భారత ఎన్నికల సంఘం
ఉపరాష్ట్రపతి ఎన్నికలు-2025కు సంబంధించి పరిశీలకులను నియమించిన ఎన్నికల సంఘం
Posted On:
21 AUG 2025 8:08PM by PIB Hyderabad
1. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 కింద పొందిన అధికారాలకు అనుగుణంగా భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికలు-2025కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి హోదా కలిగిన ఇద్దరు అధికారులను పరిశీలకులుగా నియమించింది.
2. 2025 ఆగస్టు 7న ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు 2025 సెప్టెంబర్ 9న జరగనుంది. ఈ కింది అధికారులను పరిశీలకులుగా నియమించారు.
3. కింది అధికారులను పరిశీలకులుగా నియమించారు:
* శ్రీ సుశీల్ కుమార్ లోహాని, ఐఏఎస్ (ఒడిశా: :1995), అదనపు కార్యదర్శి, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ.
* శ్రీ డీ. ఆనందన్, ఐఏఎస్ (సిక్కిం: 2000), అదనపు కార్యదర్శి, వ్యయ విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖ.
4. శ్రీ నితిన్ కుమార్ శివదాస్ ఖాడే, ఐఏఎస్ (అస్సాం-మేఘాలయ: 2004), సంయుక్త కార్యదర్శి, భూ వనరుల శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ.. ఈయనను రిజర్వ్ జాబితాలో ఉంచారు.
***
(Release ID: 2159575)