సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
‘భాషాసేతు’ చాలెంజ్‌తో భారతీయ భాషల్లో ఏఐ ఆధారిత కచ్చితమైన అనువాదానికి ఊతం
· తొలుత 12 భాషల్లో.. త్వరలో సంస్కృతం, డోగ్రీ సహా మరో 10 భాషలకు విస్తరణ
· బహుభాషా భారత్ కోసం.. దేశీయ ఏఐ/ఎంఎల్ ఆవిష్కరణలకు ప్రభుత్వ ప్రోత్సాహం
प्रविष्टि तिथि:
20 AUG 2025 5:27PM by PIB Hyderabad
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వివిధ భారతీయ భాషల్లోని అంశాలను అనువదించడం ‘భాషా సేతు’ చాలెంజ్ లక్ష్యం. కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్‌ను ఉపయోగించి భారతీయ భాషల కోసం కచ్చితమైన అనువాద మార్గాలను అభివృద్ధి చేసే అంకుర సంస్థలకు ప్రోత్సాహాన్ని అందించడం దీని లక్ష్యం.
ఈ చాలెంజ్ ద్వారా 12 భాషల్లో ప్రతిపాదిత సాంకేతికతను అభివృద్ధి చేయనున్నారు: అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, హిందీ, ఒరియా, పంజాబీ, తెలుగు, తమిళం, ఉర్దూ.
విస్తరణకు అనుకూలంగా, మాడ్యులర్ విధానంలో దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో మరో 10 భాషలను అదనంగా చేర్చే అవకాశం ఉంది: కాశ్మీరీ, కొంకణి, మణిపురి, నేపాలీ, సంస్కృతం, సింధీ, బోడో, సంతాలి, మైథిలి, డోగ్రీ.
కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈ రోజు లోక్‌సభలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(रिलीज़ आईडी: 2158731)
आगंतुक पटल : 22