ప్రధాన మంత్రి కార్యాలయం
భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా తిరు సి.పి. రాధాకృష్ణన్ జీని
నామినేట్ చేసిన నిర్ణయాన్ని స్వాగతించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
Posted On:
17 AUG 2025 8:54PM by PIB Hyderabad
భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా తిరు సి.పి. రాధాకృష్ణన్ జీని నామినేట్ చేసిన నిర్ణయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు స్వాగతించారు.
ఆయన "ఎక్స్"లో రాసిన ఒక పోస్టులో ఇలా పేర్కొన్నారు:
“తన సుదీర్ఘ ప్రజా జీవితంలో తిరు సి.పి. రాధాకృష్ణన్ జీ అంకితభావం, వినయం, మేధ తో ప్రత్యేక గుర్తింపు పొందారు. తాను చేపట్టిన వివిధ బాధ్యతల్లో ఎల్లప్పుడూ సమాజ సేవ, అణగారిన వర్గాల సాధికారత పైనే దృష్టి పెట్టారు. తమిళనాడులో గ్రామీణ స్థాయిలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయనను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మన కూటమి తరఫున నామినేట్ చేయాలని ఎన్డీయే నిర్ణయించడం సంతోషకరం”.
“తిరు సి.పి. రాధాకృష్ణన్ జీ ఎంపీగా, వివిధ రాష్ట్రాల్లో గవర్నరుగా విశేష అనుభవాన్ని సంపాదించారు. పార్లమెంటులో ఆయన ఎల్లప్పుడూ ప్రయోజనకరమైన ప్రసంగాలు చేశారు . గవర్నర్ పదవిలో ఉన్నప్పుడు సామాన్య ప్రజలు ఎదుర్కొనే సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి పెట్టారు. ఈ అనుభవాల తో శాసన, రాజ్యాంగ సంబంధిత అంశాలపై ఆయనకు విస్తృత పరిజ్ఞానం లభించింది. ఆయన ఆదర్శవంతమైన ఉపరాష్ట్రపతిగా నిలుస్తారన్ననమ్మకం నాకుంది”.
***
(Release ID: 2157596)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam