ప్రధాన మంత్రి కార్యాలయం
లెక్స్ ఫ్రిడ్‌మన్ తో విశ్లేషణాత్మక సంభాషణలో పాల్గొన్న ప్రధాన మంత్రి
Posted On:
15 MAR 2025 7:01PM by PIB Hyderabad
ప్రఖ్యాత పాడ్ కాస్ట్ వ్యాఖ్యాత, ఏఐ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్‌మన్ తో ప్రధాన మంత్రి, శ్రీ నరేంద్ర మోదీ విశ్లేషణాత్మక సంభాషణలో పాల్గొన్నారు. మూడు గంటల పాటు సాగిన ఈ సంభాషణలో విభిన్న అంశాలపై చర్చించారు. ప్రధాన మంత్రి మోదీ చిన్ననాటి జ్ఞాపకాలు, హిమాలయాల్లో ఆయన గడిపిన క్షణాలు, ప్రజా జీవితంలో ఆయన ప్రయాణంపై మాట్లాడారు. అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ మూడు గంటల పోడ్‌కాస్ట్ రేపు అంటే మార్చి 16, 2025న విడుదల కానుంది. ఈ సంభాషణను తన జీవితంలో "అత్యంత ప్రభావవంతమైన సంభాషణల్లో ఒకటి"గా లెక్స్ ఫ్రిడ్‌మన్ అభివర్ణించారు..
రాబోయే పాడ్ కాస్ట్ గురించి లెక్స్ ఫ్రిడ్‌మన్ 'ఎక్స్'లో చేసిన పోస్టుకు స్పందిస్తూ, శ్రీ మోదీ ఎక్స్‌లో ఇలా పేర్కొన్నారు;
"@lexfridmanతో ఆసక్తికర సంభాషణ జరిగింది. నా బాల్యానికి సంబంధించిన జ్ఞాపకాలు, హిమాలయాల్లో గడిపిన సమయం, ప్రజా జీవితంలో నా ప్రయాణం వంటి విభిన్న అంశాలను చర్చించాం.
ఈ సంభాషణలో మీరు కూడా భాగస్వాములై తప్పక వీక్షించండి”
***
(Release ID: 2159143)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam