ప్రధాన మంత్రి కార్యాలయం
ఫిజీ ప్రధాని శ్రీ సిటీవేనీ రాబుకా భారత్ పర్యటన... ఈ సందర్భంగా కుదిరిన ఒప్పందాలు
Posted On:
25 AUG 2025 1:58PM by PIB Hyderabad
I. ద్వైపాక్షిక పత్రాలు:
1. ఫిజీలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రూపకల్పన, నిర్మాణం, కార్యకలాపాల ప్రారంభం, నిర్వహణ, మరమ్మతుల కోసం భారత్ ప్రభుత్వానికీ, ఫిజీ ప్రభుత్వానికీ మధ్య అవగాహన ఒప్పంద పత్రం.
2. జన ఔషధి పథకంలో భాగంగా మందుల సరఫరాకు సంబంధించి మెస్సర్స్ హెచ్ఎల్ఎల్ లైఫ్కేర్కు, ఫిజీ ఆరోగ్య, వైద్య సేవల మంత్రిత్వ శాఖకు మధ్య ఒప్పందం.
3. ప్రమాణీకరణ రంగంలో సహకారం అంశంపై ఫిజీ ప్రభుత్వం తరఫున వాణిజ్యం, సహకార సంఘాలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖకు, భారత ప్రమాణాల మండలి (బీఐఎస్), నేషనల్ మెజర్‌మెంట్ అండ్ స్టాండర్డ్‌స్ (డీఎన్‌టీఎంఎస్)విభాగానికీ మధ్య అవగాహన ఒప్పంద పత్రం.
4. మానవ సామర్థ్యాల పెంపుదల, నైపుణ్యాలకు మెరుగులు దిద్దడం.. ఈ రంగంలో సహకారాంశంపై ‘ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటీ) సంస్థకీ, ఫిజీకి చెందిన పసిఫిక్ పాలీటెక్‌కు మధ్య అవగాహన ఒప్పంద పత్రం.
5. క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ (క్యూఐపీ) అమలు కోసం భారతీయ గ్రాంటు రూపేణా సహాయాన్ని అందజేయడానికి సంబంధించి భారత ప్రభుత్వానికీ, ఫిజీ ప్రభుత్వానికీ మధ్య అవగాహన ఒప్పంద పత్రం.
6. భారత ప్రభుత్వానికీ, ఫిజీ ప్రభుత్వానికీ మధ్య వలస, అనుసంధాన అంశాలపై ఉద్దేశ ప్రకటన (ఇంటెంట్ డిక్లరేషన్).
7. సువాలోని భారతీయ ఛాంసరీ భవనం లీజ్ డీడ్‌ను ఫిజీ పక్షం అందజేసింది.
8. భారత్, ఫిజీల సంయుక్త ప్రకటన: ‘ వైలోమానీ దోస్తీ’ భావనతో భాగస్వామ్యం.
II. ప్రకటనలు:
1. వచ్చే ఏడాది (2026)లో ఫీజీకి చెందిన గ్రేట్ కౌన్సిల్ ఆఫ్ చీఫ్స్ ప్రతినిధి వర్గంతో పాటు ఆ దేశ పార్లమెంటుకు చెందిన ప్రతినిధిమండలి భారత్‌లో పర్యటన ఖరారు.
2. ఈ ఏడాదే భారతీయ నౌకాదళానికి చెందిన ఒక నౌక ఫిజీలోని ఓడరేవును సందర్శిస్తుంది.
3. ఫిజిలో భారత హైకమిషన్ కార్యాలయంలో డిఫెన్స్ అటాచీ పదవిని ఏర్పాటు చేస్తారు.
4. రాయల్ ఫిజీ మిలిటరీ ఫోర్సెస్‌కు కానుకగా అంబులెన్సులు.
5. ఫిజీలో సైబర్ భద్రత శిక్షణ విభాగం (సీఎస్‌టీసీ) ఏర్పాటు.
6. ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్‌లో చేరిన ఫిజీ.
7. భారత పరిశ్రమ సమాఖ్య (సీఐఐ)కీ, ఫిజీ వాణిజ్య, యాజమాన్యాల సమాఖ్య (ఎఫ్‌సీఈఎఫ్)కూ మధ్య అవగాహన ఒప్పంద పత్రం.
8. జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (ఎన్ఏబీఏఆర్‌డీ.. ‘నాబార్డ్’)కూ, ఫిజీ అభివృద్ధి బ్యాంకుకూ మధ్య అవగాహన ఒప్పందం.
9. ఫిజీ విశ్వవిద్యాలయానికి హిందీ, సంస్కృత ఉపాధ్యాయుడిని పంపిస్తారు.
10. చక్కెర పరిశ్రమ, బహుళ జాతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంచార భూసార పరీక్ష ప్రయోగశాల సరఫరా.
11. చక్కెర పరిశ్రమ, బహుళ జాతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో ఫిజీ చక్కెర పరిశోధన సంస్థకు వ్యావసాయిక డ్రోన్ల సరఫరా.
12. ఫిజీకి చెందిన పండితుల సమూహం భారత్‌లో శిక్షణ పొందడానికి తగిన సహాయాన్ని అందిస్తారు.
13. ఫిజీలో జైపూర్ ఫుట్ క్యాంపును నిర్వహిస్తారు. ఇలాంటి శిబిరాన్ని అక్కడ నిర్వహించడం ఇది రెండో సారి.
14. ‘హీల్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా భారత్‌లో ప్రత్యేక వైద్య చికిత్స సదుపాయాన్ని అందుబాటులో ఉంచుతారు.
15. క్రికెట్ ఫిజీ అవసరాలకు భారత్ నుంచి క్రికెట్ కోచ్‌ను పంపుతారు.
16. ఫిజీ షుగర్ కార్పొరేషన్ కు ఐటీఈసీ నిపుణుడి సేవలను అందించనున్నారు. దీంతో పాటు చక్కెర పరిశ్రమ సిబ్బందికి ప్రత్యేకంగా ఐటీఈసీ శిక్షణను సమకూరుస్తారు.
17. ఫిజీ మార్కెట్లలో భారతీయ నెయ్యి విక్రయానికి అనుమతి.
***
(Release ID: 2160570)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam