిగా ఎదుగుతాడునేడు ఈ  మధ్య తరగతిమన సంప్రదాయ మధ్యతరగతిఇద్దరూ కలిసి దేశానికి గొప్ప శక్తిగా మారుతున్నారువారిని శక్తిమంతంగా చేయడమే మా నిరంతర లక్ష్యంబడ్జెట్టులో ఆదాయపు పన్ను మినహాయింపు 12 లక్షల రూపాయల వరకు పొడిగించడం అహ్మదాబాద్‌ సహోదరులకి ఒక మంచి వార్తఅయితే ఇది ఎలా సాధ్యమైందన్నది ప్రతిపక్షాలకు బోధపడటంలేదు.

స్నేహితులారా,

మా ప్రభుత్వం జీఎస్టీలో సంస్కరణలను తీసుకురాబోతోందిసిద్దంగా ఉండండిఈ దీపావళికి మీకు పెద్ద బహుమతి సిద్ధమవుతోందిజీఎస్టీ సంస్కరణ వల్ల చిన్న వ్యాపారులకు లాభం కలగడమే కాకుండా అనేక వస్తువులపై పన్ను కూడా తగ్గనుందివ్యాపార వర్గంకుటుంబాలు ఎవరైనా ఈ దీపావళికి... అందరికీ డబుల్ బోనస్ ఆనందం లభించబోతుంది.

స్నేహితులారా,

ఇప్పుడే నేను పీఎం సూర్య ఘర్ పథకం గురించి మాట్లాడుతున్నానుపీఎమ్ సూర్య ఘర్ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారామేం విద్యుత్తు బిల్లుల భారాన్ని పూర్తిగా తొలగిస్తున్నాంఈ పథకం ద్వారా కేవలం గుజరాత్‌లోనే  దాదాపు ఆరు లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయిగుజరాత్ లోని ఈ కుటుంబాలకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలకుపైగా అందించిందిఫలితంగా ప్రతి నెలా వాళ్లు విద్యుత్తు బిల్లులపై అధిక మొత్తాన్ని ఆదా చేస్తున్నారు.

స్నేహితులారా,

అహ్మదాబాద్ నగరం నేడు కలలసంకల్పాల నగరంగా మారుతోందికానీ ఒకప్పుడు ప్రజలు అహ్మదాబాద్‌ను ‘గర్దాబాద్’ అని ఎగతాళి చేసేవారుఎక్కడ చూసినా చెత్తకుప్పలుదుమ్మూ ధూళీ కనిపించేందిఅది నగరానికి దురదృష్టంగా మారిందికానీ నేడు శుభ్రత విషయంలో దేశంలోనే అహ్మదాబాద్ మంచి పేరు తెచ్చుకుంటోందిఇది అహ్మదాబాద్ ప్రజల సహకారంతోనే సాధ్యమైంది.

మిత్రులారా,

ఈ పరిశుభ్రత.. ఈ 'స్వచ్ఛతప్రచారం కేవలం ఒక రోజు కోసం కాదుఇది ప్రతీ తరం తర్వాతి తరం కోసం ప్రతిరోజూ చేయాల్సిన పనిపరిశుభ్రతను అలవాటుగా చేసుకున్నప్పుడే మనం ఆశించిన ఫలితాలను సాధించగలం.

మిత్రులారా,

మన సబర్మతి నది ఇంతకుముందు ఎలా ఉండేదిఅది ఎండిపోయిన కాలువలా ఉండేది.. అందులో సర్కస్‌లు జరిగేవి.. పిల్లలు అక్కడ క్రికెట్ ఆడేవారుఈ పరిస్థితిని మార్చాలని అహ్మదాబాద్ ప్రజలు సంకల్పించారుఇప్పుడు సబర్మతి నదీ తీరం ఈ నగరానికే ప్రత్యేక ఆకర్షణగా ఉంది.

మిత్రులారా,

కంకారియా సరస్సులోని నీరు పిచ్చి మొక్కలతో నిండిపోయి పచ్చగా.. దుర్వాసనతో ఉండేదిదీంతో ఆ పరిసరాల్లో నడవడం కూడా కష్టంగా ఉండేదిఈ ప్రాంతమంతా అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారడంతో ఎవరూ అటువైపు వెళ్లడానికి సాహసించేవారు కాదుఅయితే నేడు ఈ సరస్సు అత్యుత్తమ వినోద ప్రదేశంగా మారిందిసరస్సులో బోటింగ్కిడ్స్ సిటీ పిల్లలకు వినోదాన్నివిజ్ఞానాన్ని పంచుతున్నాయిఇవన్నీ మారుతున్న అహ్మదాబాద్ ముఖచిత్రాన్ని ప్రతిబింబిస్తున్నాయినగరానికి తలమానికంగా మారిన కంకారియా కార్నివాల్ ఈ నగరానికి ప్రత్యేక గుర్తింపును తెస్తోంది.

మిత్రులారా,

అహ్మదాబాద్ నేడు గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతోందిఅహ్మదాబాద్ యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తింపు పొందిందినగరంలోని పాతకాలపు ద్వారాలు.. సబర్మతి ఆశ్రమం.. ఇక్కడి వారసత్వ ప్రదేశాలతో మన నగరం నేడు ప్రపంచ పటంలో ఉజ్వలంగా ప్రకాశిస్తోందిప్రస్తుతం కొత్తఆధునిక రూపాల్లో పర్యాటకం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోందిగతంలో మనం పర్యాటకం గురించి మాట్లాడేటప్పుడు అహ్మదాబాద్గుజరాత్‌ల ప్రస్తావన దసాడా కార్యాలయ రికార్డుల్లో కూడా ఉండేది కాదుఆ రోజుల్లో పర్యటనల విషయం వస్తే గుజరాత్ ప్రజలు "అబూకి వెళ్దాంఅనేవారుదక్షిణ గుజరాత్ ప్రజలు డయ్యూ-డామన్‌లకు వెళ్లేవారుఅదే మన ప్రపంచంగా ఉండేదిఆధ్యాత్మికతకు మొగ్గు చూపే పర్యాటకులు సోమనాథ్ద్వారకఅంబాజీ వంటి నాలుగైదు ప్రదేశాలకు మాత్రమే వెళ్లేవారుకానీ నేడు గుజరాత్ పర్యాటకానికి ఒక ముఖ్యమైన గమ్యస్థానంగా మారిందిరాన్ ఆఫ్ కచ్‌లోని వైట్ రాన్‌ను చూడటానికి ప్రపంచం అత్యంత ఉత్సాహం చూపుతోందిప్రజలు స్టాచ్యూ ఆఫ్ యూనిటీని చూడాలనుకుంటున్నారు.. వారు బెట్ ద్వారక వద్ద వంతెనను చూడటానికి వస్తున్నారు.. వంతెన దాటడం కోసం వాహనాల నుంచి దిగి మరీ దానిపై నడుస్తూ ఆనందిస్తున్నారుమిత్రులారా.. మీరు ఒక సంకల్పం తీసుకుంటే ఫలితాలు తప్పకుండా వస్తాయినేడు అహ్మదాబాద్ కచేరీల ఆర్థిక వ్యవస్థకు ప్రధాన కేంద్రంగా మారుతోందికొన్ని నెలల కిందట ఇక్కడ జరిగిన కోల్డ్‌ప్లే కచేరీ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగిందిలక్ష మంది కూర్చునే సామర్థ్యం గల అహ్మదాబాద్ స్టేడియం కూడా ప్రధాన ఆకర్షణగా ఉందిఅహ్మదాబాద్ గొప్ప కచేరీలతో పాటు ప్రధాన క్రీడా కార్యక్రమాలను కూడా నిర్వహించగలదని ఇది చాటుతోంది.

మిత్రులారా,

నేను మొదట పండుగల గురించి మాట్లాడానుఇది పండుగల కాలం నవరాత్రివిజయదశమిధంతేరాస్దీపావళి వంటి పండుగలన్నీ వస్తున్నాయిఇవి మన సంస్కృతికి సంబంధించిన పండుగలుఅయితే వాటిని స్వయం సమృద్ధిపండుగలుగా మార్చాలినేను మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.. పూజ్య బాపూజీ భూమి నుంచి దేశపౌరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నానుమనం మన జీవితాల్లో ఒక మంత్రాన్ని స్వీకరించాలిమనం ఏది కొన్నా అది భారత్‌లో తయారైనదై ఉండాలిఅది స్వదేశీ వస్తువై ఉండాలిగృహాలంకరణ కోసం మీరు మన దేశంలో తయారైన వస్తువులే కొనాలిమిత్రులారా.. బహుమతుల కోసం కూడా మన దేశంలో తయారు చేసిన వాటినే ఎంచుకోండినేను ముఖ్యంగా దుకాణదారులకువ్యాపారులకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానుమీరు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి గొప్ప సహకారం అందించవచ్చుదీనికోసం మీరు విదేశీ వస్తువులను అమ్మకూడదని గట్టిగా నిర్ణయించుకోండిమీ దుకాణాల ఎదుట "ఇక్కడ స్వదేశీ వస్తువులు మాత్రమే అమ్ముతారుఅని గర్వంగా ఒక బోర్డును ఉంచండిమన ఈ చిన్న ప్రయత్నంతో ఈ పండుగలు భారత శ్రేయస్సు కోసం గొప్ప వేడుకలుగా మారుతాయి.

మిత్రులారా,

మొదట్లో చాలాసార్లు ప్రజలు నిరాశ చెంది ఉండవచ్చునేను మొదటిసారి రివర్‌ఫ్రంట్ గురించి మాట్లాడినప్పుడు అందరూ దానిని ఎగతాళి చేయడం నాకు ఇంకా గుర్తుందిమరి “రివర్‌ఫ్రంట్ వచ్చిందా లేదా?” నేను స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గురించి విలేకరుల సమావేశంలో ప్రకటించినప్పుడు అందరూ “ఎన్నికలు వస్తున్నాయిఅందుకే మోదీజీ దీనిని ప్రస్తావిస్తున్నారు” అని వ్యంగ్యంగా మాట్లాడారుకానీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీని నిర్మించామా లేదానేడు ప్రపంచమంతా దానిని ఆశ్చర్యంగా చూస్తోందా లేదానేను కచ్‌లోని రాన్ ఉత్సవ్ గురించి మాట్లాడినప్పుడూ.. “కచ్‌కు ఎవరు వెళతారురాన్‌కు ఎవరు వెళతారు?” అని అందరూ అడిగారుకానీ నేడు అక్కడ ప్రజలు బారులు తీరారుఆరు నెలల ముందుగానే అక్కడికి వెళ్లడం కోసం ప్రయాణాలు బుక్ చేసుకుంటున్నారుఇది జరిగిందా లేదాగుజరాత్‌లో ఒక విమాన తయారీ కర్మాగారం ఏర్పాటవుతుందని ఎవరైనా ఊహించారానేను మొదటిసారి గిఫ్ట్ సిటీ గురించి వివరించినప్పుడు అది అసాధ్యమని అందరూ వాదించారుఅలాంటి భవనాలు ఎలా నిర్మించవచ్చని అడిగారుకానీ ఇప్పుడు గిఫ్ట్ సిటీ దేశానికే తలమానికంగా ఉందిఈ దేశ సామర్థ్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలనే నేను ఇవన్నీ మీకు గుర్తు చేస్తున్నానుమీరు మీ సంకల్పాన్ని గౌరవిస్తే.. దాని కోసం అంకితభావంతో కృషి చేస్తూ ఉంటే భారత ప్రజలు మీ సంకల్పాన్ని ఎప్పటికీ విఫలం కానివ్వరుదాని కోసం వారు తమ చెమటనూరక్తాన్ని ధారపోస్తారుగతంలో అనేక ఉగ్రవాద దాడులు జరిగిన తర్వాత కూడా శత్రువును భారత్ ఏమీ చేయలేదనే నమ్మకం ఉండేదికానీ భారత్ మెరుపు దాడులు చేసి వారి లాంచింగ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిందివైమానిక దాడులతో ఉగ్రవాదుల శిక్షణా కేంద్రాలను నాశనం చేసిందిఆపరేషన్ సిందూర్ నిర్వహించి ఉగ్రమూలాలపై దాడి చేసిందిచంద్రయాన్ ద్వారా ఇంతకుముందు ఎవరూ వెళ్లని చంద్రుని దక్షిణధృవంలోని శివశక్తి పాయింట్ వద్ద దిగి మన త్రివర్ణ పతాకాన్ని భారత్ ఎగురవేసిందిశుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారుఇప్పుడు గగన్‌యాన్‌ కోసం సన్నాహాలు జరుగుతున్నాయిమన సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించడానికి కృషి జరుగుతోందిమిత్రులారా.. మన విశ్వాసంతోఅంకితభావంతోదేవుని స్వరూపమైన ప్రజల ఆశీర్వాదంమద్దతుతో తప్పక విజయం లభిస్తుందని ఈ ప్రతీ సంఘటన రుజువు చేస్తుందిఅదే విశ్వాసంతో మన దేశం స్వయంసమృద్ధి సాధించగలదని నేను చెబుతున్నానుదేశంలోని ప్రతి పౌరుడు "స్థానిక స్వరంకోసం ప్రచారకర్తగా ఉండి.. ప్రతి పౌరుడూ స్వదేశీ మంత్రం ఆచరిస్తూ ఉంటే.. మనం ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఇంకెప్పుడూ ఉండదు.

మిత్రులారా,

గతంలో ప్రపంచంలో ఎక్కడో తయారు చేసిన టీకాలు మన దేశానికి చేరుకోవడానికి 30-40 సంవత్సరాలు పట్టేదిఅందుకే కోవిడ్ సమయంలో ఏమి జరుగుతుందోనని ప్రజలంతా సందేహించారుఅయితే మన దేశం బలంగా నిర్ణయించుకుందిఅందుకే సొంతంగా టీకాను తయారుచేసి 140 కోట్ల మంది పౌరులకు విజయవంతంగా అందించిందిఇదే మన దేశపు బలంఆ బలంపై నమ్మకంతో గుజరాత్‌లోని నా తోటి మిత్రులకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానుమీరు నాకు నేర్పిన పాఠాలుమీరు నాకు నేర్పిన విధానాలుమీరు నాలో నింపిన శక్తిఉత్సాహంతో.. 2047 నాటికి అంటే భారత్ 100 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలు జరుపుకునే సమయానికి మన దేశం 'వికసిత్ భారత్గా మారుతుందని కచ్చితంగా చెబుతున్నాను.

మిత్రులారా,

'వికసిత్ భారత్లక్ష్యాన్ని చేరుకోవడం కోసం స్వదేశీ (దేశీయ స్వయంసమృద్ధిఒక ముఖ్యమైన రహదారిమరో ముఖ్యమైన రహదారి ఆత్మనిర్భర్ భారత్ (స్వయంసమృద్ధ భారత్). వస్తువులను రూపొందించి.. తయారు చేసి.. ఉత్పత్తి చేసే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.. మీ నాణ్యతను నిరంతరం మెరుగుపరుచుకుంటూ ఉండండిమీ ఖర్చులను తగ్గించుకుంటూ ఉండండిమీరే చూస్తారు.. భారత ప్రజలు ఇకమీదట ఎప్పుడూ బయటి నుంచి ఏమీ కొనే అవసరం ఉండదుమనం ఈ స్ఫూర్తిని మేల్కొల్పి ప్రపంచం ఎదుట ఉదాహరణగా నిలవాలిమిత్రులారా.. సంక్షోభం ఎదురైనప్పుడు నమ్మకంగాదృఢంగా నిలబడి అనుకున్న ఫలితాలను సాధించే దేశాలు చాలానే ఉన్నాయిమనకు కూడా ఇది ఒక మంచి అవకాశంమన సంకల్పాన్ని నెరవేర్చుకునే శక్తితో మనం ముందుకు సాగాలిగుజరాత్ ఎల్లప్పుడూ నాకు మద్దతు ఇచ్చినట్లే.. యావత్ దేశమూ నాకు మద్దతునిస్తోందిమన దేశం కచ్చితంగా 'వికసిత్ భారత్గా మారుతుందని నాకు పూర్తి నమ్మకం ఉందిఈ విలువైన అభివృద్ధి కానుకలను అందుకున్న సందర్భంలో మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలుగుజరాత్ మరింత గొప్ప పురోగతి సాధించాలి.. సరికొత్త శిఖరాలను చేరుకోవాలి.. గుజరాత్‌ బలం దాని చర్యల వల్లే నిరూపితమవుతుందిమీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానుఇప్పుడు మీరంతా పూర్తి బలంతో నాతో పాటు ఇలా చెప్పండి:

భారత్ మాతాకీ జైభారత్ మాతాకీ జైభారత్ మాతాకీ జై!

ధన్యవాదాలు!

గమనికప్రధానమంత్రి గుజరాతీలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం.

 

***


(Release ID: 2160924)