ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉపాధి కల్పనపై నిర్వహించిన బడ్జెట్ అనంతర వెబినార్‌ను ఉద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం

Posted On: 05 MAR 2025 3:16PM by PIB Hyderabad

నమస్కారం!

ముఖ్యమైన ఈ బడ్జెట్ వెబినార్‌కు హాజరైన మీ అందరికీ స్వాగతంప్రజలుఆర్థికంఆవిష్కరణల్లో పెట్టుబడులు అనే ఈ ఇతివృత్తం అభివృద్ధి చెందిన భారత్‌కు దారి చూపిస్తుందిఈ ఏడాది బడ్జెట్లో దీని ప్రభావం విస్తృత స్థాయిలో కనిపించిందిఅందుకే ఇది దేశ భవిష్యత్తుకు బ్లూప్రింట్‌గా మారిందిమౌలిక సదుపాయాలుపరిశ్రమలుప్రజలుఆర్థిక వ్యవస్థఆవిష్కరణల్లో పెట్టుబడులకు సమప్రాధాన్యం ఇస్తున్నాంసామర్థ్య నిర్మాణంప్రతిభను ప్రోత్సహించడం దేశ ప్రగతికి పునాదుల వంటివని మీ అందరికీ తెలుసుకాబట్టితదుపరి దశ అభివృద్ధికి ఈ రంగాల్లో మనం పెట్టుబడులు పెట్టాలిదీనికోసం పెట్టుబడిదారులు అందరూ ముందుకు రావాలిఎందుకంటే ఇది దేశ ఆర్థిక విజయానికి అవసరంఅదే సమయంలో ప్రతి సంస్థ విజయానికి అదే ఆధారం.

స్నేహితులారా,

మూడు ప్రధానాంశాలపై ప్రజలపై పెట్టుబడి అనే అంశం ఆధారపడి ఉంది విద్యనైపుణ్యంఆరోగ్య సంరక్షణచాలా ఏళ్ల తర్వాత భారతీయ విద్యా వ్యవస్థ గణనీయమైన మార్పులను సంతరించుకోవడాన్ని మీరు ప్రస్తుతం చూస్తున్నారుజాతీయ విద్యా విధానంఐఐటీల విస్తరణవిద్యావ్యవస్థలో సాంకేతికతను ఏకీకృతం చేయడంఏఐ సామర్థ్యాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవడంపాఠ్య పుస్తకాల డిజిటలీకరణ, 22 భారతీయ భాషల్లో పాఠ్యాంశాలను అందుబాటులో ఉంచడం సహా తదితర ప్రయత్నాలన్నీ యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నాంవీటి కారణంగా భారతీయ విద్యావ్యవస్థ 21వ శతాబ్దపు ప్రపంచ అవసరాలుప్రమాణాలకు అనుగుణంగా ఉంది.

మిత్రులారా,

2014 నుంచి ఇప్పటి వరకు మూడు కోట్లకు పైగా యువతకు ప్రభుత్వం నైపుణ్య శిక్షణ అందించింది. 1,000 ఐటీఐ సంస్థలను మెరుగుపరచడానికి, 5 ఎక్సలెన్స్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు మేం ప్రకటించాంపారిశ్రామిక అవసరాలకు తగినట్టుగా యువతకు శిక్షణ అందిచాలనేదే మా లక్ష్యంఈ అంశంలో ప్రపంచ స్థాయిలో పోటీపడేలా మన యువతను తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ స్థాయి నిపుణుల సాయాన్ని మేం తీసుకుంటున్నాంఈ ప్రయత్నాల్లో మన పరిశ్రమలకువిద్యాసంస్థలు ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయిపరిశ్రమలువిద్యా సంస్థలు ఒకరి అవసరాలు ఒకరు అర్థం చేసుకొని దానికి తగినట్టుగా సిద్ధం కావాలివేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి అనుగుణంగా మారడానికిపరిస్థితులపై అవగాహన పెంచుకోవడానికిప్రయోగాత్మకంగా నేర్చుకోవడానికి తగిన అవకాశం యువతకు ఇవ్వాలిఅందుకే యువతలో ప్రయోగాత్మక నైపుణ్యాలు పెంపొందించేందుకు పీఎం ఇంటర్న్‌షిప్ పథకం ప్రారంభించాంఈ పథకంలో అన్ని స్థాయుల్లోనూ గరిష్ఠ సంఖ్యలో సంస్థలు భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.

స్నేహితులారా,

ఈ బడ్జెట్లో 10 వేల అదనపు మెడికల్ సీట్లను మేం ప్రకటించాంవైద్య విద్యా సంస్థల్లో రానున్న ఏళ్లలో మరో 75 వేల సీట్లను పెంచడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాంఈ రంగంలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టెలి మెడిసిన్ సౌకర్యాలను విస్తరిస్తున్నాండే కేర్ క్యాన్సర్ సెంటర్లుడిజిటల్ ఆరోగ్య సేవల మౌలిక సదుపాయాలను విస్తరించడం ద్వారా సమాజంలోని చివరి వ్యక్తికి సైతం నాణ్యమైన వైద్య సేవలు అందించాలని మేం భావిస్తున్నాంఇది ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకు వస్తుందో ఒక్కసారి ఊహించండిఈ ప్రయత్నం యువతకు ఎన్నో ఉద్యోగావకాశాలను కల్పిస్తుందిదీన్ని సాధ్యం చేయడానికి మీరంతా వేగంగా పనిచేయాల్సి ఉంటుందిఅప్పుడే బడ్జెట్ ప్రకటనల ప్రయోజనాలను మరింత ఎక్కువ మందికి చేర్చగలుగుతాం.

మిత్రులారా,

గడచిన దశాబ్దంలో భవిష్యత్ లక్ష్యాలకు తగినట్టుగా ఆర్థిక రంగంలో పెట్టుబడులు తీసుకువచ్చాంమీ అందరికీ తెలుసు, 2047 నాటికి భారతీయ పట్టణ జనాభా 90 కోట్లకు చేరుకుంటుందిఇంత పెద్ద మొత్తంలోని జనాభాకు ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ చాలా అవసరందీని కోసమేరూలక్ష కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టాంఇది పరిపాలనమౌలిక సదుపాయాలుఆర్థిక స్థిరత్వంతో పాటు ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తుందిమన ప్రైవేటు రంగం ముఖ్యంగా రియల్ ఎస్టేట్పరిశ్రమలు ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణపై దృష్టి సారించి దాన్ని ముందుకు తీసుకెళ్లాలిఅమృత్ 2.0, జల్ జీవన్ మిషన్ లాంటి పథకాలను ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కలిసి పనిచేయాలి.

మిత్రులారా,

ప్రస్తుతం ఆర్థికరంగంలో పెట్టుబడుల గురించి ఆలోచించేటప్పుడుపర్యాటకంలో ఉన్న అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించాలిమన జీడీపీకి పర్యాటక రంగం 10 శాతం వరకు తోడ్పాటు అందించగలదని అంచనా వేస్తున్నారుకోట్ల మంది యువతకు ఉపాధి కల్పించే సామర్థ్యం ఈ రంగానికి ఉందిఅందుకే దేశీయఅంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా ఈ బడ్జెట్లో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాందీనిలో భాగంగా దేశ వ్యాప్తంగా 50 పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయనున్నాంఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా హోటళ్లను అభివృద్ధి చేయడం ద్వారా స్థానికంగా ఉపాధిని మెరుగుపరచవచ్చుహోం-స్టేలకు ఊతమిచ్చేలా ముద్ర యోజన పథకాన్ని విస్తరించాం. ‘హీల్ ఇన్ ఇండియా’, ‘ల్యాండ్ ఆఫ్ బుద్ధ’ తరహా ప్రచార కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్షిస్తాయిఅంతర్జాతీయ పర్యాటకఆరోగ్య కేంద్రంగా భారత్‌ను అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నాలు చేపడుతున్నాం.

స్నేహితులారా,

హోటల్రవాణా మాత్రమే కాకుండా టూరిజానికి సంబంధించిన ఇతర రంగాల్లో సైతం నూతన అవకాశాలు ఉన్నాయికాబట్టి మన దేశంలో ఆరోగ్య పర్యాటకాన్ని పెంపొందించేలా ఆ రంగానికి సంబంధించిన నిపుణులు పెట్టుబడులు పెట్టిఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలియోగావెల్‌నెస్ టూరిజానికి ఉన్న సంపూర్ణ సామర్థ్యాన్ని మనం వినియోగించుకోవాలిఈ దిశగా సమగ్ర చర్చలు సమర్థమైన ప్రణాళిక దిశగా మనం ముందుకు సాగాలి.

స్నేహితులారా,

ఆవిష్కరణల్లో పెట్టుబడులే దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయిభారత ఆర్థిక వ్యవస్థకు కొన్ని లక్షల కోట్ల రూపాయలను జోడించగల సామర్థ్యం ఏఐకు ఉందిఅందుకే ఈ దిశగా మనం వేగంగా ముందుకు సాగాలిఏఐ ఆధారిత విద్యపరిశోధనకు ఈ బడ్జెట్లో రూ.500 కోట్లను కేటాయించాంఏఐ సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు నేషనల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌ను ప్రారంభిస్తాంఈ అంశంలో మన ప్రైవేటు రంగం ప్రపంచం కంటే ఒక అడుగు ముందుండాల్సిన అవసరం ఉందిఏఐ ఆధారిత పరిష్కారాలు అందించే నమ్మకమైనసురక్షితమైనప్రజాస్వామ్య దేశం కోసం ప్రపంచం ఎదురుచూస్తోందిఈ రంగంలో మీరు ఎంత పెట్టుబడి పెడితేభవిష్యత్తులో మీకు అంత మేలు జరుగుతుంది.

స్నేహితులారా,

ఇప్పుడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్థగా భారత్ ఎదిగిందిఈ అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు మా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందిపరిశోధనఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రూలక్ష కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశాంఇది డీప్ టెక్ అంకుర సంస్థలకు కేటాయించిన నిధులతో పాటుగా నూతనంగా ఆవిర్భవిస్తున్న రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తుందిఐఐటీలుఐఐఎస్‌సీల్లో 10 వేల రీసెర్చి ఫెలోషిప్‌లు అందించాంఇది పరిశోధనను ప్రోత్సహించడంతో పాటుప్రతిభ గల యువతకు అవకాశాలను కల్పిస్తుందిజాతీయ జియో-స్పేషియల్ మిషన్నేషనల్ రీసెర్చి ఫౌండేషన్ ద్వారా ఆవిష్కరణలు వేగాన్ని అందుకుంటాయిపరిశోధనఆవిష్కరణల రంగంలో భారత్‌ను ఉన్నత స్థానానికి తీసుకెళ్లేందుకు అన్ని స్థాయుల్లోనూ మనం కలసి పనిచేయాలి.

స్నేహితులారా,

జ్ఞాన భారతం కార్యక్రమంలో పాల్గొనేందుకు మీరంతా ముందుకు వస్తారని ఆశిస్తున్నారుజ్ఞాన భారతం ద్వారా పురాతన రాత ప్రతులను పరిరక్షించడం చాలా ముఖ్యంఈ కార్యక్రమం ద్వారా కోటికి పైగా రాతప్రతులను డిజిటలీకరించనున్నాంఆ తర్వాత ఏర్పాటయ్యే జాతీయ డిజిటల్ భాండాగారం ద్వారా భారతీయ చారిత్రకసంప్రదాయ విజ్ఞానంమేధస్సు గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులుపరిశోధకులు తెలుసుకుంటారుమొక్కల జన్యు వనరులను సంరక్షించేందుకు జాతీయ జన్యు బ్యాంకును ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందిభవిష్యత్తు తరాలకు జన్యు వనరులు అందించడంతో పాటు ఆహార భద్రతకు భరోసా ఇవ్వడమే కార్యక్రమ లక్ష్యంఈ తరహా ప్రయత్నాల పరిధిని మేం విస్తరించాంవిభిన్న సంస్థలురంగాలు ఈ తరహా ప్రయత్నాల్లో భాగస్వాములు కావాలి.

స్నేహితులారా,

గత నెలలో భారత ఆర్థిక వ్యవస్థ గురించి ఐఎంఎఫ్ చేసిన గొప్ప విశ్లేషణను మనం చూశాంఈ నివేదిక ఆధారంగా 2015 నుంచి 2025 వరకు ఉన్న పదేళ్ల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ 66 శాతం వృద్ధి నమోదు చేసిందిఇప్పుడు భారత్ 3.8 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందిపెద్ద ఆర్థిక వ్యవస్థలు సాధించిన దానికంటే ఈ వృద్ధి చాలా ఎక్కువఅయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగే రోజు ఎంతో దూరంలో లేదుమనం సరైన మార్గంలోసరిగా పెట్టుబడులు పెడుతూ మన ఆర్థిక వ్యవస్థను విస్తరించాలిబడ్జెట్లో ప్రకటించిన అంశాలను అమలు చేయడం కూడా ఈ అంశంలో ప్రధాన పాత్ర పోషిస్తుందిఇందులో మీకు కూడా కీలకమైన పాత్ర ఉంది.

మీ అందరికీ నా శుభాకాంక్షలుబడ్జెట్ ప్రకటించిన అనంతరం... మా పని మేం చేశాంమీ పని మీరు చేయండి అనే సంస్కృతిని కొన్నేళ్లలో రూపుమాపగలిగామని నేను నమ్ముతున్నానుబడ్జెట్ రూపొందించడానికి ముందుప్రకటించిన తర్వాత మీతో మేం చర్చిస్తున్నాంఏదైనా అమలు చేయాల్సి వచ్చిన సందర్భంలోనూ మీతో చర్చలు జరుపుతున్నాంబహుశా ప్రజలను భాగస్వామ్యం చేసే ఇలాంటి పద్ధతులు అరుదుఈ మేధోమథన కార్యక్రమంలో ప్రతి ఏటా ప్రజల భాగస్వామ్యం పెరుగుతోందిబడ్జెట్ తర్వాత అమలులో ఉపయోగపడే అంశాల కంటే బడ్జెట్ ముందు చర్చించే అంశాలే చాలా ముఖ్యమైనవని అందరూ భావిస్తున్నారుఈ మేధో మథనం మన, 140 కోట్ల మంది దేశ ప్రజల కలలను నెరవేరుస్తుందని నమ్ముతున్నానుమీ అందరికీ శుభాకాంక్షలు.

ధన్యవాదాలు

సూచనప్రధాని హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం.

 

***


(Release ID: 2158710) Visitor Counter : 9